Don't Miss!
- Finance
Wheat Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గనున్న గోధుమ పిండి ధర..
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- News
ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన నల్గొండవాసి అంశాల స్వామి కన్నుమూత; కేటీఆర్ ట్వీట్!!
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- Sports
INDvsNZ : చూస్తున్నావా సాయిబాబా?.. టీమిండియాపై పేలుతున్న మీమ్స్!
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Karthika Deepam వంటలక్క ఆరోగ్య పరిస్థితి చూసి కార్తీక్ కంటతడి .. దీప గుండెకు..!
ఎన్నో ఆశలతో ఇంటి వరకు వచ్చిన కార్తీక్.. దీప అనారోగ్యానికి గురవ్వడంతో తిరిగి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అయితే తనను ఇంటికి తీసుకెళ్లకుండా హాస్పిటల్‌కు తీసుకు రావడంతో దీప నిరాశ చెందింది. ఇంటికి వెళ్లి అత్త, మామ, హిమను చూద్దామనుకొంటే.. హాస్పిటల్‌కు తీసుకొచ్చి.. నర్సులను, డాక్టర్, పేషెంట్లను చూపిస్తున్నావు. ఇంతదూరం వచ్చాం కదా.. ఇళ్లు చూసి వెళ్దాం అని దీప చెప్పింది. దాంతో దీపను తన ఇంటి వరకు తీసుకెళ్లి చూపించాడు. అంతలోనే తన ఇంటి వద్ద ఇంద్రుడు కనిపించడంతో కార్తీక్ షాక్ తిన్నాడు. కార్తీకదీపం సీరియల్ 1532 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

నాటకాలు ఆడుతున్నావా అంటూ కార్తీక్
దీప అనారోగ్యానికి గురైన సమయంలోనే శౌర్యను అప్పగించడానికి ఇంద్రుడు వస్తే.. కార్తీక్ మధ్యలోనే ఆపేశాడు. కార్తీక్‌ను చూడగానే ఇంద్రుడు కంగారు పడ్డాడు. నా బిడ్డను నీ వద్దే ఉంచుకొని ఎన్ని నాటకాలు ఆడావు అని కార్తీక్ కోపగించుకొన్నాడు. అయితే శౌర్యను తమ వద్ద ఉంచుకోవడం వెనుక కారణాన్ని చెప్పాడు. తల్లికి దూరం చేస్తున్నామనే బాధను అర్ధం చేసుకొని.. మీ కోసం వెతికాం. కానీ ఎక్కడా మీరు కనిపించలేదు. అందుకే నానమ్మ, తాతయ్యకు అప్పగిద్దామని వచ్చాను అని ఇంద్రుడు అన్నాడు.

జ్వాలాను మీ వద్దే ఉంచుకొండి..
దాంతో ప్రస్తుతం శౌర్యను మీ వద్దే ఉంచుకోండి. సందర్బం వచ్చినప్పుడు నేను శౌర్యను తీసుకెళ్తాను. అంత వరకు జాగ్రత్తగా చూసుకోండి అని కార్తీక్ చెప్పాడు. నా బిడ్డను బాగా చూసుకొన్నారు. అంతకంటే మీమీద కంటే ఎవరికి నమ్మకం ఉంటుంది. నేను ఎక్కువ మాట్లాడలేను..మీ ఏరియాకు వచ్చి కలుస్తాను.. డబ్బులు పంపిస్తాను.. పాప కోసం ఏమైనా తీసుకెళ్లు అని ఇంద్రుడిని కార్తీక్ తిప్పి పంపించాడు.
దీప ఆరోగ్యం బాగుపడే వరకు శౌర్యను అక్కడే ఉంచుతా. ఇప్పటికే ఒకసారి పోయామని బాధపడ్డారు. దీపకు ఏమైనా అయితే.. ఇంకా తట్టుకొలేరు. కాబట్టి.. రెండోసారి ఆ బాధను పెట్టలేను. అంతా కలిసిన తర్వాత శౌర్యను తీసుకొస్తాను అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు.

జ్వాలమ్మపై ఆశలు పెట్టుకోకు..
శౌర్యను అప్పగించడానికి వెళితే.. వాళ్ల నాన్న కలిశాడు. కొన్నాళ్లు జ్వాలాను మనవద్దే ఉంచమని చెప్పారు. అలా చెప్పడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. జ్వాలాను జాగ్రత్తగా చూసుకొందాం అని ఇంద్రుడు చెప్పాడు. దాంతో జ్వాలాకు మనకు ఏదో విడదీయలేని బంధం ఉంది. అందుకే ఆమెను మనవద్దే ఉంచాలని దేవుడు కోరుకొన్నాడు అని చంద్రమ్మ అంటే.. జ్వాలమ్మపై ఎక్కువగా ఆశలు పెంచుకోకు అని ఇంద్రుడు చెప్పాడు.

వంట చేయడం ఆపేయాలి అంటూ
దీప ఇంటిలో దేవుడిని పూజిస్తుంటే.. ఎన్ని దేవుళ్లను మోక్కినా నీకు మంచి జరగడం లేదు అంటూ కార్తీక్ బాధపడుతూ.. కాఫీ రెడీ అని అన్నాడు. ఇక నుంచి ప్రతీ రోజు వంట నేనే చేస్తాను. వంటలక్క అనే పేరు తొలగించేలా చేస్తాను అని అన్నారు. డాక్టర్ చారుశీలను అడిగి.. వంట మనిషిని పెట్టుకొందాం.
అలాగే ఒక సెకండ్ హ్యాండ్ కారును కూడా కొనుకుందాం అని కార్తీక్ అంటే.. నేను ఇంటిలో ఊరికే ఉండాలా అంటే.. లేదు లేదు..శౌర్యను వెతకాల్సి ఉంటుంది కదా.. దానికే సమయం సరిపోతుంది. అలాగే నీవు ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి కాబట్టి వంట చేయడం ఆపేయాలి కార్తీక్ అన్నాడు. దీప గుండె జబ్బు తీవ్రం కావడంతో కార్తీక్ కంగారు పడ్డాడు.

చంద్రమ్మను చూసి కార్తీక్ కంగారు..
అయితే తాజా ప్రోమోలో మరో ట్విస్టు కనిపించింది. వంటపని కోసం కార్తీక్ ఇంటికి ఇంద్రుడు భార్య చంద్రమ్మ వచ్చింది. ఆమెను చూడగానే కార్తీక్ కంగారుపడిపోయాడు. ఆమెను బయటకు తీసుకెళ్లి.. చేతిలో డబ్బు పెట్టేసి.. శౌర్యను జాగ్రత్తగా చూసుకొమని చెప్పాడు. అయితే కార్తీక్, చంద్రమ్మ మాట్లాడుకోవడం చూసి దీప ఏదో అనుమానం పడింది.