For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam మోనిత రీ ఎంట్రీ! నేను చావడానికి ముందు నీ ప్రాణాలు తీస్తా.. మెడ పట్టి బయటకు గెంటిన దీప!

  |

  గుండె జబ్బులతో బాధపడుతున్న దీపను అమెరికాకు తీసుకెళ్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అని డాక్టర్ హేమ చంద్రను కార్తీక్ అడిగితే.. మీరే ప్రముఖ కార్డియాలజిస్ట్. మీకు తెలియనిది ఏముంటుంది? ఆపరేషన్ తర్వాత మళ్లీ కాంప్లికేషన్ ఎందుకు వచ్చాయి? అని హేమచంద్ర అంటే.. ఆపరేషన్ అయిపోయింది. అంతా నార్మల్ అయిందనుకొన్నాను. అయితే నేను అమ్మ, నాన్న వద్దకు వెళ్లినప్పుడు స్ట్రోక్ వచ్చింది. వాళ్లను చూడటం వల్ల ఎక్సైట్ అయి అలా జరిగి ఉంటుందని అనుకొన్నాను. రిపోర్టులు వచ్చాక అర్ధమైంది. అవి కరెక్ట్‌గా ఉన్నాయి. నా జీవితంలో వందల ఆపరేషన్ చేశాను. అన్నీ సక్సెస్ అయ్యాయి. చిన్నవాళ్ల నుంచి ముసలివాళ్లకు చేశాను. అంతా బాగున్నారు. కానీ దీప విషయంలోనే ఇలా జరుగుతున్నది అని కార్తీక్ అంటే.. అయితే ఏదో మనకు తెలియని విషయం ఉందని డాక్టర్ హేమచంద్ర అంటే.. నేను ఇంత డాక్టర్ అయి ఉండి.. నా భార్య ప్రాణాలు కాపాడలేకపోతున్నాను అని కార్తీక్ ఏమోషనల్ అయ్యాడు. దాంతో ఏదో ఎక్కడో తప్పు జరిగింది. దాని కనిపడితే మీరే దానిని సాల్వ్ చేస్తారు అని హేమ చంద్ర అన్నాడు. కార్తీకదీపం సీరియల్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

   అమ్మ, నాన్నలను కలిసి వెతుకుదాం

  అమ్మ, నాన్నలను కలిసి వెతుకుదాం


  తల్లిదండ్రులను వెతికే విషయంలో శౌర్య, హిమ మధ్య వాగ్వాదం జరిగింది. అమ్మ, నాన్న ఇక్కడే ఉన్నారని హిమ అంటే.. లేదు.. నేను బాబాయ్ చాలా సార్లు ఇక్కడే వెతికాం. కానీ కనిపించలేదు అని శౌర్య జవాబిచ్చింది. అయితే నన్ను నమ్ము. మనమిద్దరం కలిసి వెతుకుదాం. దొరకకపోతే నీవు, నేను విడిపోదాం అని అన్నారు. కానీ ఇదేం ఫిట్టింగ్ అని శౌర్య అంటే.. మనమిద్దరం కలిసి ఉండాలని అమ్మ, నాన్న కోరిక. గతంలో ఉన్న విధంగా మనం కలిసి ఉంది. ఆనందంగా అమ్మ, నాన్నలను వెతుకుదాం అని హిమ చెప్పింది. అయితే అమ్మ, నాన్న దొరకకపోతే నేను నీకు దూరంగా ఉంటానని శౌర్య షరతులు విధించింది.

   మోనిత రీ ఎంట్రీతో కార్తీక్, దీప షాక్

  మోనిత రీ ఎంట్రీతో కార్తీక్, దీప షాక్


  కార్తీక్, దీప బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి ఇంటి ముందు మోనిత కూర్చొని ఉంది. మోనితను చూడగానే కార్తీక్, దీప షాక్ తిన్నారు. కార్తీక్‌ను చూడగానే ఆనందపడిపోయింది. అంతలోనే మోనిత అని కార్తీక్ అనగానే.. ఎన్ని రోజులైంది నీ గొంతు విని. నా పేరు నీ నోట ఉంటే.. ప్రాణానికి హాయిగా ఉంది. జైలులో ఉన్నాను కానీ.. నీ గురించే ఆలోచిస్తున్నాను. పాపం నీవు ఎలా ఉన్నావో.. దీప సరిగా చూసుకొంటుదో లేదో అని ఆలోచిస్తున్నాను. పండరి పనిమనిషి.. నీ మనిషిని అని చెప్పగానే.. స్ట్రాంగ్ కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఇక వదిలిపోయేది లేది లేదు నీతోనే ఉంటాను అని మోనిత అంది.

   కాఫీ గ్లాస్‌ను విసిరికొట్టి..

  కాఫీ గ్లాస్‌ను విసిరికొట్టి..


  మోనిత మాటలు విన్న దీప కోపంతో ఊగిపోయింది. పరుగున వెళ్లి దీప చేతిలో ఉన్న కాఫీ గ్లాస్‌ను విసిరికొట్టింది. జైలులోనే చస్తావని అనుకొంటే.. మళ్లీ దాపురించావు అని దీప అంది. జైలుకుపోయానని.. నా చాప్టర్ క్లోజ్ అనుకొన్నావా? నా ప్రేమను జైలు గోడలు ఎలా ఆపుతాయని అనుకొన్నావు. అవసరమైతే జైలు గోడలు బద్దలు కొట్టుకొని వద్దామని అనుకొన్నాను. కానీ వాళ్లే వదిలేశారు అని మోనిత అంది. దాంతో ఇక చేసిన పనులు చాలు.. ఇలాంటి వేషాలు వేయకుండా వెళ్లిపో అని కార్తీక్ అంటే.. వచ్చింది వెళ్లిపోవడానికి కాదు అని మోనిత సమాధానం ఇచ్చింది.

   అరవకు.. ఆయుష్పు తగ్గిపోతుంది.

  అరవకు.. ఆయుష్పు తగ్గిపోతుంది.


  మోనితను వెళ్లిపో అని దీప అనగానే.. గట్టిగా అరవకు.. ఆయుష్పు తగ్గిపోతుంది. నీ ఆయుష్ఫు గురించి నాకు ఎలా తెలిసిందని అనుకొంటున్నావా? నేను ఎక్కడ ఉన్నా.. మీ కదలికలు కలిసిపోతాయి. ఇప్పుడే దీప రిపోర్టులు చూశాను. పరిస్థితి క్రిటికల్ అట అని మోనిత అంటే.. నా పరిస్థితి ఎలా ఉంటే నీకెందుకు.. ఇక్కడి నుంచి వెళ్తావా? లేదా? అని దీప కోపంతో ఊగిపోయింది. అయితే దీప బతికే అవకాశమే లేదటగా కార్తీక్.. అయినా నీవు ఎలా ఊరుకొంటావు. ఎలాగో అలా.. బతికించుకొంటావు కదా.. పాపం దీప.. నీవు ఒకటి తలిస్తే.. దేవుడు మరొకటి తలుస్తున్నాడు. కార్తీక్ నాకు దక్కుకుండా చాలా ప్రయత్నించావు. కార్తీక్‌ను నా నుంచి లాగేసుకొన్నావు. కానీ చివరకు కార్తీక్‌ను నా చేతిలో పెట్టి దేవుడి దగ్గరకు వెళ్తున్నావు అని మోనిత అంది.

  దీప పోయిన తర్వాత మనం సెటిల్ అవుదాం

  దీప పోయిన తర్వాత మనం సెటిల్ అవుదాం


  అయితే దీప రిపోర్టులు అబద్దం అనుకో. మరీ మీరు మీ అమ్మ, నాన్నల వద్దకు ఎందుకు వెళ్లడం లేదు. దీప చనిపోతుందని వారికి తెలిస్తే.. వాళ్లు తట్టుకోలేరు. దీప పోయాక కూడా వాళ్లను హ్యాండిల్ చేయడం నాకు కష్టం. కాబట్టి దీప చనిపోయిన తర్వాత కూడా మనం ఇక్కడే సెటిల్ అవుదాం అని మోనిత అంటే.. కార్తీక్‌తో కలవడం నీకు కలలో కూడా జరగదు. నేను చనిపోయే ఒక్క క్షణం ముందు నిన్ను చంపి నేను చస్తాను. డాక్టర్ బాబు మీద నీ నీడ పడకుండా చేస్తాను అని దీప ఫైర్ అయింది.

   చారుశీల నా మనిషి అంటూ మోనిత

  చారుశీల నా మనిషి అంటూ మోనిత


  మోనిత మాటలకు కార్తీక్ అడ్డుపడుతూ.. దీపకు ఏమీ కాదు అని అంటే.. ఏమీ కాదని నీవు అనుకొంటే సరిపోదు. పాపం దీప బతకాలని ఉంటుంది. అనుకొన్నవన్నీ జరగవు కదా.. అయినా నా వద్ద దాయలని ఎందుకు అనుకొంటున్నావు. దీప బతకదని నీకు ఎప్పుడు తెలిసిందో.. నాకు అప్పుడే తెలిసింది. నాకు ఎలా తెలిసిందని అనుకొంటున్నారా? నాకు చారుశీల చెప్పింది అని మోనిత అంటే.. నీకు చారుశీల ఎలా తెలుసు అంటూ కార్తీక్ ప్రశ్నించాడు. దాంతో చారుశీల నాకు తెలియకపోవడం ఏంటి? ఆమె నా మనిషి అని మోనిత అంటే.. చారుశీల నీ మనిషి ఏంటి.. ఏం వాగుతున్నావు అని దీప అంటే.. నిన్ను అక్కా అన్నంత మాత్రాన నీ మనిషి అనుకొన్నావా? నీకు పరిచయం అయిన వెంటనే... మీతో కలిసిపోతుందా? ఇంటి మనిషిని పెట్టి.. అన్ని విషయాలు చూస్తుందా? నేను జైలులో ఉంటే.. మీ గురించి తెలుసుకోవడానికి ఓ మనిషి ఉండాలి కదా. నీవు పోతున్నావని శుభవార్తను చారుశీల చెప్పింది.

  నేను పోవడానికి ముందు నీ ప్రాణాలు తీస్తా..

  నేను పోవడానికి ముందు నీ ప్రాణాలు తీస్తా..


  మోనిత మాటలకు దీప అడ్డుపడుతూ.. అవును నేను పోతాను. నేను పోవడానికి ముందు నీ ప్రాణాలు తీసి పోతాను అని దీప అంటే.. పోవడానికి అంత తొందర ఎందుకు అని మోనిత అంటే.. ఇంకోసారి దీప పోతుందని అంటే.. నీకు అదే చివరి మాట అవుతుంది. కానీ నా ప్రాణాలు కూడా తన ప్రాణాలతో ముడిపడి ఉన్నాయి. చావైనా, ప్రాణాలతో ఉన్నా దీపతోనే నా జీవితం. దీప సమాధి మీద తన జీవితాన్ని కట్టుకోవాలని చూస్తుంది. నీవు లేకుండా నేను ఎలా ఉంటానని అనుకొంటున్నది అని కార్తీక్ అంటే.. ఏం మాట్లాడుతున్నావు. కార్తీక్.. దీప లేకపోతే నీ ప్రాణాలు కూడా ఉండవా? మరి నా పరిస్థితి ఏంటి? అని మోనిత ప్రశ్నించింది. అయితే మోనిత వాగుతుంటే.. ఆమెను మెడపట్టి బయటకు నెట్టేసింది.

  English summary
  Karthika Deepam January 5th 2023 Episode number 1554.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X