Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Karthika Deepam ప్రాణాలు తీసేస్తాను.. మోనితకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్
బతికే ఛాన్స్ లేదని మోనిత చెప్పిన విషయాలను గుర్తు చేసుకొంటూ.. ఈ మోనిత పీడ విరుగడైందని అనుకొంటే.. మళ్లీ దాపురించిందేమిటి? అని మనసులో అనుకొంటుండగా.. దీప అంటూ కార్తీక్ పిలిచి.. నీవు వంటగదిలో ఉన్నావంటే.. అది కూడా పరధ్యానంగా ఉంటూ వంట చేస్తున్నావు. అది డేంజర్. అసలు పనిమనిషి పండరి ఎక్కడ అని కార్తీక్ అడిగాడు. అంటే ఊరికి వెళ్లింది.. ఈ ఒక్కరోజు నేను చేస్తాను దీప అంటే.. లేదు.. నేను ఈ రోజు వంట చేస్తాను. వంటగది నుంచి నీవు బయటకు రా.. ఏం ఆలోచిస్తున్నావు అని కార్తీక అంటే.. జైలుకు పోయిందనుకొన్న మోనిత మళ్లీ తిరిగి వచ్చింది అని దీప అంటే.. ఆమె సంగతి నేను చూసుకొంటాను అని కార్తీక్ అన్నాడు. కార్తీకదీపం సీరియల్ 1555 ఎపిసోడ్ ఇంకా ఏమైందంటే?
మోనిత సంగతి నీవు చూసుకొంటాను. నీవు ప్రశాంతంగా ఉండూ. మోనిత మనల్ని ఏమీ చేయలేదు. నీతోపాటే నేను అని అంటే.. నీవు మోనితతో కూడా అలానే మాట్లాడుతున్నావు. మనం పోతే పిల్లల పరిస్థితి ఏమిటి? అని దీప ఆవేదన చెందింది. నేను బతికి ఉన్నప్పుడే దానిని బయటకు పంపిస్తే.. పోయాక నా ఆత్మకు శాంతి.. నీకు ప్రశాంతత అని దీప అంది. అయితే మోనిత గురించి ఆలోచించకుండా.. ఆమె రాలేదని ప్రశాంతంగా ఉండు. ఆమెను ఏం చేయాలో నేను చూసుకొంటాను అని కార్తీక్ అన్నాడు.

దీపతో మాట్లాడుతుండగానే.. కార్తీక్‌కు ఫోన్ వచ్చింది. దాంతో ఎవరు? అని దీప అడిగితే.. నాకు తెలిసిన వాళ్లు. నీవు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ప్రశాంతంగా ఉండు అని కార్తీక్ చెప్పాడు. నేను ఉన్నప్పుడే కాదు.. లేనప్పడు కూడా ప్రశాంతంగా ఉండాలంటే.. మోనిత మన జీవితాల్లో ఉండకూడదు అని దీప అంది.
దీపకు మంచి చెప్పి.. నేరుగా మోనిత వద్దకు కార్తీక్ వెళ్లాడు. నీవు వచ్చావా? నమ్మలేకపోతున్నాను. ఇదిగో వద్దు అంటే.. నేను కావాలనుకొన్నది నీవు వద్దనుకోవడం.. నీవు వద్దనుకోవడం నేను కావాలనుకోవడం ఎప్పటిగా జరిగేది. లోపలికి రా అంటే.. ఆపు.. అవసరం లేదు అని అంటే.. ఈ ఇంట్లోనే నీవు సంతోషంగా ఉన్నావు. దీప వచ్చిన తర్వాత నీవు నాకు దూరం అవుతున్నావు. నీవు నా చేయి పట్టుకో. నీకు సంతోషం ఉంటుంది అని మోనిత అంటే.. ఎంత చెప్పినా నీవు అసలు మారడం లేదు.

అంటే.. నీవు ఏమైనా అన్నా.. నీ మీద అభిప్రాయం మారదు అని మోనిత అంటే.. దీప ఎంతో కాలం బతకదు. మమల్ని అలానే వదిలేయ్ అని కార్తీక్ అంటే..అయితే నేను వదిలేస్తాను.. కానీ ఒక షరతు.. నేను మీతో ఉంటాను. దీప బతికి ఉన్నంత కాలం సంతోషంగా ఉండు. దీప పోయిన తర్వాత నాతో సంతోషంగా ఉంటాను అని మోనిత అన్నాడు. దాంతో దీప పరిస్థితి బాగాలేదని వదిలేసి వస్తున్నాను. ఏదైనా డిస్ట్రబ్ చేస్తే.. ప్రాణాలు తీసేస్తాను అని కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు.
ఆ తర్వాత దీప వద్దకు మోనిత వచ్చింది. డాక్టర్ బాబు కోసం ఎదురు చూస్తున్నావా? అని మోనిత అంటే.. నీకెందుకే.. బయటకు వెళ్లు అని దీప కోపంతో ఊగిపోయింది. అరవకు.. ఆఖరి రోజుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలి కదా.. నీకు అసలు విషయం చెబుతాను. కార్తీక్ నా వద్దకు వచ్చాడు అని మోనిత అంటే.. నీ వద్దకు ఎందుకు వచ్చాడు అని అంటే.. దీప ఆరిపోయే ముందు నేను అబద్దాలు చెప్పను. దీప ఆరిపోయే పరిస్థితిలో ఉంది. ప్రశాంతంగా ఉండనివ్వు అన్నాడు.
అయితే ఓ కండిషన్ పడితే కోపంగా చూసి వెళ్లిపోయాడు. కార్తీక్‌కు నచ్చని కండిషన్ నీకు చెబుతా.. మనం ముగ్గురం కలిసి ఉందాం. కార్తీక్ పోయిన తర్వాత ఆయనతో సంతోషంగా ఉంటాను. నా వల్ల ఇబ్బంది ఉండదు అని మోనిత అంటే.. చెప్పు తెగుద్ది అని ప్లేట్‌తో విసిరికొట్టింది. ప్లేట్ ముక్కలైనట్టు నీ ముఖం కూడా ముక్కలు కావాలి అని దీప అంటే.. నన్ను ఎందుకు విలన్‌గా చూస్తున్నావు. నన్ను అలా చూసి నీవు ఏం బాగుపడ్డావు. మీరు ఇద్దరు దూరంగాను ఉన్నారు. పెళ్లైనా కార్తీక్ బ్రహ్మచారిగా బతికాడు. ఇప్పుడు వదలను అంటున్నావు. చచ్చిపోయే ముందు పట్టుకొని ఏం చేస్తావు అని మోనిత చెలరేగిపోయింది.
అయితే.. మా జీవితాలు ఇలా కావడానికి కారణం నువ్వే.. నేను చావడానికి ముందు నిన్ను చంపేస్తాను. నా ప్రాణాలకు గడువు ఉంది.. కానీ నేను తలచుకొంటే..నీ ప్రాణాలకు గడువు లేదు. ఇక్కడ నుంచి వెళ్లకపోతే చంపేస్తాను అని దీప వార్నింగ్ ఇచ్చింది. మెడలు పెట్టి బయటకు నెట్టే ప్రయత్నం చేసింది.