For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam హీరోలా ఎంట్రీ ఇచ్చిన కార్తీక్.. వంటలక్కను మీరు ఎవరు అంటూ ప్రశ్నించిన డాక్టర్ బాబు

  |

  అమెరికాకు చేరుకొన్న సౌందర్య దంపతులను హిమ విసిగించింది. అమెరికాలో ఉండటం తనకు ఇష్టం లేదు. హైదరాబాద్‌కు వెళ్లిపోదాం పద అంటూ హిమ మొండికేసింది. అయితే అమెరికా అంటే హైదరాబాదా? ఖండంతరాలు దాటి వచ్చాం. నాలుగు రోజుల కోసం వచ్చిపోవడం అంటే కుదరదు అని సౌందర్య అంది. అయితే నాలుగు రోజులు కాదు కాద.. నాలుగేళ్లు అయినా నేను ఇక్కడ ఉండను. హైదరాబాద్‌లో ఉంటే.. శౌర్యను వెతుక వచ్చు అని హిమ చెప్పింది. కార్తీకదీపం సీరియల్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 1436‌లో ఇంకా ఏం జరిగిందంటే..

   వాస్తు బాగా లేకపోతే దేశాన్ని వదిలేస్తారా?

  వాస్తు బాగా లేకపోతే దేశాన్ని వదిలేస్తారా?


  ఇల్లు వాస్తు బాగా లేకపోతే ఇల్లు వదిలి దేశానికి రావాలా? ఇల్లు మారితే సరిపోదే. ఇండియాలో ఉంటే శౌర్య వెతకడానికి అవకాశం ఉండేది. చేదు అనుభవాలు వెంటాడుతున్నాయని, దేశం విడిచి వస్తే.. ఆ మెమొరీస్ తగ్గుతాయా? మీకు ఏమైనా అర్థం అవుతుందా? మనం శౌర్యను వదిలేసి వచ్చాం. అమ్మ, నాన్న మనల్ని వదిలేసి వెళ్లడానికి, మనం శౌర్యను వదిలేసి రావడంలో తేడా ఏమైనా ఉందా? శౌర్య మనల్ని వెతుక్కొంటూ వస్తే.. మనం కనిపించకపోవడం, మనం శౌర్యను వదిలేసి రావడం ఒక్కడే కదా. శౌర్యను అనాథగా చేయవద్దు అని హిమ ఆవేదన వ్యక్తం చేసింది.

   ఆయనను వాళ్ల భార్య తీసుకెళ్లిందంటూ

  ఆయనను వాళ్ల భార్య తీసుకెళ్లిందంటూ


  ఇక యాక్సిడెంట్ తర్వాత పక్క ఊరి హాస్పిటల్‌లో ఓ వ్యక్తిని చేర్పించారనే సమాచారంతో మళ్లీ చిక్‌మంగళూరుకు దీప వెళ్లింది. హాస్పిటల్‌కు వెళ్లి కారు యాక్సిడెంట్‌లో గాయపడిన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చారట కదా అని దీప అంటే.. ఆయన ఎక్కడున్నారు? ఆయనను వెంటనే చూడాలి అని దీప అడిగితే.. ఆయనను వాళ్ల భార్య వచ్చి తీసుకెళ్లింది అంటూ నర్సు చెప్పడంతో దీప షాక్ గురై కంటతడి పెట్టుకొన్నది. అయితే నీవు కూడా భార్యవు అంటున్నావు. ఆయనకు ఇద్దరు భార్యలా అని నర్సు ప్రశ్నించింది.

   ప్రాణం ఉన్నంత వరకు నీతోనే అంటూ

  ప్రాణం ఉన్నంత వరకు నీతోనే అంటూ


  కార్తీక్‌ను ఎవరు తీసుకెళ్లారో అనే విషయంతో బెంగపడిన దీప.. డాక్టర్ బాబును వెంటనే చూపించండి అంటూ భగవంతుడిని వేడుకొన్నది. అంతలోనే నర్సు వచ్చి.. నిన్న పేషెంట్ ఇక్కడే పర్సు వదిలి వెళ్లాడు. ఇది తీసుకోండి అంటూ నర్సు చేతికి పర్సు ఇచ్చింది. ఆ పర్సును చూసి తను కార్తీక్ ఇచ్చిన గిఫ్టు అని గ్రహించింది. గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొంటూ డాక్టర్‌ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు అంటే.. గిఫ్టు బాగున్నది అని కార్తీక్ అన్నాడు. పేదవాళ్లం.. ఖరీదైన గిఫ్టు ఇవ్వలేం అని దీప అంటే.. గిఫ్టు విలువ చూడకూడదు. నీవు చాలా తెలివైన దానివి. భార్య లేకుండా బయటకు వెళ్లవచ్చు. కానీ పర్సు లేకుండా వెళ్లలేం. ఇప్పటికే నేను మీకు దూరం చేసుకొన్నాను. ఇక ప్రాణం ఉన్నంత వరకు నిన్ను, పర్స్‌ను వదులుకోలేం అని కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు.

   శౌర్యకు జ్వాలాగా నామకరణం

  శౌర్యకు జ్వాలాగా నామకరణం


  ఇక శౌర్యకు ఎవరూ లేకపోవడంతో చంద్రమ్మ దంపతులు దత్తత కార్యక్రమాన్ని, పూజను నిర్వహించారు. ఈ రోజు నుంచి ఈ బిడ్డ మీ బిడ్డ. ఈ అమ్మాయి పేరు ఏమిటి అంటే.. నీ పేరు ఏమిటో నాకు తెలియదు. మాకు నువ్వు చెప్పలేదు. కానీ ఈ రోజు నుంచి నీ పేరు జ్వాలా అని చంద్రమ్మ భర్త అంటే.. మాకు పుట్టిన బిడ్డ చిన్నప్పుడే చనిపోయింది. ఆ బిడ్డ పేరు జ్వాలా. మళ్లీ నీ పేరు మళ్లీ జ్వాలా అని పెట్టుకొంటున్నాం అని చంద్రమ్మ దంపతులు ఆనందపడిపోయారు.

   నీ భర్తను ఎవరో తీసుకెళ్లితే..

  నీ భర్తను ఎవరో తీసుకెళ్లితే..


  తన భర్తను ఎవరో తీసుకెళ్లడంపై దీపతో మాట్లాడుతూ.. చిక్‌మంగళూరు డాక్టర్ ఆశ్చర్యపోయాడు. నీ భర్తను తన భర్త అని వేరే వాళ్లు తీసుకెళ్లడం ఏమిటి అంటే.. పర్సులో ఫోటో చూస్తూ.. ఇతనే డాక్టర్ బాబు. ఆయనను మరెవరో తీసుకెళ్లడం ఏమిటి? అంతా అయోమయంగా ఉంది అంటే.. నీవేమి కంగారు పడకు. నా కొడుకు నీ భర్తను తీసుకొచ్చి అప్పగిస్తాడు. నీ భర్త ఎవరి భర్త ఎలా అవుతాడు అని డాక్టర్ తల్లి అంది. ఒక్కోసారి ఇతరులు చేసే తప్పులు మనల్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది అని దీపను ఊరడించే ప్రయత్నం చేసింది. అయితే నేను కార్తీక్ కోసం వెతుకుతాను అంటూ బయటకు వెళ్లింది.

  డాక్టర్ బాబు హీరోలా ఎంట్రీ ఇచ్చి..

  డాక్టర్ బాబు హీరోలా ఎంట్రీ ఇచ్చి..


  డాక్టర్ బాబును వెతుకున్న క్రమంలో కార్తీక్ హీరోలా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గడ్డంతో గాగుల్స్ పెట్టుకొని కారులో నుంచి దిగాడు. డ్రైవర్ వచ్చి.. మీరు జ్యూస్ తాగే సమయం అయింది అంటే.. చూడు సుబ్రమణ్యం అని కార్తీక్ అంటే.. నా పేరు శివ అని సమాధానం ఇచ్చాడు. సరేలే ఏదో ఒక పేరు... చూడు నాకు తినాలనిపించినప్పుడు తింటాను. తాగాలనిపించినప్పుడు తాగుతాను. నా ఇష్టం అంటూ కార్తీక్ చెప్పాడు. అయితే లేదు మేడమ్ నీకు సరైన సమయంలో ఫుడ్ పెట్టకపోతే నన్ను రఫ్ ఆడిస్తుంది.. మీరు తాగేటప్పుడు తినేటప్పుడు ఫోటో తీసి పంపాలి అని శివ అన్నాడు. అయితే వీడియో కూడా తీయకూడదా అని కార్తీక్ సెటైర్ వేశాడు.

  దీప నీవెవరూ అంటూ కార్తీక్ ప్రశ్న

  దీప నీవెవరూ అంటూ కార్తీక్ ప్రశ్న


  అలా శివ, కార్తీక్ రోడ్డుపై వెళ్తుండగా డాక్టర్ బాబును దీప చూసి ఎమోషనల్ అయింది. తాజా కార్తీకదీపం సీరియల్ తాజా ప్రోమోలో షాకింగ్ విషయాలు కనిపించాయి. కార్తీక్ కనిపించగానే ఆయన వద్దకు పరిగెత్తింది.. డాక్టర్ బాబు అంటూ పట్టుకొన్నది. ఎవరు డాక్టర్ బాబు.. నేను డాక్టర్ బాబు ఏంటి? అంటూ కార్తీక్ ప్రశ్నార్థకంగా చూశాడు. దాంతో నేను దీపను అంటే.. దీప ఎవరు కార్తీక్ ప్రశ్నించడంతో దీప దిగ్బ్రాంతికి గురైంది. రానున్న ఎపిసోడ్‌లో భారీ ట్విస్టులు కనిపించబోతున్నాయనేది స్పష్టమైంది.

  English summary
  Karthika Deepam 20th August Episode number 1436.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X