For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam హిమకు ఐ లవ్ యూ చెప్పిన ప్రేమ్.. మరో లవ్ డ్రామా ట్విస్ట్!

  |

  కిడ్నాప్ ఘటన తర్వాత శౌర్య, నిరుపమ్ ఒకే గదిలో బందీ కావడం, గది బయట ప్రేమ్, హిమ కలిసి డ్రామా ఆడటం తెలిసిందే. శౌర్య, నిరుపమ్ ఒకే గదిలో ఉంటే వారి మధ్య స్నేహం, ప్రేమ మళ్లీ చిగురిస్తుందని ప్రేమ్ ఓ డ్రామాను ప్లాన్ చేసి.. ఒక బిర్యాని ప్యాకెట్, ఒకే వాటర్ బాటిల్ ఇచ్చాడు. అయితే శౌర్యకు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి.. తనకు వాటర్ బాటిల్ ఇవ్వడం అన్యాయం అని నిరుపమ్ అన్నాడు. అయితే గదిలో బిర్యాని పాకెట్ తన వద్ద ఉంచుకోవడంతో.. తనకు ఆకలిగా ఉందని నిరుపమ్ చెప్పాడు. అయితే నేను ఇవ్వను. నేనే తింటాను అంటూ శౌర్య సమాధానం చెప్పి.. భోజనం ఒక్కతే చేయడానికి సిద్దమైంది. నాకు ఆకలి బాగా వేస్తుంది. మొత్తం నేనే తింటాను అని శౌర్య అంటే.. నిన్ను కాపాడానికి వచ్చాను. నాకు పెట్టవా? అని నిరుపమ్ అంటే.. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఉండవు అని శౌర్య చెప్పింది. కార్తీకదీపం సీరియల్‌ 1421 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  గది బయట ఉన్న హిమ.. ప్రేమ్ ఒకే భోజనం తీసుకురావడంతో.. ఏంటి వారిద్దరూ కలిసిపోవడానికి ఒకే మీల్ తెచ్చావు. ఇప్పుడు మనకు ఎందుకు ఒకే మీల్ చెచ్చావు అంటే.. మనమిద్దరం కూడా కలిసిపోవాలి కదా అని ప్రేమ్ మనసులో అనుకొన్నాడు. భోజనం ఒక ప్లేట్‌లో పెట్టి.. సగం సగం పంచుకొన్నారు. ఇక గదిలో ఆకలితో దీనంగా చూస్తుంటే.. ఏంటి ఆకలిగా ఉందా అని నిరుపమ్‌ను శౌర్య అడిగింది. ఎప్పటి నుంచో అదే కదా నేను చెప్పది అని నిరుపమ్ సమాధానం ఇస్తే.. నేను ఒక్కదాన్నే ఎలా తింటానని అనుకొన్నావు అని శౌర్య అంటే.. నిజంగానే అంటున్నావా.. దగ్గరికి వస్తే.. తూచ్ అంటావా అంటే.. లేదు.. ఇది నీకు సగం.. ఈ సగం నాకు అంటూ రెండు జంటలు భోజనం చేశారు.

  గది బయట భోజనం చేస్తూ.. నీతో కలిసి తినడం చాలా హ్యాపీగా ఉంది అంటూ ఆలోచనల్లో పడితే.. ఏంటి అలా ఆలోచిస్తున్నావు అంటూ ప్రేమ్ అని అడిగితే.. ఇక్కడి రావడం వారిని బంధించడం.. జిలా మనం బయట భోజనం చేయడం చాలా బాగున్నది కదా అని అడిగాడు. దాంతో హిమ చిరునవ్వు నవ్వడంతో నీ స్ల్మైల్ బాగుంది అంటూ చెప్పాడు. గదిలో తనను చూస్తుంటే.. నన్ను తినేసేలా చూడటం కాదు.. బిర్యాని తినండి అంటూ.. ఒకే గదిలో నేను, డాక్టర్ సాబ్ ఉన్నాం. ఇద్దరం కలిసి భోజనం పంచుకొంటున్నాం. కానీ జీవితం పంచుకోవడం లేదు అని అనుకొంటుంటే.. స్వరం తప్పింది. దాంతో శౌర్య నెత్తి మీద చిన్నగా తట్టి నీళ్లు ఇచ్చాడు.

   Big Twist in Karthika Deepam todays episode: Prem love proposal reaches Hima

  హిమను ఇంప్రెస్ చేయడానికి ప్రేమ్ ప్రయత్నించాడు. నేను ఎన్నోసార్లు వెజ్ బిర్యాని తిన్నాను. కానీ ఈ రోజు చాలా టేస్ట్‌గా ఉంది అని ప్రేమ్ అన్నాడు. దాంతో ఎందుకలా అని అంటే.. వారిద్దరిని గదిలో బంధించడం వల్లనేమో.. లేదా మనిద్దరం ఇలా కలవడం వల్లనేమో అని హిమతో ప్రేమ్ అన్నాడు. అలా చలిమంట వేసుకొని మాట్లాడుకొంటూ హిమ, ప్రేమ్ మాటల్లో మునిగిపోయాడు. ప్రేమ్ చూపించే అప్యాయత చూసి.. నిన్నెవరు చేసుకొంటారో తెలియదు గానీ.. చాలా అదృష్టవంతురాలు అని అంటే.. నిన్నే నేను పెళ్లి చేసుకొంటాను. కానీ కాస్త ఆలస్యం అవుతుంది అని అన్నాడు. అయితే తన కళ్లు తెరిచి ఆలోచనల్లో పడిపోతే.. ఏంటి అని అడిగితే.. ఇదంతా కలనా? అని ప్రేమ్ అనుకొన్నాడు. ఇక నువ్వెవరినైనా ప్రేమించావా అంటే.. ప్రేమిస్తున్నాను. అది మీకు త్వరలోనే తెలుస్తుంది అని అన్నాడు. అంతలోనే.. శౌర్య, నిరుపమ్ ఏం చేస్తున్నారో చూసి వస్తానని వెళ్లితే.. పక్కనే ఉన్న ప్రేమ్ ఫోన్ తీసింది.

  ప్రేమ్ ఫోన్‌లో వీడియోను క్లిక్ చేయగానే.. హిమ నాకు అందంగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడటం రాదు. చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. ఎన్నోసార్లు హిమ ఐ లవ్ యూ చెప్పాలనుకొన్నాను. కానీ ఏదో కారణం వల్ల చెప్పలేకపోయాను. నాపై కూడా నీకు ప్రేమ ఉందని అనుకొంటాను. హిమ ఐ లవ్ యూ.. నీ రిప్లై కోసం ఎదురు చూస్తుంటాను.. ప్రేమతో నీ ప్రేమ్ అని ఉన్న వీడియోను చూసి హిమ షాక్ తిన్నది.

  ప్రేమ్ బావ నన్ను ప్రేమిస్తున్నాడా? అని హిమ ఒకరకమైన షాక్‌లో ఉండిపోయింది. అంతలోనే ప్రేమ్ వచ్చి.. నాకేమైనా ఫోన్స్ వచ్చాయా అంటే.. ఫోన్ తీసి ప్రేమ్ చేతిలో పెట్టింది. ఫోన్‌లో వీడియో ఉండటం చూసి.. నీ కోసమే వీడియో రికార్డ్ చేశాను. నీ సెల్‌ఫోన్‌కు పంపించాను. కానీ నీ ఫోన్ అప్పుడే రిపేర్‌కు వచ్చింది అని ప్రేమ్ చెప్పాడు. అయితే మౌనంగా హిమ కదిలి వెళ్తుంటే.. నా ప్రశ్నకు సమాధానం చెప్పావా అని ప్రేమ్ అడిగాడు. దాంతో జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండవు. జీవితంలో అతి పెద్ద ప్రశ్న జీవితమే. జీవితంలో ఎన్నో అనుకొంటాం. అన్నీ అవుతాయా బావ అని హిమ చెప్పింది. దాంతో హిమ అవునన్నదా? కాదన్నదా అని చెప్పింది.

  గదిలో చలితో వణుకుతుంటే.. పాపం శౌర్య అంటూ నిరుపమ్ ఆమెపై దుప్పటి కప్పాడు. అది చూసి.. జాలి నుంచే ప్రేమ పుడుతుంది హిమ. వీరిద్దరూ దార్లోకి వస్తున్నట్టు ఉన్నారు అని హిమ, ప్రేమ్ అనుకొన్నారు. అయితే తనకు దుప్పటి కప్పడం చూసి.. ఇంత జాలి అవసరమా అని శౌర్య అనుకొన్నది. దుప్పటి తీసి నిరుపమ్‌పై కప్పింది. అయితే తిరిగి ఇచ్చేస్తున్నావా అని నిరుపమ్ అంటే.. మీ త్యాగాలు భరించలేకపోతున్నా. నాలాంటి పేదలకు అలవాటే. మీరు నాజుకుగా పెరిగారు కదా.. మీకు ఇవి కొత్త.. నీకు అడ్జస్ట్ కావు అని హిమ అంది.

  హిమ నా పక్కన ఉంటే. ఇంతకంటే దారుణమైన ప్రదేశంలోనైనా ఉండేవాడిని. మనం ఎక్కడ ఉన్నామని కాదు.. ఎవరితో ఉన్నామనేది ముఖ్యం అని నిరుపమ్ అన్నాడు. నిరుపమ్ మాటలతో శౌర్య మరింత కుంగిపోయి కన్నీరు పెట్టుకొన్నది.

  ఇక తెల్లవారిపోగానే.. అరే ప్రేమ్ అంటూ నిరుపమ్ అరిచాడు. దాంతో ఇప్పుడు ఏం చేద్దామని ప్రేమ్‌తో హిమ అంటే.. తాళం తీసినట్టు నటిద్దాం అని ప్రేమ్ చెప్పాడు. గుడ్ మార్నింగ్ హిమ అంటే.. ఇప్పుడు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలా అని ప్రేమ్ అంటే.. ముందు నోర్మూసుకొని తలుపు తీయరా అని నిరుపమ్ అరిచాడు.

  English summary
  Karthika Deepam 3rd August Episode number 1420. Prem love proposal reaches Hima
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X