For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam చంపేస్తా.. నిన్ను వదలను.. శివకు తుపాకి గురిపెట్టిన మోనిత

  |

  దీప, దుర్గలను వాల్తేరు వాణితో చంపించాలని మోనిత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీప నిద్రిస్తున్న సమయంలో అగ్గిపుల్ల గీకి ఇంటిపై వేస్తున్న సమయంలో వాణిని దుర్గ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నాడు. ఇక శౌర్య పుష్పవతి కావడంతో చేస్తున్న ఫంక్షన్‌కు దీప, కార్తీక్ రెడీ అయ్యారు. అయితే మోనితకు ఏం చెప్పి వస్తున్నారు అని దీప అడిగితే.. ఏం ఎందుకు చెప్పాలి? ప్రస్తుతం మనం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. దుర్గతో బిజీగా ఉంది అని కార్తీక్ సమాధానం ఇచ్చారు. దాంతో దీప సంతోషంలో మునిగింది. మోనితను పట్టించుకోవడం మానేస్తున్నాడు. నాతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు అని దీప ఆనందపడిపోయింది. కార్తీకదీపం సీరియల్ 1497 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

  జ్వాలా వెళ్లిపోతే ఉండగలవా?

  జ్వాలా వెళ్లిపోతే ఉండగలవా?


  జ్వాలా అలియాస్ శౌర్య తల్లిదండ్రులు కార్తీక్, దీప అని తెలుసుకొన్న ఇంద్రుడు ఆలోచలన్లో పడిపోయాడు. ఒకవేళ పెంచిన జ్వాలా వెళ్లిపోతే చంద్రమ్మ బతుకుతుందా? అనే ఆలోచనల్లో పడిపోయాడు. ఇంద్రుడు కంగారుగా కనిపించడంతో.. ఏదో దాస్తున్నావు అంటూ చంద్రమ్మ అడిగితే.. ఒకవేళ జ్వాలమ్మ వెళ్లిపోతే.. నీవు ఉండగలవా? అంటే.. జ్వాలా పెద్దమనిషి ఫంక్షన్ చేస్తున్నాం.. పెళ్లి చేయడం లేదుగా.. ఆమెను అత్తారింటికి పంపిస్తున్నామా? అంటూ చంద్రమ్మ జవాబిచ్చింది.

  శౌర్యను ఎప్పుడెప్పుడు చూడాలని..

  శౌర్యను ఎప్పుడెప్పుడు చూడాలని..


  ఇక శౌర్యను కలిసేందుకు కార్తీక్, దీప ఇద్దరు పలహారాలతో బయలు దేరారు. శౌర్యను ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు శౌర్యను చూస్తానా అనే ధ్యాసలో నిద్ర పట్టలేదు అని దీప అంటే.. నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది అని కార్తీక్ అన్నాడు. శౌర్య పుట్టినప్పుడు నా చేతిలోకి తీసుకొన్న రోజు ఇంకా గుర్తు ఉంది. అప్పడే శౌర్య పెద్దది అయిపోయింది. ఆ రోజు సరుకుల లిస్ట్ రాసిచ్చని రోజు.. ఫోన్‌లో మాట్లాడిన రోజే నాకు శౌర్య అని అర్ధమైంది. బతుకమ్మ పండుగ రోజు శౌర్య పిలిచిందని చెప్పాడు. నీవు కనిపించకపోవడంతో కంగారులో వెళ్లలేదు అంటూ దీప చెప్పింది.

  వంటలు చేసే ఆవిడ మాదిరిగానే అమ్మ..

  వంటలు చేసే ఆవిడ మాదిరిగానే అమ్మ..


  ఫంక్షన్ కోసం వంటలు సిద్దం చేస్తున్న టెంట్‌ కింద శౌర్య కనిపించడంతో.. ఇక్కడెందుకు ఉన్నావు.. పొగతో కళ్లలో నుంచి నీళ్లు కారుతాయి అని చంద్రమ్మ అంటే.. వంట చేస్తున్న ఆమెను చూస్తే అమ్మ గుర్తుకు వచ్చింది. అమ్మ వంట చేసేటప్పుడు నేను హెల్ప్ చేసేదానిని. ఇప్పుడు ఆమెను చూస్తుంటే అమ్మే గుర్తుకు వస్తున్నది. ఈ రోజు నాన్న, అమ్మ వస్తుందని అనుకొన్నాను. రాదా బాబాయ్.. అమ్మ నాకు గంధం పూయదా బాబాయ్.. ఆక్షింతలు వేసి ఆశీర్వదించదా బాబాయ్ అంటూ శౌర్య కంటతడి పెట్టుకొన్నది. నీ ఏడుపుకు బాధకు కారణం నేనే.. నీ అమ్మ, నాన్నలు తీసుకుపోవడానికి వస్తారని అన్నారు. కానీ నా స్వార్దం కోసం నిన్ను ఏడిపించాను అని ఇంద్రుడు మనసులో అనుకొన్నాడు. నీవు ఏడువ కూడదు. ఒక నీ కళ్లలో నుంచి కన్నీళ్లు రావు అని ఇంద్రుడు కంటతడి పెట్టుకొన్నాడు.

  కార్తీక్‌ను వదలవా? అంటూ మోనిత

  కార్తీక్‌ను వదలవా? అంటూ మోనిత


  కార్తీక్, దీప ఇద్దరు శౌర్యను కలుసుకోవడానికి వెళ్లడంతో మోనిత పిచ్చెక్కిన దానిలా వ్యవహరించింది. ఫ్లవర్ వాజులు, ఇంట్లో వస్తువులన్నీ విసిరికొట్టింది. అంతలోనే అసిస్టెంట్ శివ వచ్చి.. అమ్మ... వస్తువులన్నీ పగిలిపోతున్నాయి అని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే.. ఏమీ నా కార్తీక్‌ను వదలవా? నా కార్తీక్‌ను నేను దక్కించుకోలేనా ప్రతీసారి నువ్వు తప్పించుకొంటున్నావు. దుర్గతో కలిసి నాటకం ఆడుతున్నావు. వాణి చేయి విరగగొట్టించావు అంటూ మోనిత పిచ్చెక్కినట్టు వ్యవహరించింది. ఉండు నీ సంగతి చెబుతా అంటూ గదిలోకి వెళ్లి.. పిస్టల్ తెచ్చి శివను కాల్చపోయింది. దాంతో నేను శివను.. మా అమ్మకు ఒక్కడినే కొడుకును అంటూ ప్రాధేయపడ్డాడు. అయితే నాకు పిచ్చి పట్టిందని తెలిసి నువ్వు ఎందుకు వచ్చావురా అని మోనిత అరిచింది. ఆనందరావును తీసుకెళ్లమని శివలతకు చెప్పు. ఎవరు ఇంట్లోకి రాకుండా కాపలా కాయి అని మోనిత అరుపులు, పెడబొబ్బలు పెట్టింది.

  ఇంద్రుడితో కలిసి శౌర్య వద్దకు

  ఇంద్రుడితో కలిసి శౌర్య వద్దకు


  దీప, కార్తీక్ ఇద్దరు ఇంద్రుడిని కలిసేందుకు ఒక చోట ఆగాడు. ఇంద్రుడు రాకపోవడంతో దీపకు అనుమానాలు వచ్చాయి. మనం తల్లిదండ్రులు అని తెలిసి బిడ్డను ఇవ్వాల్సి వస్తుందని ఇంద్రుడు రాలేదేమో అంటే.. అలాంటిదేమీ లేదు. ఇంద్రుడు వచ్చేస్తాడు అని కార్తీక్ అన్నాడు. అంతలోనే ఇంద్రుడు రావడంతో వాళ్లంతా కలిసి ఇంటికి బయలు దేరారు. ఇంట్లో శౌర్య ఫంక్షన్ జరుగుతున్నది. అయితే బాబాయ్ ఏడి అని అడిగితే.. తెలిసిన వాళ్లను తీసుకు రావడానికి వెళ్లాడు అని చంద్రుడు చెప్పింది. అయితే కార్తీక్, దీపను వెంటపెట్టుకొని వస్తూ.. నీ తల్లిదండ్రులకు ఇవ్వ వద్దని అనుకొన్నాను. నీవు అమ్మ కోసం బాధపడుతుంటే.. నేను ఇవ్వకుండా చేసి నరకాన్ని నీవు, నేను అనుభవించలేను. కాబట్టి.. నిన్ను మీ అమ్మ, నాన్నలకు అప్పగిస్తాను అని ఇంద్రుడు తన మనసులో అనుకొన్నాడు.

  కార్తీక్, దీప వద్దకు శౌర్య

  కార్తీక్, దీప వద్దకు శౌర్య

  కార్తీకదీపం సీరియల్ తాజా ప్రోమోలో ఇంద్రుడి ఇంటికి కార్తీక్, దీప చేరుకొన్నారు. రండి సార్ అంటూ లోనికి తీసుకెళ్లారు. చంద్రమ్మ బయటకు రావడంతో.. నా భార్య అంటూ ఇంద్రుడు పరిచయం చేస్తే.. అమ్మగారు నాకు ముందే తెలుసు అని సమాధానం చెప్పింది. అమ్మగారు.. అమ్మాయిని చూడానికి వచ్చారు. చూపించు అంటూ ఇంద్రుడు చెప్పాడు. అంతలోనే శౌర్య వచ్చి బయట ఉన్న వారిని చూసి ఆనందంలో మునిగిపోయింది. అయితే తల్లిదండ్రులను శౌర్య కలిసిందా లేదా అనేది చిన్న ట్విస్టుతో ఎపిసోడ్‌ను ముగించారు.

  English summary
  Karthika Deepam October 31st Episode number 1497
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X