For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam నన్ను చంపించడానికి ప్లాన్ చేశావా? మోనిత బండారాన్ని బయటపెట్టిన కార్తీక్

  |

  గతం గుర్తుకు వచ్చిన తర్వాత కార్తీక్‌కు మోనిత వ్యవహారంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతలోనే దుర్గ వచ్చి.. రాత్రి నా ఇంటికి వచ్చినప్పుడు.. నీ బ్యాగ్ నా వద్దే ఉండిపోయింది అని దుర్గ అనగానే.. మోనితకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. కార్తీక్ అనుమానంగా చూడటంతో.. ఏం లేదు సార్.. మీరు తప్పిపోయారు కదా.. రాత్రంతా వెతికి.. ఉదయమే వెళ్లిపోదామని చెప్పాను. తప్పిపోయిన వాడు ఇక్కడ ఉంటాడా? ఇంటికి వెళ్లిపోతాడు లే అని రాత్రికి రాత్రే తీసుకొచ్చింది. దుర్గ మాటలు విన్న కార్తీక్.. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన పని అయిపోయిందని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. దుర్గను మోనిత ఆపింది. నన్ను కార్తీక్ వద్ద బుక్ చేస్తావా? నీ అంతు చూస్తాను అంటే.. నా అంతు తర్వాత చూద్దువు గానీ.. నీ భవిష్యత్తు చూసుకో అని దుర్గ ఎగతాళి చేశాడు. ఇంకా తేడా జరగడం ఏమిటి? జరుగాల్సిన తేడా అప్పుడే జరిగిపోయిందని దుర్గ అన్నాడు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1484లో ఇంకా ఏం జరిగిందంటే?

  శౌర్య బొమ్మలు అమ్మడం ఏమిటి?

  శౌర్య బొమ్మలు అమ్మడం ఏమిటి?


  దుర్గ మాటలతో మనస్తాపానికి గురైన కార్తీక్.. తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను బతికి ఉన్నాగానీ.. నా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను. ప్రాణాలతో ఉండి కూడా ఎవరితోనూ కలిసి ఉండలేదా? ఎంత పనిచేశావు మోనిత.. యాక్సిడెంట్ తర్వాత దీప ఎక్కడేందుకు ఉంది. నేను దీప భర్తగా ఉండాలి కదా.. మరి మోనిత భర్తగా ఎందుకు ఉన్నాను. దీప ఇక్కడ ఎందుకు ఉంది. అమ్మ, నాన్నలను కలువలేదా? మరి పిల్లలు ఎక్కడ ఉన్నారు. శౌర్య, వారణాసి ఇక్కడ ఉన్న విషయం దీపకు తెలియదా? రౌడీ బొమ్మలు అమ్మడం ఏమిటి? హిమను కారు నుంచి తోసేశాం. హిమకు ఏం కాలేదు కదా.. దీపను అడిగితే.. వద్దు.. నాకు గతం గుర్తుకు వచ్చిందని దీపకు తెలుస్తుంది. దీపపై ఎటాక్ చేయబోతే..వారణాసి అడ్డుకొన్నాడా? మోనిత ఇంతకు తెగించిందా అనే ప్రశ్నలు కార్తీక్‌ను వెంటాడాయి.

   బొమ్మలు అమ్మే అమ్మాయిని తీసుకురా అంటూ

  బొమ్మలు అమ్మే అమ్మాయిని తీసుకురా అంటూ


  మోనిత అసిస్టెంట్ శివ గార్డెన్‌లో పనిచేస్తుండగా.. కార్తీక్ వచ్చి.. మాధవ్ అని పిలిచాడు. దాంతో నా పేరు మాధవ్, మాధవన్ కాదు సార్..నా పేరు శివ. ఈ లోకంలో నన్ను ఇన్ని పేర్లతో పిలిచినట్టు ఎవరూ కూడా పిలిచి ఉండరు అని అంటే.. నీ పేరు శివనే.. కానీ నేను ఏ పేరుతో పిలిచినా నేను నిన్ను పిలుస్తున్నానని.. నీకు తెలుస్తుంది కదా. అని కార్తీక్ బదులిచ్చాడు. అయితే ఒకరోజు గణేష్ బొమ్మలు అమ్మే అమ్మాయి ఎప్పుడైనా కనిపించిందా? అంటే.. నిన్ననే సంగారెడ్డిలో బతుకమ్మ వేడుకల్లో కనిపింది. అయితే ఆ అమ్మాయిని చూసి మోనిత బెదిరించింది. ఇటువైపు వస్తే.. నీ అంతు చూస్తానని చెప్పింది అని కార్తీక్‌కు శివ చెప్పాడు. అయితే ఎందుకు సార్ అమ్మాయి గురించి అడుగుతున్నారని ప్రశ్నించాడు. దాంతో ఏం లేదు శివ.. అంత చిన్నతనంలో బొమ్మలు అమ్ముకొని జీవిస్తున్నదంటే.. జాలీ వేసింది. నేను అమ్మాయిని చదించాలని అనుకొంటున్నాను. కాబట్టి ఆ అమ్మాయిని కలువాలని అనుకొంటున్నాను. నీకు కనిపిస్తే నా వద్దకు తీసుకురా.. కానీ ఆ అమ్మాయి గురించి నేను అడిగినట్టు నీ బాస్ మోనితకు చెప్పవద్దు అని కార్తీక్ అన్నాడు.

  నా కుటుంబాన్ని ముక్కలు చేసిందంటూ

  నా కుటుంబాన్ని ముక్కలు చేసిందంటూ


  మోనిత చేసిన అరాచకాలను గుర్తు చేసుకొంటూ కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు. నా కుటుంబాన్ని ముక్కలు చేసింది. చెట్టుకు పుట్టుకు ఒకరిని చేసింది. నా కుటుంబానికి, దీపకు నన్ను దూరం చేసి.. నన్ను పొందాలని ప్లాన్ వేసింది. పెద్ద వాళ్లను ఆడుకొంటున్నావు. చిన్నపిల్లలనే జాలీ లేదు నీకు. నా బిడ్డ బొమ్మలు అమ్ముకొని బతుకుతుంది. నీకు ఇప్పుడే బుద్ది చెప్పాలని ఉంది. కానీ దీపను ఏం చేస్తావో అనే భయం ఉంది. రౌడీ నిన్ను కలుస్తాను. నీతో కలిసి అమ్మను కలుద్దాం. నీ అమ్మకళ్లలో ఆనందం చూడాలని ఉంది అని కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు.

  దీపను చంపించడానికి ప్లాన్ చేశావా? లేదా?

  దీపను చంపించడానికి ప్లాన్ చేశావా? లేదా?


  ఇంట్లోకి వచ్చి మోనిత.. మోనిత అంటూ గట్టిగా అరిచాడు. కార్తీక్ అరుపుకు భయపడి.. మళ్లీ ఏం గుర్తుకు వచ్చిందో.. ఆయన ముందుకు వెళ్లాలంటేనే భయంగా ఉంది అనుకొంటూ కార్తీక్ ముందుకు వచ్చింది. మోనిత రాగానే.. దీపను ఎందుకు ఎటాక్ చేయించావు అని అడిగితే.. నేను ఎటాక్ చేయించడం ఏమిటి? అంటూ ప్రశ్నించింది. అంతలోనే దీప అక్కడకు వచ్చి చాటుగా వినడం మొదలుపెట్టింది. మోనితను నిలదీస్తూ.. కావాలంటే.. వాళ్లకు ఫోన్ చేసి అడుగు. నేను కొట్టానా లేదా అని అడుగు అని కార్తీక్ అంటే.. నాకేం తెలుసు అని మోనిత అంది. నీవు దీపను ఎటాక్ చేయించాలని ప్లాన్ చేశావా? లేదా అంటే.. నేను ఏదో ఆవేశంలో అన్నాను. దానితో నాకేం సంబంధం లేదు అని మోనిత సమాధానం చెప్పింది.

  నన్ను చంపడానికి ప్లాన్ చేశావా?

  నన్ను చంపడానికి ప్లాన్ చేశావా?


  అయితే మోనిత మాటలను నమ్మకపోవడంతో.. కార్తీక్ నా మాటలు ఎందుకు నమ్మడం లేదని మోనిత నిలదీస్తే.. మరి నా కోసం పంపావా? నన్ను చంపడానికి ప్లాన్ చేశావా? అని అంటే.. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్.. నేను నిన్ను చంపించడానికి ప్లాన్ చేస్తానా? అని అంటే.. సంగారెడ్డికి వెళ్తుంటే.. నన్ను చంపించేందుకు దుర్గ, నీవు ప్లాన్ చేస్తున్నావా? అని అడిగానా? లేదా? అప్పుడే దుర్గ అక్కడికి వచ్చాడు అని కార్తీక్ అంటే.. నన్ను ప్రతీ విషయంలోను అనుమానిస్తున్నావు అని మోనిత అన్నది. అయితే నా తలకు దెబ్బేమిటి? అని కార్తీక్ అంటే.. ఎవరో కొట్టారు. నాకేం తెలుసు అని మోనిత అంది. అయితే ఎవరు కొట్టారో చెప్పు అని అంటే.. నిన్ను కొట్టింది.. శౌర్య అని చెప్పలేను. నేను చెబితే నా గొతిని నేను తవ్వికున్నట్టే అవుతుంది అని మోనిత మనసులో అనుకొన్నది. అయితే నన్ను కొట్టింది ఎవరో చెప్పు అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

  దుర్గ, దీప మాస్టర్ ప్లాన్

  దుర్గ, దీప మాస్టర్ ప్లాన్


  అయితే భోజనానికి కార్తీక్‌ను పిలిచేందుకు వెళ్లిన దీప.. ఒంటరిగా తిరిగి వస్తుంటే.. దుర్గ ఎదురుపడ్డాడు. ఏంటి దీపమ్మ.. కార్తీక్ రావడం లేదు ఏంటి అంటే? అక్కడ వేరే కథ నడుస్తున్నది. నన్ను చంపించడానికి మోనిత మనుషులను పెట్టింది. కార్తీక్ ఆ విషయాన్ని చెప్పాడు. కార్తీక్ కోపంతో ఇంట్లో వేరే రూమ్‌లోకి వెళ్లాడు. దీప హాల్‌లో కూర్చొని ఉంది అని దీప చెప్పింది. అయితే నేను ఇక మోనిత సంగతి చూసుకొంటాను. నాకు కూడా కావాల్సింది అదే.. అని దీప వద్ద నుంచి దుర్గ మోనిత వద్దకు వెళ్లాడు. హాల్‌లో కూర్చున్న మోనితను చూస్తూ.. హల్లో బంగారం అని అనగానే.. వెంటనే దుర్గ కాలర్ పట్టుకొని కోపంతో ఊగిపోయింది. అవునులే.. మనం అనుకొన్న పనులు జరగకపోతే చిరాకుగా ఉంటుంది. దీపను లేపేయడానికి మనుషులను పెట్టావటగా.. అని దుర్గ అంటుంటే.. ఆ మాటలు కార్తీక్ చెవిలో పడ్డాయి.

  English summary
  Karthika Deepam October 15th Episode number 1484.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X