Don't Miss!
- News
లోకేష్ యాత్ర కొత్త "టర్న్" - చంద్రబాబు వ్యూహాం: రంగంలోకి బాలయ్య - నందమూరి ఫ్యామిలీ..!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Bigg Boss 11th Week Nominations: వాళ్లందరికీ భారీ షాకిచ్చిన బిగ్ బాస్.. ఈ సారి ఊహించని నామినేషన్స్
చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ప్రేమలు.. కొట్లాటలు ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతూ తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే మన షో ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో నిలుస్తోంది. ఈ కారణంగానే ఇది ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే గత నెలలో ఐదోది కూడా ప్రారంభం అయింది. ఇది కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉంటున్నారు. దీంతో ఈ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 11వ వారానికి సంబంధించిన నామినేషన్స్ జాబితా ముందే లీకైంది. దానిపై ఓ లుక్కేద్దాం పదండి!

ఇది కూడా వాటిలాగే సక్సెస్‌ఫుల్‌గా
తెలుగులో బిగ్ బాస్ అన్ని సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఐదో సీజన్‌కు ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే 19 మంది కంటెస్టెంట్లను తీసుకొచ్చి.. గొడవలు, బూతులు, రొమాన్స్ చూపిస్తూ పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఈ ఉత్సాహంతోనే షోను మరింత రసవత్తరంగా మార్చేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రియాలిటీ షోకు వీక్ డేస్‌తో పాటు వీకెండ్స్‌లో మంచి రేటింగ్ సొంతం అవుతోంది.
పెళ్లైనా తగ్గని స్టార్ హీరోయిన్: జాకెట్ విప్పేసి మరీ బ్రాతో ఘాటుగా.. మరీ ఇంత రచ్చ అవసరమా!

19 మందిలో.. 9 మంది ఓట్లతో ఔట్
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌లోకి ఏకంగా మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొత్తం ఇప్పటి వరకూ పది వారాలు పూర్తయ్యాయి. ఇందులో పది మంది ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. అందులో మొదటి వారం సరయు రాయ్, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత వర్మ, ఏడో వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదో వారంలో విశ్వలు ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయిపోయారు.

ఒకరిని సేవ్ చేసి.. జెస్సీ బయటకు
ఇప్పటి వరకూ బిగ్ బాస్ ఎలిమినేషన్ అనుకున్నట్లుగానే వారానికి ఒకరు చొప్పున ప్రేక్షకులు వేసిన ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోయారు. అయితే, పదో వారంలో మాత్రం బిగ్ ట్విస్ట్ కనిపించింది. ఆ వారానికి గానూ వీజే సన్నీ, సిరి హన్మంత్, యాంకర్ రవి, ఆర్జే కాజల్, మానస్‌లు నామినేట్ అయ్యారు. వీళ్లలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ, ఊహించని విధంగా జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ అనారోగ్యానికి గురి కావడంతో అతడిని బయటకు పంపేశారు. ఫలితంగా గత వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో ఒకరు ఎలిమినేషన్ తప్పించుకున్నారు.
హాట్ షోలో బౌండరీ దాటేసిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో మొత్తం కనిపించేలా ఘాటు ఫోజు

ఆరోజు కోసమే ప్రేక్షకులు వెయిట్
బిగ్ బాస్ షోలో ఎన్నో టాస్కులు.. మరెన్నో చిత్ర విచిత్రమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అయితే, అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అన్న విషయం తెలిసిందే. వారం మొదలైన రోజు అంటే ప్రతి సోమవారం దీన్ని ప్రసారం చేస్తుంటారు. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఇలా ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్స్ రసవత్తరంగా సాగాయి. దీంతో ఆరోజు ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదరు చూస్తూ ఉంటారు.

11వ వారం నామినేషన్ వివరాలివే
ఐదో సీజన్‌లో ఇప్పటికే పది వారాలు పూర్తయ్యాయి. ఇందులో పది మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇక, ఇప్పుడు తొమ్మిది మంది సభ్యులు మాత్రమే హౌస్‌లో మిగిలారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ప్రసారం కాబోతున్న 11వ వారం నామినేషన్స్ ప్రక్రియ వివరాలు లీక్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఒక కంటెస్టెంట్ ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వాళ్ల తలపై స్లైమ్ (చిక్కటి ద్రవం) పోయాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్ మొత్తం ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
హాట్ హాట్ వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: బ్రాతో అలా చేస్తూ ఓ రేంజ్లో రెచ్చిపోయిన యాంకర్

ఈ వారం వాళ్లంతా నామినేషన్‌లో
తాజా సమాచారం ప్రకారం.. 11వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియ అంతా గతంలో మాదిరిగానే కంటెస్టెంట్ల మధ్య గొడవలతో సాగుతుందట. మరీ ముఖ్యంగా సన్నీతో షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, శ్రీరామ చంద్రలు గొడవలు పడతారని తెలిసింది. ఇక, ఈ ప్రక్రియలో ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారని తెలిసింది. అంటే ఒక్క కెప్టెన్ రవి తప్ప హౌస్‌లో ఉన్న మిగిలిన సభ్యులైన మానస్, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, ఆనీ మాస్టర్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్రలు నామినేట్ అయ్యారని తెలుస్తోంది.
Recommended Video

అంతా ఉండడంతో ఆసక్తికరంగా
11వ వారానికి సంబంధించి మొత్తం కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇందులో ఫాలోయింగ్ భారీగా ఉన్న సభ్యులు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే, బయట పెద్దగా ఫ్యాన్‌బేస్ లేని వాళ్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఈ ఎనిమిది మంది సభ్యుల్లో ఎవరు ఉంటారు? ఎవరు వెళ్తారు అన్నది ఆటను బట్టి కాకుండా బయటి ఫాలోయింగ్‌ను బట్టి డిసైడ్ చేయబోతున్నారు. దీంతో ఈ వారానికి ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.