For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 13th Week Nominations: ఆ ఇద్దరు తప్పా అందరూ నామినేట్.. ఆ కంటెస్టెంట్లను కాలితో తన్నడంతో!

  |

  ఎన్నో అనుమానాలతో తెలుగు బుల్లితెరపైకి పరిచయం అయినా.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో నడిచేదే అయినా దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా దేశంలోనే ఇది నెంబర్ వన్ షోగా మారిపోయింది. ఈ జోష్‌లోనే ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ కూడా ఆరంభం నుంచే మంచి స్పందనతో దూసుకుపోతోంది.

  ఇప్పుడిది చివరి దశకు చేరుకోవడంతో నిర్వహకులు సరికొత్త టాస్కులతో ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ఇది మరింత రంజుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 13వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ లీకైంది. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే!

  గతంలో ఎన్నడూ లేని ప్రయోగాలు

  గతంలో ఎన్నడూ లేని ప్రయోగాలు

  తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా దానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వస్తోంది. దీంతో టీఆర్పీలో మన షో దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంటోంది. ఇప్పుడు ఐదో సీజన్‌లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఆరంభంలోనే 19 మందిని పంపిన నిర్వహకులు షోపై ఆసక్తిని పెంచారు. ఆ తర్వాత క్రమంగా షోలో గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో షోపై ఇంకా ఆసక్తిని పెంచేలా ప్లాన్ చేస్తూ సరికొత్త కాన్సెప్టులతో టాస్కులు ఇస్తున్నారు.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

  బిగ్ బాస్ షో నుంచి 12 మంది ఔట్

  బిగ్ బాస్ షో నుంచి 12 మంది ఔట్

  ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 12 వారాలకు పన్నెండు మంది సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత, ఏడో వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదో వారంలో విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో బయటకు వెళ్లాడు.

  ఆఖరి అంకానికి చేరుకున్న సీజన్

  ఆఖరి అంకానికి చేరుకున్న సీజన్

  బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. మరో మూడు వారాల్లో ఫినాలే కూడా జరగబోతుంది. దీంతో నిర్వహకులు నిర్వహకులు చిత్ర విచిత్రమైన టాస్కులతో ముందుకు వస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు హౌస్‌లో ఉన్న ఏడుగురికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక, ఈ వారం నుంచి బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ ఉండదు.. అంటే ఇంటికి కెప్టెన్ ఉండడు. దీంతో మరిన్ని ప్రయోగాత్మక టాస్కులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి నుంచి ఆట మరింత కష్టంగా సాగేలా నిర్వహకులు వ్యూహాలు రెడీ చేశారని అంటున్నారు.

  రష్మీ, సుధీర్ బండారం బయటపెట్టిన గెటప్ శ్రీను: పెళ్లి ఎప్పుడని అడిగితే.. సీక్రెట్ లీక్ చేసి మరీ!

  ఈరోజు కోసమే అందరూ చూస్తారు

  ఈరోజు కోసమే అందరూ చూస్తారు

  ఈ రియాలిటీ షోలో ఎన్నో టాస్కులు.. మరెన్నో చిత్ర విచిత్రమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అయితే, అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అన్న విషయం తెలిసిందే. వారం మొదలైన రోజు అంటే ప్రతి సోమవారం దీన్ని ప్రసారం చేస్తుంటారు. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఇలా ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్స్ రసవత్తరంగా సాగాయి. దీంతో ఆరోజు ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు.

  13వ వారం నామినేషన్స్ ప్రక్రియ

  13వ వారం నామినేషన్స్ ప్రక్రియ

  12వ వారం ఎలిమినేషన్ ఊహించని విధంగా సాగిన విషయం తెలిసిందే. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యాంకర్ రవి షో నుంచి బయటకు వెళ్లిపోవడం చాలా మందిని షాక్‌కు గురి చేసింది. అతడి అభిమానులైతే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో 13వ వారం జరిగే నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగనుంది. ఇందులో కంటెస్టెంట్ల ఫొటోలతో బాల్స్ ఉంటాయి. ఇంటి సభ్యులు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో.. ఆ ముఖం ఉన్న బాల్‌ను బిగ్ బాస్ మెయిన్ గేట్ బయటకు కాలితో తన్నాల్సి ఉంటుంది. ఇది ఆసక్తికరంగా సాగిందని టాక్.

  అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన దిశా పటానీ: అబ్బో బికినీలో శృతి మించి.. ఇలా చూస్తే తట్టుకోగలరా!

  13వ వారం ఎవరెవరు నామినేట్?

  13వ వారం ఎవరెవరు నామినేట్?

  తాజా సమాచారం ప్రకారం.. 13వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియ అంతా గతంలో మాదిరిగానే కంటెస్టెంట్ల మధ్య గొడవలతో సాగుతుందట. మరీ ముఖ్యంగా కాజల్‌తో షణ్ముఖ్ జస్వంత్ గొడవ పడతారని తెలిసింది. ఇక, ఈ ప్రక్రియలో ఏకంగా ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్‌తో పాటు వీజే సన్నీ తప్పించుకున్నారట. అంటే హౌస్‌లో ఉన్న మిగిలిన సభ్యులు మానస్, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, ప్రియాంక, శ్రీరామ చంద్రలు నామినేట్ అయ్యారని సమాచారం.

  Jeethu Joseph About Screen Writing | Drushyam 2
  ఈ వారం ఎలా సాగుతుందబ్బా!

  ఈ వారం ఎలా సాగుతుందబ్బా!

  13వ వారానికి సంబంధించి మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇందులో ఫాలోయింగ్ భారీగా ఉన్న సభ్యులు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే, బయట పెద్దగా ఫ్యాన్‌బేస్ లేని వాళ్లు డేంజర్‌ జోన్‌లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది అని అంతా అనుకుంటారు. కానీ, రవి ఎలిమినేషన్ తర్వాత అందరిలోనూ భయం నెలకొంది. బయట ఎవరికి ఎలాంటి ఆదరణ దక్కుతుందో అర్థం కావడం లేదు. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌పై కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. In 13th Week Kajal, Sreeram, Priyanka, Maanas and Siri Gets Gets Nominated.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X