Bigg Boss Contestants List: బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్.. ఎవరెవరికి చోటు అంటే?
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో బిగ్‌బాస్ షోలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే మలయాళంలో మొదలు కాగా, హిందీ, తెలుగు, ఇతర భాషల్లో స్టార్ట్ కావడానికి సిద్దమవుతున్నాయి. అయితే ఆదివారం అంటే ఆగస్టు 24వ తేదీన హిందీలో బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 గ్రాండ్‌గా ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే అత్యధిక రేటింగ్ ఉన్న టాప్ రియాలిటీ షోకు సంబంధించిన కంటెస్టెంట్ల వివరాలు, హోస్ట్ సల్మాన్‌కు సంబంధించిన విశేషాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ 19 సీజన్‌కు సర్వం సిద్ధమంది. సల్మాన్ ఖాన్ హోస్టుగా ప్రారంభించనున్న ఈ రియాలిటీ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు, అలాగే ఇంటిలోని విశేషాలకు సంబంధించిన వివరాలు మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అవుతున్నాయి. అయితే సల్మాన్ ఎంట్రీ, అలాగే ప్రారంభ వేడుక ఈవెంట్ కార్యక్రమాల షూట్ ముగిసింది. లైవ్‌కు షోకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి అని తెలిసింది.

ఇక బిగ్‌బాస్ 19 షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు రకరకాలుగా వినిపించాయి. కానీ ఎండెమాల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం తమ జాబితాలోని సినీ, టెలివిజన్, సోషల్ మీడియా సెలబ్రిటీల పేర్లు చాలా గోప్యంగా ఉంచాయి. అయితే కంటెస్టెంట్ల పేర్ల గురించి ఊహగానాలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 19వ సీజన్‌లో కన్ఫర్మ్ కంటెస్టెంట్‌గా వినిపిస్తున్న పేరు అనుపమ, మాస్టర్ చెఫ్ హోస్ట్ గౌరవ్ ఖన్నా, ఆ తర్వాత సింగర్, మ్యూజిక్ కంపోజర్ అమాల్ మాలిక్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ అమాల్ మాలిక్‌కు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూ మాలిక్‌కు బంధువు, ఈయ తండ్రి కూడా దాబూ మాలిక్ మ్యూజిక్ రంగానికి చెందిన వారే. సల్మాన్ ఖాన్ నటించిన జై హో, హీరో సినిమాల్లో పాటలు పాడటం ద్వారా మంచి గుర్తింపు పొందారు.
అలాగే నా బోలే తుమ్, నా మై కుచ్ కహా ఫేమ్, బాల నటి అష్నూర్ కౌర్ కూడా ఇంటిలోకి వెళ్తున్నట్టు వార్తలు వచ్ాచయి. ఇటీవల మన్మర్‌జియాన్ అనే సినిమాలో కూడా నటించింది. ఇంకా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆవేజ్ దర్బార్, నగ్మా మిరాజ్‌కర్ తదితరుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఇంకా ధీరజ్ ధూపర్, జీషాన్ ఖాద్రీ, బషీర్ అలీ, కునికా సదానంద్, అభిషేక్ బజాజ్, వాబిజ్ దోరాబ్జీ, నేహల్ చుడాసమ తదితరులు పేర్లు కూడా వినిపించాయి. ఈ షోలో ఎవరు? ఉంటారనే విషయం కొద్ది గంటల్లో తేలిపోవడం ఖాయం.


Click it and Unblock the Notifications











