For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలీ భార్యను జుట్టు పట్టి లాగిన రాహుల్.. ముద్దులు, హగ్గులతో నిండిపోయిన హౌస్

  |

  పదమూడో వారంలో బిగ్ బాస్ తన ఇంటి సభ్యులకు ఫ్యామిలీ టచ్‌ను రుచి చూపించారు. దాదాపు 80 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న కంటెస్టెంట్లు.. ఒక్కసారిగా తమవారిని చూసే సరికి ఎమోషనల్ అయ్యారు. శివజ్యోతి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

  నామినేషన్ ప్రక్రియ అనంతరం..

  నామినేషన్ ప్రక్రియ అనంతరం..

  ఈ వారం నామినేషన్ ప్రక్రియే అంతా గందరగోళంగా గడిచింది. శివజ్యోతి, వితికా పట్టువదలకపోవడంతో హౌస్ మేట్స్ అందరూ నామినేషన్‌లోకి వచ్చారు. దీంతో శ్రీముఖి కోసం బాబా భాస్కర్ చేసిన త్యాగం, అలీ కోసం రాహుల్ తన స్థానాన్ని వదులుకోవడం వంటివి వృథాగా పోయాయి.

  బిగ్‌బాస్ హోటల్‌లో ఫ్యామిలీ టచ్..

  బిగ్‌బాస్ హోటల్‌లో ఫ్యామిలీ టచ్..

  బిగ్‌బాస్ తన హౌస్‌ను హోటల్‌గా మార్చేశాడు. ఒకప్పుడు దానికున్న సెవెన్ స్టార్ స్టేటస్‌ను అది కోల్పోవడంతో తిరిగి తెచ్చే బాధ్యతను అందరిపై పెట్టాడు. మేనేజర్‌గా వరుణ్, వంటవాళ్లుగా బాబా, శ్రీముఖి, వితికా.. హౌస్ కీపింగ్ టీమ్‌లో రాహుల్, అలీ, శివజ్యోతి అంటూ విడగొట్టాడు. దీంతో వచ్చే అతిథులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారు స్టార్స్ ఇచ్చేలా అతిథి మర్యాదలు చేయాలని తెలిపాడు.

  మధ్యమధ్యలో ఇష్టం వచ్చిన టాస్క్‌లు..

  మధ్యమధ్యలో ఇష్టం వచ్చిన టాస్క్‌లు..

  ఈ టాస్క్‌లొ భాగంగా బిగ్ బాస్ సమయానుసారంగా తనకు నచ్చిన పనులను చేయమంటానని తెలిపాడు. ఇంటి చుట్టూ మార్చ్ చేయడం, ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో పనులు చేయడం, నిద్ర పోవడం, ఎక్కడి వారు అక్కడే కదలకుండా ఉండిపోవడం, మ్యూజిక్ వచ్చినప్పుడు డ్యాన్సులు వేయడం ఇలా తనకు నచ్చినట్లు మార్చుకుంటూ టాస్క్‌లు ఇస్తానని తెలిపాడు.

  మార్చ్ చేస్తున్నప్పుడు ఎంట్రీ ఇచ్చిన వితికా సోదరి..

  మార్చ్ చేస్తున్నప్పుడు ఎంట్రీ ఇచ్చిన వితికా సోదరి..

  గార్డెన్ ఏరియాలో ఇంటి సభ్యులందరూ మార్చ్ చేస్తుండగా.. వితికా సోదరి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసిన వితికా ఏడుస్తూనే టాస్క్‌ను కొనసాగించింది. అనంతరం రిలీజ్ అని చెప్పగానే గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. లోపలకి తీసుకెళ్లి అతిథి మర్యాదలను చేశారు. బయటి ట్రెండ్ ఎలా నడుస్తుంది? నెగెటివిటీ ఏమైనా ఉందా? అనే విషయాలను అడిగి తెలుసుకుంది.

  నిద్ర పోతుండగా వచ్చిన అలీ భార్య..

  నిద్ర పోతుండగా వచ్చిన అలీ భార్య..

  అందరికీ స్లీప్ మోడ్ అనే టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్.. అదే సమయంలో అలీ భార్య మాసుమను ప్రవేశపెట్టాడు. అయితే అందరూ కళ్లు మూసుకుని టాస్క్‌ను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలీ, రాహుల్ ఒకర్నొకరు కొట్టుకోవడం లాంటివి చేస్తూ.. సోఫాలో కూర్చున్నారు. శివజ్యోతి కూడా వారికి పక్కనే కూర్చుని ఉంది. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చింది అలీ భార్య.

  ఆమె జుట్టు పట్టుకుని లాగిన రాహుల్..

  ఆమె జుట్టు పట్టుకుని లాగిన రాహుల్..

  టాస్క్ ఆడుకుంటూ ఉన్న రాహుల్‌కు అలీ భార్య అని తెలియకు జుట్టు పట్టుకుని లాగాడు. మెడ మీద చెయ్యి వేసి మళ్లీ జుట్టును లాగేందుకు ప్రయత్నించగా.. అలీ చెయ్యి అడ్డుపెట్టాడు. తన భార్య వచ్చిందని అప్పటికే అలీకి అర్థమైంది. తన భర్త తలను ఒళ్లోకి తీసుకుని హత్తుకో సాగింది.

  హగ్గులు, ముద్దులతో నిండిపోయిన హౌస్...

  హగ్గులు, ముద్దులతో నిండిపోయిన హౌస్...

  ఎన్నో రోజుల తరువాత తమ భార్యను, భర్తను చూసిన ఆనందంలో తమను తాము మర్చిపోయారు కంటెస్టెంట్లు. ఆనందంతో హత్తుకున్నారు. ప్రేమగా ముద్దులు పెట్టుకున్నారు. వెళ్తూ వెళ్తూ.. చివర్లో అలీ తన భార్యకు హగ్ ఇవ్వడం, ముద్దు పెట్టడం హైలెట్‌గా నిలిచింది. అదే విధంగా శివజ్యోతి కూడా చివరి క్షణంలో గేటు వద్ద తన భర్తను హగ్ చేసుకుంది. బాబా భాస్కర్ అయితే ఏకంగా గేట్ అవతలకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇక నేటి ఎపిసోడ్‌లో వరుణ్ సందేశ్ బామ్మ, రాహుల్ వాళ్ల అమ్మ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

  English summary
  Bigg Boss 3 Telugu 13th Week updates. All housemates Family Members Visiting Bigg Boss House. In Today Episode Sivajyothi, Baba Bhaskar Families Enters Into House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X