For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో కోలుకుని లైవ్ లోకి వస్తా.. పునర్నవి ఎమోషనల్ పోస్ట్

|
Bigg Boss Telugu 3 : Punarnavi Emotional Post In Instagram

బిగ్ బాస్ హౌస్లో పదకొండు వారాలు గడిచిపోయాయి. ఎనిమిది ఎలిమినేషన్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఒక రీఎంట్రీ ఇలా ఎన్నో విశేషాలు జరిగాయి. ఇన్ని రోజుల్లో రెండు ఎలిమినేషన్లు మాత్రమే చూసే ప్రేక్షకులను కూడా కదిలించాయి. అలీ రెజా ఎలిమినేట్ అయినప్పుడు శ్రీముఖి, శివజ్యోతి, రవి ఏడ్వడం.. మళ్లీ నిన్నటి ఎపిసోడ్లో పునర్నవి ఎలిమినేషన్ ఘట్టం అందర్నీ కదిలిచింది.

మొదట్నుంచీ కలిసికట్టుగా..

ఐకమత్యమే మహాబలం అనే సిద్దాంతాన్ని పాటిస్తూ.. వరుణ్, వితికా, పునర్నవి, రాహల్ కలిసి ఉన్నారమోననిపిస్తుంది. వీరిలా కలిసి ఉండటమే మూలానే బిగ్ బాస్ హౌస్లో ఇంతకాలం ఉండగలిగారు. ఈ నలుగురిలో ఎవరు నామినేషన్లోకి వెళ్లినా.. నలుగురి ఫాలోవర్స్ కలిసి ఓట్లు వేసేవారు.. సేవ్ అయ్యేలా చేసేవారు. అయితే పదకొండో వారంలో రాహుల్, వరుణ్, పనర్నవి ముగ్గురు నామినేషన్లోకి వచ్చేశారు. దీంతో పునర్నవి బయటకు వచ్చేసింది.

అందరికీ టార్గెట్ అయిన బ్యాచ్..

అందరికీ టార్గెట్ అయిన బ్యాచ్..

వచ్చిన మొదటి రోజు నుంచి.. గ్రూప్ గా మారారంటూ టార్గెట్ చేశారు. అయితే వీరు బహిరంగంగానే గ్రూప్ మెయింటెన్ చేశారు. కానీ కొందరు మాత్రం వారే ఓ గ్రూప్ ను నడుపుతూ.. వరుణ్ గ్యాంగ్ ను గ్రూప్ అంటూ టార్గెట్ చేసేవారు. దీంతో వరుణ్ బ్యాచే ప్రతీసారి నామినేషన్ను ఫేస్ చేసేది. ఈ హౌస్లో అత్యధిక సార్లు నామినేట్ అయిన వ్యక్తిగా రాహుల్ ఇప్పటికే రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా మొదట్నుంచీ వీరిని టార్గెట్ చేస్తూ వచ్చేవారు.

ఎవరితోనూ కలవదంటూ..

ఎవరితోనూ కలవదంటూ..

పునర్నవి ఎవరితోనూ కలవదు.. సరిగా మాట్లాడదు.. అంటూ నామినేషన్ చేస్తున్నారంటూ ఒక్కసారిగా ఫైర్ అయింది. ఆ సమయంలో మొండిగా ప్రవర్తించింది. బిగ్ బాస్ చెప్పినా వినలేదు.. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే.. హౌస్మేట్స్ అందరూ నామినేట్ అవుతారని చెప్పినా.. తన సెల్ఫ్ నామినేట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. చివరకు వరుణ్ సలాహా మేరకు తన పట్టుదలను వదిలింది.

లేడీ మోనార్క్..

లేడీ మోనార్క్..

పున్నురో.. పున్నురో.. ఏం పిల్లరో.. బిగ్ బాసే తన డాడీ అని ఫీలవుతాదిరో.. అనేది రాహుల్ పాడిన పాట. నిజంగానే పునర్నవి అలానే ప్రవర్తిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ ను కూడా లెక్కచేయదు. నచ్చకపోతే ఎవ్వడి మాట వినదు. పున్ను తమ్ముడు కూడా ఇదే మాట చెప్పాడు. ఎన్నో సందర్భాల్లో బిగ్ బాస్ ఆదేశాలను బేఖాతరు చేసింది. బిగ్ బాస్ ను ధిక్కరించి.. నిజంగానే మోనార్క్ అని నిరూపించుకుంది.

తిట్ల స్పెషలిస్ట్..

తిట్ల స్పెషలిస్ట్..

పునర్నవి తిట్టిన తిట్లన్నీ.. ఈ మూడు సీజన్స్లో ఉన్న ఏ కంటెస్టెంట్ కూడా తిట్టి ఉండరు. అయితే అందులో ప్రేమతో తిట్టిన తిట్లే ఎక్కువగా ఉంటాయి.. అది వేరే విషయమనుకోండి. రాహుల్, పునర్నవి మధ్య వచ్చిన తిట్లను ప్రేమ అనే క్యాటగిరి కింద వేసుకోవాలి. అయితే మిగతా హౌస్మేట్స్ ను కూడా అలానే తిట్టే సరికి.. ఆమెకు కాస్త నెగెటివిటీ పెరిగింది. ఇదే విషయంలో నాగార్జున గతవారంలో హెచ్చరించాడు. అయితే అనూహ్యంగా కొత్త తిట్లతో ముందుకు వచ్చింది. దీంతోచేసేదేం లేక.. అంతకు ముందుకు తిట్లకంటే ఇవే బాగున్నాయని నాగ్ మెచ్చుకున్నాడు.

 రాహుల్ పున్ను ఫన్నీ మూమెంట్స్...

రాహుల్ పున్ను ఫన్నీ మూమెంట్స్...

మొదట్లో వీరిద్దరి కలిసి కూర్చోని డేటింగ్ గురించి మాట్లాడుకోవడం, ప్రేమ విషయాలను పంచుకోవడం, ప్రపోజ్ చేయడంలాంటి ఫన్నీ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ప్రేమగా గోరు ముద్దలు తినిపించడం, తను సేవ్ అవ్వడం కోసం కాకరకాయ జ్యూస్ తాగడం.. ఎమోషనల్ అయిన పున్ను గాడంగా హత్తుకుని ముద్దు పెట్టడం, టాస్క్లో భాగంగా.. పెళ్లామా అంటూ రాహుల్ పిలవడం.. ఆయన గారూ అంటూ పునర్నవి కొంటెగా కవ్వించడం ఇలా ఎన్నో మరపురాని మెమోరిస్ ఉన్నాయి.

బిగ్ బాస్ జర్నీ వీడియో..

బిగ్ బాస్ జర్నీ వీడియో..

బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కు తమ జర్నీకి సంబంధించిన వీడియోను చూపిస్తాడు. అందరిదీ మనసును తాకేలానే ఉంటుంది. బాధ, ఆనందం, దుఖం, సంతోషం, కోపం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ను కలిసి ఓ వీడియోను తయారు చేస్తారు. అయితే నిన్నటి పునర్నవి జర్నీ వీడియోలో రాహుల్, పున్ను ఉన్న సన్నివేశాలు, ఎడిట్ చేసిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. అందర్నీ ఏడ్పించేలా చేసింది. వీడియోను చూస్తున్న పున్ను కళ్లు కూడా చెమ్మగిల్లాయి. కానీ ఏడుపును ఆపుకుంది.

సోషల్ మీడియోలో ఎమోషనల్ పోస్ట్

సోషల్ మీడియోలో ఎమోషనల్ పోస్ట్

బయటకు వచ్చిన పునర్నవి సోషల్ మీడియా వేదికగా తనకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ‘వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను.. అదొక అద్భుతమైన ప్రయాణం.. అందులో నాకు ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి.. అవన్నీ నాలోనే దాచుకుంటాను.. నన్ను సపోర్ట్ చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు. మీరు లేకుంటే నేను లేను. నన్ను నాలా యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఐ లవ్యూ ఆల్.. త్వరలో కోలుకుని లైవ్లోకి వస్తా'నంటూ పోస్ట్ చేసింది.

English summary
Punarnavi Got Eliminated In Eleventh Week. After Her Elimination She Shared A Emotional Post On Social Media. SHe Thanked Her Fans For Supporting Her.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more