Just In
- 18 min ago
చాలా కాలం తరువాత పవన్‌తో త్రివిక్రమ్.. చాయ్ గ్లాసుతోనే మొదలు పెట్టారు
- 25 min ago
ఆ ఒక్క మాటతో ఎంతో బాధ.. ఎస్పీబీపై చిరంజీవి ఎమోషనల్
- 1 hr ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 2 hrs ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
Don't Miss!
- News
సీఎం జగన్ పై చంద్రబాబు ధ్వజం .. నేరస్థులు సీఎం అయితే కోర్టులనే బెదిరిస్తారని ఆగ్రహం
- Sports
ఐపీఎల్ వేలం ముందు కుర్రాళ్లకు పరీక్ష.. నేటి నుంచి ముస్తాక్ అలీ క్వార్టర్ ఫైనల్స్!
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నీవ్వు అర్ధం చేసుకోలేకపోతే.. ఇంకెవ్వరు? నాగార్జున ట్రాప్‌లో హారిక.. అభిజిత్‌కు షాక్!
బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ఫైనల్స్ లోకి చేరుకుంటోంది. సూపర్ సెవెన్ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు పోటాపోటీగా పోరాడుతున్నారు. అయితే ఎంత బలంగా ఉన్నా కూడా ఊహించని విధంగా కొందరు హౌజ్ నుంచి వెళ్లిపోయారు. ఇక గత వారం ఎలిమినేషన్ బోర్ కొట్టించిన బిగ్ బాస్ 13వారమైనా కిక్కిస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ రోజు సోమవారం కాబట్టి కంటెస్టెంట్స్ లలో నామినేషన్ల వేడి మొదలైంది. విడుదలైన ప్రోమో ఒక్కసారిగా అంచనాల డోస్ ను పెంచేసింది.

మిత్రులు శత్రువులయ్యే సమయం..
బిగ్ బాస్ హౌజ్ లో ఎవరైనా సరే ఎలిమినేషన్స్ కి వచ్చేసరికి శత్రువులుగా మారిపోవాల్సిందే. ఇంతకుముందు అంటే హౌజ్ లో చాలా మంది ఉండేవాళ్ళు కాబట్టి ఒక్కరితో అయినా స్నేహంగా ఉండాల్సిన పరిస్థితి. ఇక ఇప్పుడు మిత్రులుగా ఉన్న ఇద్దరు కూడా శత్రువులు అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ నెవర్ బిఫోర్ అనేలా స్టార్ట్ చేశాడు.

సరికొత్తగా నామినేషన్ ప్రక్రియ..
పొడవైన సీసాలో రంగు నీళ్లను కలిపిన బిగ్ బాస్ నచ్చని వారిని నామినేట్ చేయాలంటే వాళ్ల ముందు ఉన్న బౌల్ లో ఆ నీళ్లను పోయాల్సి ఉంటుందని వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ ఇతర విషయాల్లో నిరాశపరిచినప్పటికి నామినేషన్స్ లో మాత్రం తన తెలివితో భలేగా ఆకట్టుకుంటున్నాడు. ఈ ప్రక్రియ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంది.

అఖిల్, అవినాష్..ఓవర్ కాన్ఫిడెన్స్
ఇక నామినేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిందే. వాళ్ల మిత్రులైపైనా కూడా అభిప్రాయం చెప్పాల్సిందే. ఇక నామినేషన్ లో నా కంటే వీక్ పర్సన్స్ ఉన్నారు. నేనెందుకు ఎలిమినెట్ అవ్వాలని అవినాష్ చెప్పడంతో.. అఖిల్ కౌంటర్ ఇచ్చాడు. నా కన్న వీక్ ఉన్నారు అంటే ఎక్కడో ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా అంటూ కౌంటర్ ఇచ్చాడు. అవినాష్ కూడా అఖిల్ కు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు. అఖిలే నెంబర్ వన్ అనుకున్నప్పుడు నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా అంటూ షాక్ ఇచ్చాడు.

నాగార్జున పెట్టిన చిచ్చుకు ఫలితంగా..
ఇక అభిజిత్, హారికల మధ్య నాగార్జున పెట్టిన చిచ్చుకు ఫలితం దక్కినట్లు తెలుస్తోంది. గత వారం అభిని కావాలని సేవ్ చేసి మోనాల్ ని వెన్నుపోటు పొడిచిన హారిక అభి టాస్క్ ను రిజెక్ట్ చేసినప్పుడు కూడా సపోర్ట్ చేసింది. చాలా విషయాలలో అభిని వెనకేసుకొచ్చిన హారికకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందో ఏమో కాని.. అప్పుడు మనం టాస్క్ ను టాస్క్ లాగానే చూడాల్సింది అంటూ అతన్ని నామినేట్ చేసి షాక్ ఇచ్చింది. ఇక అభి అయితే నువ్ అర్థం చేసుకోకపోతే ఇక్కడ మరెవరూ నన్ను అర్థంచేసుకోలేరని ఫీల్ అయ్యాడు.

నన్ను బ్యాడ్ చేయాలని అనుకుంటున్నవా
ఇక మోనాల్, అఖిల్ ని నామినేట్ చేయడంతో వారి మధ్యలో ఎప్పటిలానే రొటీన్ మాటలు నడిచాయి. నేను నీ కోసం ఎంతో పోరాడితే నువ్ ధీమాక్ పెట్టి గేమ్ అడతావేమో అనిపిస్తది.. అంటూ సమాధానం ఇవ్వగా నేను గేమ్ ను హార్ట్ తో అడతాను అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో నన్ను బ్యాడ్ చేయాలని అనుకుంటున్నవా అంటూ అఖిల్ మ్యాటర్ కాంప్లిటెడ్ అని ఎప్పటిలానే కౌంటర్ ఇచ్చాడు.

మధ్యలో మాట్లాడకు..
ఇక అరియానా, హారిక మధ్యలో కూడా మాటల యుద్ధం గట్టిగానే నడిచింది. అరియానా నామినేట్ చేసిందో ఏమో గాని ఇంగ్లీష్ లో నువ్వు నా బాస్ కాదని ఇచ్చి పడేసింది. ఇక ఇంగ్లీష్ ఎక్కువవ్వడంతో తెలుగులో మాట్లాడండని చెప్పిన అవినాష్ పై కూడా అరిచేసింది మోనాల్. మధ్యలో మాట్లాడకు అంటూ వాయిస్ పెంచేసింది. ఎవరైనా ఇక్కడ మాట్లాడతారు అంటూ మళ్ళీ ఇంగ్లీష్ లోనే ఇచ్చేసింది. మరి ఈ గోడవలతో కంటెస్టెంట్స్ హౌజ్ లో ఎలా ముందుకు సాగుతారో చూడాలి.