Just In
Don't Miss!
- Sports
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్
- Finance
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
- News
సుప్రీం కోర్టు కమిటీ వద్దకు వెళ్లం.. కేంద్రంతోనే చర్చలు జరుపుతాం: రైతు సంఘాల స్పష్టీకరణ
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నీకు నా సంగతి తెల్వది తమ్మి.. అఖిల్‌కు సోహెల్ ఝలక్.. ఇజ్జత్ లేకుండా..
బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారుతూనే ఉంటుందని అందరికి తెలిసిన విషయం. అయితే గొడవలు రొటీన్ గా ఉంటే కూడా ఆడియేన్స్ కు బోర్ కొట్టేస్తోంది. అందుకే ఈ మధ్య కంటెస్టెంట్స్ డిఫరెంట్ గా గొడవలు పడుతున్నారని అనిపిస్తోంది. ఇక బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే అఖిల్, సోహెల్ అయితే మాటిమాటికి ఎదో ఒక రకంగా గిల్లుకుంటూనే ఉన్నారు. తప్పు నిదంటే నీది అంటూ ఎవరు ఊహించని విదంగా తిట్టుకుంటున్నారు. బుధవారం ఎపిసోడ్ లో కూడా ఎప్పటిలానే ఇద్దరి మధ్యన కొన్ని విబేధాలు బయటపడ్డాయి.

కథ వేరేలా ఉండేది..
అఖిల్, సోహెల్ ఇద్దరి మధ్యన మొదట్లో స్నేహం ఎలా ఉండేదో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెహబూబ్ ఉన్నప్పుడు ఈ ముగ్గురు చాలా బలంగా ఉండేవారు. ఏం చేసినా కూడా ముగ్గురు కలిసే చేసేవారు. టాస్క్ లలో కూడా ముగ్గురు కలిస్తే కథ వేరేలా ఉండేది. అయితే మెహబూబ్ వెళ్లిపోయిన తరువాత అఖిల్, సోహెల్ మధ్య గ్యాప్ చాలానే వచ్చింది.

మాటలతో గాయాలు
ప్రతి సారి అఖిల్ సోహెల్ మాటలతో ఎదో ఒక రకంగా గాయపరుచుకుంటూనే మొండిగా ప్రవర్తిస్తున్నారు. ఇక మళ్ళీ ఊహించని విధంగా ఎదో ఒక టైమ్ లో కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో బెడ్ మీద పడుకొని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూనే ఇన్ డైరెక్ట్ వార్నింగ్ లు కూడా ఇచ్చుకున్నారు.

సోహెల్ కొట్టాలని ఉందిరా నాకు
సోహెల్ కొట్టాలని ఉందిరా నాకు. ఫట్ట ఫట్టా.. కొట్టాలని ఉందిరా నాకు అంటూ అఖిల్ సుకుమారంగా ఇచ్చిన వార్నింగ్ కు సోహెల్ కూడా కౌంటర్ ఇచ్చాడు. నా సంగతి తెల్వద్ తమ్మి నీకు. ఎదో ఇక్కడ ఇలా ఉన్నా అంతే.. అనడంతో బిగ్ బాస్ ఇది విన్నారా అని అఖిల్ అరిచేశాడు. బిగ్ బాస్ నన్ను ఎదో అనుకుంటున్నాడు సార్ అని మళ్ళీ సోహెల్ కెమెరా వైపు చూస్తూ చెప్పాడు.

నాకు కూడా అలానే మండింది
ఇక అఖిల్ సహనం కోల్పోయి ఈ ఏతులకైతే అస్సలు తక్కువ లేదు అంటూ.. ప్రతిదీ కెమెరా వైపు చూస్తూ చెబుతూ ఉంటాడని చెప్పడంతో సోహెల్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. నువ్వు అలా చేస్తుంటావ్ నేను కాదు. చిన్న చిన్న ప్రేమలన్ని కెమెరా వైపు చూస్తూ చెప్తావ్ అని సోహెల్ అనగానే అఖిల్ గుర్రుగా చూసేశాడు. దీంతో కాలిందా నీకు.. నాకు కూడా అలానే మండింది అంటూ వివరణ ఇచ్చాడు సోహెల్.

పరువు తీసుకొంటూ..
అఖిల్ సోహెల్ కు ఇలాంటి గొడవలు కొత్తేమి కాదు. గతవారం నుంచే చిన్న చిన్న కారణాలతో గొడవలు పడుతూ పరువు తీసుకుంటున్నారు. బిగ్ బాస్ ఎండ్ అవ్వడానికి ఇంకా కొన్నిరోజుల సమయం మాత్రమే ఉంది. అయితే వీరి సిల్లి గొడవలతో ఇద్దరు మైనస్ అవుతున్నారని అనిపిస్తోంది. మిగతా వారికి ప్లస్ అయ్యే అంశమే. మరి ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.