For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఒక్కరోజులో మారిన ఓటింగ్.. డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు.. జనాలు మెచ్చిన కంటెస్టెంట్ ఔట్!

  |

  కంటెంట్ ఎలా ఉన్నా.. రికార్డుల మీద రికార్డులు కొట్టేంత ఆదరణను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్‌బాస్. కాన్సెప్టు ఎలాంటిదైనా ప్రేక్షకుల మద్దతు దొరికిన ఏ షో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దీనికి ఉదాహరణే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంటే అయినా తెలుగు ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందివ్వడంతో దేశంలో చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర మాత్రమే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది. ఇప్పుడు ఐదో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటికే ఎడుగురు ఎలిమినేట్ అయిపోయారు. ఎనిమిదో వారంలో మాత్రం ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్ల నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  అదిరిపోయే కంటెంట్... ఆసక్తికరంగా

  అదిరిపోయే కంటెంట్... ఆసక్తికరంగా

  బిగ్ బాస్‌కు మాత్రమే తెలుగు బుల్లితెరపై భారీ రేటింగ్ వస్తుంది. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఈ ఉత్సాహంతోనే షోను మరింత రంజుగా మార్చేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతూ మజాను పంచుతోంది.

  Bigg Boss Unseen: శృతి మించిన ప్రియాంక రొమాన్స్.. బయటే అతడితో పడుకుని.. వామ్మో మరీ దారుణం

  7 వారాల్లో ఆరుగురు లేడీస్.. ఒకతను

  7 వారాల్లో ఆరుగురు లేడీస్.. ఒకతను

  ఐదో సీజన్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మందిని ఉంచుతూ ప్రేక్షకులకే పవర్స్ ఇస్తున్నారు నిర్వహకులు. ఈ నేపథ్యంలో మొదటి వారం సరయు రాయ్ ఎలిమినేట్ అయింది. రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి, మూడో వారంలో లహరి షారి ఎలిమినేట్ అయిపోయింది. నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా బయటకు వెళ్లిపోయింది. ఆరో వారంలో శ్వేత వర్మ, ఏడో వారంలో ప్రియ ఎలిమినేట్ అయ్యారు. అంటే ఏడు ఎలిమినేషన్లలో ఆరుగురు ఆడవాళ్లు, ఒక మేల్ కంటెస్టెంట్ వెళ్లిపోయారు.

  ఎనిమిదో వారం ఆ ఆరుగురు ఎంటర్

  ఎనిమిదో వారం ఆ ఆరుగురు ఎంటర్

  బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యమైన ప్రక్రియల్లో నామినేషన్స్ ఒకటి. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఈ వారం గొడవలు పెద్దగా కనిపించలేదు. అయితే, అనూహ్యంగా కొంత మంది త్యాగాలు చేస్తూ నామినేషన్స్‌లోకి వచ్చారు. ఇలా ఎనిమిదో వారానికి గానూ లోబో, యాంకర్ రవి, సింగర్ శ్రీరామ చంద్ర, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్‌, మానస్‌లు నామినేట్ అయిపోయారు. వీరిలో ఎవరు బయటకు వెళ్తారన్న దానిపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

  Disha Patani: బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ.. అసలే తడిచిన అందాలు.. అలా పడుకోవడంతో!
  https://telugu.filmibeat.com/heroine/disha-patani-bikini-photo-gone-viral-in-social-media-104125.html

   ఎనిమిదో వారంలోనూ అతడే టాప్‌లో

  ఎనిమిదో వారంలోనూ అతడే టాప్‌లో

  ఎనిమిదో వారానికి సంబంధించి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇందులో టైటిల్ ఫేవరెట్ అయిన షణ్ముఖ్ జస్వంత్ ఊహించినట్లుగానే టాప్‌లో కొనసాగుతున్నాడు. బయట భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న అతడికి.. ఈ వారం కూడా కుప్పలు తెప్పలుగా ఓట్లు పడ్డాయట. తాజా సమాచారం ప్రకారం.. అతడికి దాదాపు 25 శాతం కంటే ఎక్కువ ఓట్లు పడినట్లు తెలిసింది. దీంతో షణ్ముఖ్ ఈ వారం కూడా సేఫ్ అయినట్లు లెక్క. దీనికితోడు అతడు కెప్టెన్‌గా కూడా గెలవడంతో వచ్చే వారం నామినేషన్స్‌లో కూడా ఉండడన్నది తెలిసిందే.

  ఒక్కరోజులో మారిన ఓటింగ్.. మారారు

  ఒక్కరోజులో మారిన ఓటింగ్.. మారారు

  ఎనిమిదో వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లు మంచి పేరున్న వాళ్లే అందుకే ఫాలోయింగ్, గేమ్ తదితర అంశాలను చూసుకుని ప్రేక్షకుల ఓట్లు వేసినట్లు అర్థం అవుతోంది. ఈ వారం ప్రారంభంలో షణ్ముఖ్ జస్వంత్ తర్వాతి స్థానంలో సింగర్ శ్రీరామ చంద్ర ఉన్నాడట. అయితే, లాక్‌డౌన్‌ టాస్క్, కెప్టెన్సీ టాస్కులో అతడు గొడవ పడిన విధానానికి తోడు మానస్ చక్కగా ఆడుతుండడంతో వీళ్లిద్దరి స్థానాలు తారుమారు అయ్యాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సన్నీతో శ్రీరామ్ గొడవ పడిన తర్వాత ఓటింగ్ తగ్గి అతడు మూడుకు, మానస్ రెండో స్థానానికి వెళ్లారట.

  టాప్ విప్పేసి షాకిచ్చిన అషు రెడ్డి: లోదుస్తులు కూడా లేకుండా ఫోజు.. వామ్మో మరీ ఇంత ఘోరమా!

  ఆమె కూడా సేఫ్.. వాళ్లిద్దరూ వల్లే ఇలా

  ఆమె కూడా సేఫ్.. వాళ్లిద్దరూ వల్లే ఇలా

  ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో షణ్ముఖ్ జస్వంత్, మానస్, శ్రీరామ చంద్రలు ఎక్కువ ఓట్లు సంపాదించుకుని సేఫ్ అయ్యారని తెలుస్తోంది. మిగిలిన వారిలో సిరి హన్మంత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయని అంటున్నారు. ఈ వారం షణ్ముఖ్‌ జస్వంత్‌కు ముద్దు పెట్టడం.. కెప్టెన్సీ టాస్కులో కత్తితో పట్టుకు రావడం వంటి వాటితో ఆమె బాగా హైలైట్ అయింది. దీనికితోడు సిరికి కూడా బయట బాగానే ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు జెస్సీ, షణ్ముఖ్ ఫ్యాన్స్‌ కూడా ఆమెకే ఓట్లు వేశారట. దీంతో ఆమె నాలుగో స్థానంలో ఉంది సేఫ్ అయినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

  వాళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉండడంతో

  వాళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉండడంతో

  ఎనిమిదో వారానికి సంబంధించి మిగిలిన ఇద్దరు అంటే యాంకర్ రవి, లోబో మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరూ జనాలు మెచ్చిన కంటెస్టెంట్లు. అంతేకాదు, బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. రవికి బుల్లితెర ప్రేక్షకుల మద్దతు ఉండగా.. లోబోకు మాస్ ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ మిగిలిన వాళ్ల కంటే వీళ్లకు చాలా తక్కువ ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. అధికారిక పోల్‌లో కూడా వీళ్లు బాగా వెనుకుబడి ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే ప్రైవేట్ పోల్స్‌లో సైతం వీళ్లే చివరి స్థానాల్లో ఉండడం గమనార్హం.

  Puneeth Rajkumar No More: గుండెపోటుతో పునీత్ కన్నుమూత.. బయటకొచ్చిన ఫొటో.. అప్పుడే అధికారిక ప్రకటన

  Recommended Video

  Sharukh ని Atlee కాపాడతాడా? | Pathan Movie కి 100 కోట్లు
  జనం మెచ్చిన కంటెస్టెంట్ బయటకు

  జనం మెచ్చిన కంటెస్టెంట్ బయటకు

  బిగ్ బాస్ అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల మద్దతు ఉన్న కంటెస్టెంట్లు ముందుగానే బయటకు వెళ్లిపోతూ ఉంటారు. ఇలా ఇప్పటికే చాలా సార్లు జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో వారంలో ఎంటర్‌టైనర్ లోబో బయటకు వెళ్లిపోతాడనే టాక్ వినిపిస్తోంది. ఆరంభంలో చక్కని కామెడీతో అలరించిన అతడు.. ఈ మధ్య వెకిలి చేష్టలు చేస్తూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. దీనికితోడు రవికి కూడా కొంచెం దూరం అయ్యాడు. దీంతో ఈ వారం అతడే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Recently Started 5th Season. Anchor Ravi and Lobo Entered into Danger Zone in 8th Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X