For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 Nominations: ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఆరుగురు.. టైటిల్ ఫేవరెట్‌ కూడా నామినేట్

  |

  తెలుగు బుల్లితెరపై పెట్టుకున్న హద్దులను చెరిపేస్తూ.. సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన షో బిగ్ బాస్. ఎంటర్‌టైన్‌మెంట్‌కు పరిమితులు ఉండవని నిరూపించిన ఈ షో.. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని సత్తా చాటింది. అదే సమయంలో భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను అందుకుని నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ సెట్ చేసింది. ఇక, ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్.. ఆదివారమే ఐదో సీజన్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మొదటి వారం నామినేషన్ ప్రక్రియ లీకైంది. ఈ వారం ఎవరెవరు ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారంటే!

  అంగరంగ వైభవంగా మొదలైన సీజన్

  అంగరంగ వైభవంగా మొదలైన సీజన్

  తెలుగులో బిగ్ బాస్ షోకు ఉన్న ప్రత్యేకతే వేరు. ప్రతి ఏడాది ప్రసారం అవుతోన్న ఈ రియాలిటీ షోకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. దీంతో ఇది నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు.

  అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్‌ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!

  బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి 19 మంది

  బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి 19 మంది

  తాజాగా మొదలైన ఐదో సీజన్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు ఉన్నారు.

   ఆ ఎపిసోడ్‌లోనే టాస్క్‌లు ఆడించారు

  ఆ ఎపిసోడ్‌లోనే టాస్క్‌లు ఆడించారు

  సాధారణంగా బిగ్ బాస్ ప్రీమియర్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను పరిచయం చేసి.. వాళ్ల ఆటపాటలు ప్రసారం చేస్తారు. ఆ తర్వాత ఆయా కంటెస్టెంట్లు మాట్లాడతారు. అనంతరం వాళ్లను హోస్టు హౌస్‌ లోపలికి పంపుతాడు. అయితే, ఐదో సీజన్‌లో మాత్రం ఆరంభ ఎపిసోడ్‌లోనే 19 మంది కంటెస్టెంట్లతో నాలుగు టాస్కులు ఆడించారు. తద్వారా షోపై అంచనాలను మరింతగా పెంచేశారు.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  సోమవారం షోలో ముఖ్యమైన ఘట్టం

  సోమవారం షోలో ముఖ్యమైన ఘట్టం

  బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అని చెప్పాలి. ఈ ప్రక్రియ జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఈ టాస్క్ సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య ప్రేమ, స్నేహం కూడా పుడుతుంది. అవే సగటు బిగ్ బాస్ ప్రేక్షకుడికి మజాను పంచుతాయి. ఈ ప్రక్రియ ప్రతి సోమవారం ఎపిసోడ్‌లో ఎంతో ఆసక్తికరంగా జరుగుతుంది.

  నామినేషన్ టాస్క్‌పై సర్వత్రా ఉత్కంఠ

  నామినేషన్ టాస్క్‌పై సర్వత్రా ఉత్కంఠ

  బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించి మొత్తం 19 మంది ప్రముఖులు హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఆదివారం హౌస్ ఎంతో సందడిగా కనిపించింది. అయితే, సోమవారం మాత్రం నామినేషన్స్ టాస్కుతో గేమ్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం వేచి చూస్తున్నారంతా.

  నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా రచ్చ: డార్క్ రూమ్‌లో ఒకరిపై ఒకరు.. పర్సనల్ ఫొటో వైరల్!

  మొదటి వారం ఆరుగురు నామినేషన్

  మొదటి వారం ఆరుగురు నామినేషన్

  సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియను చూపిస్తారు. అయితే, దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ నేపథ్యంలో ఈ టాస్కులో ఎవరు నామినేట్ అయ్యారన్న విషయం తాజాగా లీకైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మొదటి వారం యాంకర్ రవి, జస్వంత్, ఆర్జే కాజల్, హమీదా, మానస్, సరయులు నామినేట్ అయ్యారట.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  టైటిల్ ఫేవరెట్ కూడా ఉండడంతో రచ్చ

  టైటిల్ ఫేవరెట్ కూడా ఉండడంతో రచ్చ

  తాజాగా బయటకు వచ్చిన నామినేట్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా దిగిన యాంకర్ రవి పేరు కూడా ఉంది. దీంతో అతడి అభిమానులకు ఇది కచ్చితంగా షాకింగ్ న్యూస్ అవుతుంది. అయితే, బయట భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ కావడంతో ఏ రేంజ్‌లో అతడికి ఓట్లు పడతాయో అర్థం చేసుకోవచ్చు. అభిమానులు ఓట్లతో రచ్చ చేయడం గ్యారంటీ అని చెప్పాలి.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. 1st Week Hamida, Anchor Ravi, RJ Kajal, Sarayu And Maanas Gets Nominated
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X