Don't Miss!
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- News
Girl: సోషల్ మీడియా బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్లి ?, ఎంత అందంగా ఉంటే ఏం లాభం !
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Shrihan Remuneration: శ్రీహాన్ గెలిచింది 45 లక్షలు.. రెమ్యూనరేషన్ భారీగా.. ట్యాక్సులు పోను ఎంతంటే!
కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు బుల్లితెరపై ప్రేక్షకుల ఆదరణను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ క్రమంలోనే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇలా ఇప్పటికే పలు సీజన్లను విజయవంతంగా ముగించింది. ఇక, ఇప్పుడు ఆరో దానిని కూడా అలాగే కంప్లీట్ చేసుకున్నారు. ఇందులో ఆరంభం నుంచీ చక్కని ఆటతీరుతో ఆకట్టుకున్న శ్రీహాన్ సూట్‌కేస్ తీసుకుని రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు బిగ్ బాస్ షో ద్వారా సంపాదించిన ఆదాయం ఎంత అనే విషయాలు తెలుసుకుందాం పదండి!

గ్రాండ్‌గా జరిగిన ఫినాలే
దాదాపు మూడు నెలల పాటు ప్రేక్షకులను అలరించిన ఆరో సీజన్ ఆదివారంతో ముగిసింది. తారల తళుకుబెళుకుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని గెస్టులు స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, మాజీ కంటెస్టెంట్లు డ్యాన్సులతో మెప్పించారు. కింగ్ నాగార్జున హోస్ట్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్ బాగా అలరించింది.
బాత్రూంలో జాతి రత్నాలు చిట్టి హాట్ షో: అదొక్కటే చుట్టుకుని టెంప్ట్ చేస్తోందిగా!

చివర్లో ఉత్కంఠ రేపుతూ
గతంలో మాదిరిగానే బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన ఫినాలే ఎపిసోడ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ముందుగా రోహిత్ ఎలిమినేట్ అయి ఐదో స్థానంతో ప్రయాణాన్ని ముగించాడు. అతడి తర్వాత ఆది రెడ్డి, కీర్తి భట్‌లు నాలుగు, మూడు స్థానాల్లో మిగిలారు. దీంతో రేవంత్, శ్రీహాన్ టాప్ 2గా నిలిచారు. వీళ్లలో విజేతను నిర్ణయించే ప్రక్రియ రసవత్తరంగా సాగింది.

శ్రీహాన్ ఓకే.. రేవంత్ విన్
టాప్
2లో
నిలిచిన
రేవంత్,
శ్రీహాన్‌లకు
హోస్ట్
అక్కినేని
నాగార్జున
బిగ్
బాస్
హౌస్‌లోకి
గోల్డెన్
సూట్‌కేసుతో
వెళ్లి
ఆఫర్
ఇచ్చాడు.
ముందుగా
రూ.
20
లక్షలు
ఇస్తానన్న
ఆయన..
ఎన్నో
బేరాలు
ఆడిన
తర్వాత
దాన్ని
రూ.
40
లక్షలు
చేశాడు.
ఈ
అమౌంట్‌కు
శ్రీహాన్
టెంప్ట్
అయి
ఓకే
చెప్పేశాడు.
ఫలితంగా
అతడు
రన్నరప్‌తో
సరిపెట్టుకోగా..
రేవంత్
ఈ
సీజన్‌లో
విజేతగా
నిలిచాడు.
గ్లామర్ కంచె తెంచేసిన కాజల్: డెలివరీ తర్వాత తొలిసారి యమ హాట్‌గా!

శ్రీహాన్‌కు రెమ్యూనరేషన్
బయట మంచి గుర్తింపు ఉన్న శ్రీహాన్ చోటూకు షో నిర్వహకులు వారానికి 50 వేల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారని తాజాగా తెలిసింది. అంటే అతడు హౌస్‌లో పదిహేను వారాల పాటు కొనసాగాడు. దీని ద్వారా మొత్తం రూ. 7.50 లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడు. ఇదే ఈ సీజన్ మొత్తంలో రెండో అత్యధిక రెమ్యూనరేషన్ అని బుల్లితెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రైజ్‌మనీ కూడా భారీగా
శ్రీహాన్ చోటూ ఆరంభం నుంచే టైటిల్ ఫేవరెట్‌గా ఉన్నా.. రేవంత్ ఫాలోయింగ్ ముందు తేలిపోయాడు. ఇక, ఫినాలేలో అతడు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సిందే అని అంతా భావించారు. అలాగే శ్రీహాన్ ఫినాలేలో రూ. 40 లక్షల ప్రైజ్ మనీకి ఓకే చెప్పి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అలాగే, లెన్స్‌కార్ట్ కాంటెస్ట్‌లో రూ. 5 లక్షలు గెలిచాడు. ఇలా మొత్తంగా రూ. 45 లక్షలు సంపాదించాడు.
అఖండ హీరోయిన్ హాట్ సెల్ఫీ: ఓర్నాయనో ఆ డ్రెస్సేంటి బాబోయ్!

అన్నీ కలిపి ఎంతంటే
ఆద్యంతం చక్కగా ఆడుతూ ఆరో సీజన్ రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్.. కొన్ని కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అదే సమయంలో ఈ రియాలిటీ షో ద్వారా చాలా మొత్తాన్నే తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రైజ్ మనీ ద్వారా రూ. 45 లక్షలు గెలిచిన శ్రీహాన్.. రెమ్యూనరేషన్‌గా రూ. 7.50 లక్షలు అందుకున్నాడు. అంటే మొత్తంగా రూ. 52.50 లక్షలు సంపాదించాడు.

ట్యాక్స్ కట్.. చివరికిలా
ఆదాయపు పన్ను లెక్కల ప్రకారం.. ఏదైనా షోలో 10 వేల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ గెలిస్తే 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. రూ. 45 లక్షలు ప్రైజ్ మనీగా అందుకున్న శ్రీహాన్.. రూ. 14.04 లక్షలు ట్యాక్స్ చెల్లించాలి. ఇంత మొత్తం పోతే అతడి చేతికి రూ. 30.96 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలిసింది. అలాగే, రెమ్యూనరేషన్‌లోనూ కటింగ్స్ ఉంటాయని టాక్.