Bigg Boss 9 Agnipariksha: ప్రియదెబ్బకు బలైన పవన్.. కల్కి ఒంటరి పోరాటం, హోరాహోరీగా అగ్నిపరీక్ష
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సామాన్యులను ఈసారి బిగ్‌బాస్‌లోకి పంపుతామని నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను జరుగుతున్న బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే 15 మంది కంటెస్టెంట్స్‌ను జడ్జిలు ఎంపిక చేసి వీరికి రకరకాల టాస్క్‌లు నిర్వహిస్తున్నారు. మరి వీరిలో హౌస్‌లో ఎవరు అడుగుపెడతారో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
రెండు జట్లకు టీమ్ లీడర్లు
బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై మరిన్ని అంచనాలను పెంచేందుకు గాను హోస్ట్ అక్కినేని నాగార్జునతో ఓ వీడియో విడుదల చేయించారు. టాప్ 15లో నిలిచిన కామన్‌మెన్లు అందరికీ నాగ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. టాప్ 15 మెంబర్స్‌కి బిగ్‌బాస్ ఎలా ఉంటుంది? అనే నెమ్మదిగా అలవాటు చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే వారికి మైకులు ఇవ్వగా.. నామినేషన్స్ ఎలా చేయాలో కూడా ప్రిపేర్ చేస్తున్నారు. గురువారం నాటి ఎపిసోడ్‌లో 15 మందిని రెండు జట్లుగా విభజించి పటు టాస్క్‌లు ఇచ్చి టీమ్ లీడర్‌ను సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చారు. ఆరో ఎపిసోడ్‌లో ప్రియ గెలవడంతో ఆమెను టీమ్ లీడర్‌గా కొనసాగించారు. మరో టీం లీడర్‌ను ఎంచుకునేందుకు కొత్త టాస్క్ ఇచ్చారు జడ్జిలు.
శ్రీముఖి ట్విస్ట్
దీని ప్రకారం కంటెస్టెంట్స్ కళ్లకు గంతలు కట్టి.. వారిని బాక్స్‌లో పెట్టి సరిగ్గా 2 నిమిషాలకు నిలబడాలని టాస్క్ ఇచ్చారు. అంతేకాదు.. ఫస్ట్ లేచినా, లాస్ట్ లేచినా వారు ఔట్ అవుతారని.. 9వ స్థానంలో లేచిన వారే లీడర్ అని కండీషన్స్ చెప్పింది శ్రీముఖి. తొలుత షాకిబ్ లేవగా.. చివరిలో లేచిన మనీష్ సైడ్ అయ్యారు. 9వ స్థానంలో ఎవరు లేచారో తేల్చడం సంచాలకులుగా వ్యవహరించిన ప్రియా, హరీష్‌ల మధ్య గొడవకు దారి తీసింది. చివరికి 9వ స్థానంలో దాల్య లేచిందని కన్ఫర్మ్ చేసి ఆమెకు మరో టీమ్ లీడర్ బాధ్యతలు అప్పగించారు. దాంతో రెడ్ టీమ్‌కి దాల్య, బ్లూ టీమ్‌కి ప్రియలు లీడర్లుగా ఛాన్స్ కొట్టేశారు.

ఫోటో బయటపడితే అంతే
ఈ తర్వాత అందరికీ కలిపి మరో టాస్క్ ఇచ్చిన జడ్జిలు.. 13 కుండలు తీసుకొచ్చి , ఒక్కొక్కరు ఒక్కో కుండను చేతితో పట్టుకోవాలని చెప్పింది శ్రీముఖి. కుండలను ఒకే ఒక్క ఫింగర్‌తో ఎంతసేపు వీలైతే అంతసేపు కుండను పట్టుకోవాలని చెప్పింది. కష్టంగా ఉన్నప్పుడు కుండను పగలగొడితే వాటిలో ఓ కంటెస్టెంట్ ఫోటో ఉంటుందని, ఏ కుండలో ఏ కంటెస్టెంట్ ఫోటో ఉంటుందన్నది ఎవరికీ తెలియదు. కుండ పగిలిపోయినప్పుడు ఆ కుండలో ఉన్న ఫోటో బయటపడుతుందని, అప్పుడు ఆ ఫోటో ఎవరిదైతే వారు ఔట్ అయినట్లు లెక్క అని కండీషన్ చెప్పింది శ్రీముఖి. ఈ టాస్క్‌కు మనీష్, షాకిబ్‌లు సంచాలకులుగా వ్యవహరించారు.
కల్కి ఒంటరిపోరాటం
గేమ్ ప్రారంభమయ్యాక చాలా వరకు అందరూ వేలితో కుండను పట్టుకోవాలని చాలా ప్రయత్నించారు. కానీ దానిని బ్యాలెన్స్ చేయలేక ఒక్కొక్కరిగా వదిలేశారు. చివరికి పవన్, కల్కిలు మిగిలారు. ప్రియ చెప్పిన మాటలు విన్న పవన్ కుండను వదిలేయగా.. అందులో ప్రియ ఫోటో ఉండటంతో ఆమె షాకైంది. చివరికి కల్కి ఒక్కడే మిగలగా.. అతను పట్టుకున్న కుండలో అతని ఫోటోనే ఉండటంతో దాల్య టీమ్ గెలిచింది. టీమ్‌ను గెలిపించిన కల్కికి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది దాల్య. మరి హౌస్‌లో అడుగుపెట్టడానికి ఈ 15 మందికి ఇంకెన్ని పరీక్షలు ఉంటాయి? ఫైనల్‌గా ఎవరు సెలెక్ట్ కానున్నారు? అన్నది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











