Bigg Boss 9 Agnipariksha: ఎందుకంత తుత్తర.. మండిపడ్డ నవదీప్, వాళ్లకి దెబ్బడినట్లేనంటూ శ్రీముఖి
బిగ్‌బాస్ తెలుగు 9లోకి ఈసారి కామన్‌మెన్ పంపేందుకు డోర్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అగ్నిపరీక్ష పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవి, బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్‌లు ఈ ప్రోగ్రామ్‌కు జడ్జిలుగా వ్యవహరిస్తుండగా.. మరో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ మొదలు కానుండటంతో కామన్‌మెన్‌గా ఎవరు సెలెక్ట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది.
నవదీప్ ఓవరాక్షన్
బిగ్‌బాస్‌లో ఛాన్స్ కోసం ఎన్ని దశలు దాటుకుని 15 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో ఇద్దరు లేదా ముగ్గురి వరకు హౌస్‌లో అడుగుపెట్టొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అగ్నిపరీక్ష పేరుతో కామనర్స్ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హోస్ట్ శ్రీముఖి, జడ్జి నవదీప్‌ల వ్యవహారశైలి వివాదాదాస్పదమవుతోంది. ఇటీవల దమ్ము శ్రీజను ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చేశావంటూ నవదీప్ వ్యాఖ్యానించడం దుమారం రేపగా.. దానికి ఆయన క్షమాపణలు చెప్పాడు. అలాగే మనీష్‌ని శ్రీముఖి ఫ్లవర్ అంటూ వెక్కిరించడం కూడా ఆడియన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నల్గొండ కేతమ్మకి బంపరాఫర్
తాజాగా సెప్టెంబర్ 5న అనుష్క శెట్టి నటించిన ఘాటి రిలీజ్ కానుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి.. అగ్నిపరీక్షలో సందడి చేశారు. ఈ సందర్భంగా నవదీప్ 15 మంది కంటెస్టెంట్స్‌కి ఓ డేర్ స్టెప్ ఇచ్చాడు. మీలో ఎవరైనా నా ముఖం మీద నీళ్లతో కొట్టాలని సవాల్ విసరగా.. ఎవ్వరూ స్పందించలేదు, అదే నేనైతే ఖచ్చితంగా నీళ్లు కొట్టేవాడినని క్రిష్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే యజమాని మీద నీళ్లు కొట్టలేమని నల్గొండ కేతమ్మ వ్యాఖ్యానించగా.. శివుడు దేవుడే కాదా, ఆయన మీద నీళ్లు పోసినట్లు పోయ్యండి అని క్రిష్ అన్నారు. ఆ వెంటనే తన కష్టాలను ఏకరువు పెడుతూ కేతమ్మ పాడిన పాట అందరినీ ఏడిపించింది. ఆ వెంటనే క్రిష్ మాట్లాడుతూ.. తనకు అవకాశం ఉంటే నా తదుపరి సినిమాలో మీతో పాట పాడిస్తానని ఆఫర్ ఇచ్చారు.
ఎన్నిసార్లు చెప్పాలి
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో రియల్, ఫేక్ ఏంటీ తేల్చే సమయం వచ్చిందని శ్రీముఖి చెప్పింది. ఇద్దరు వ్యక్తుల్ని బోర్డ్ పక్కన నిలబెట్టి వీరిద్దరిలో స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరు? అని ప్రశ్నించింది శ్రీముఖి. దాంతో కంటెస్టెంట్స్.. వాళ్లని ఐబ్రోస్‌లో ఎన్ని వెరియేషన్స్ ఉన్నాయి? స్కెచ్ వేశాక సంతకం ఎక్కడ పెడతారంటూ రకరకాలుగా టెస్ట్ చేశారు. ఆ వెంటనే నవదీప్ మాట్లాడుతూ.. గుడ్ అబ్జర్వేషన్ అని నువ్వు ఫీల్ అవుతున్నావ్, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఇన్నిసార్లు చెప్పినా తుత్తర వద్దని, ఎవ్వడూ వినే పొజిషన్‌లోనే లేడు.. నన్ను బిగ్‌బాస్‌లో చూడలేదా అని కౌంటర్ వేశాడు.
రెచ్చిపోయిన శ్రీముఖి
ఇద్దరు ఆర్టిస్టులలలో ఎవరు ఫేక్, ఎవరు ఒరిజినల్ అని తేల్చేపనిని శ్రీముఖి తీసుకుంది. దీని ప్రకారం.. కంటెస్టెంట్ దివ్య A అనే ఆర్టిస్ట్ రియల్ అని రాసిందని, సాకేత్ మాత్రం B ఫేక్ అని రాసిందని చెప్పింది. ఆ వెంటనే బిందు మాధవి మాట్లాడుతూ.. నాకెందుకో బీ రైట్ అయితే ఎంత బాగుండో అనిపిస్తోందని చెప్పింది. బీ రైట్ అయితే అందరికీ దెబ్బడినట్లేనని చివరిలో శ్రీముఖి పంచ్ విసిరింది. నేను వెళ్లి స్విచ్ ఆన్ చేయబోతున్నానని.. లైట్స్‌పై చేయి పెట్టింది. దాంతో కంటెస్టెంట్స్ అంతా ఉత్కంఠగా ఎదురుచూడటంతో ప్రోమో ముగిసింది.


Click it and Unblock the Notifications











