Bigg Boss 9 Agnipariksha: ఇదా నీ తెలివి.. కొట్టుకోబోయిన కంటెస్టెంట్స్, ప్రియ కోసం నాగ త్యాగం
బిగ్‌బాస్ తెలుగు 9లో భాగంగా అగ్నిపరీక్ష కార్యక్రమం రోజు రోజుకు ఉత్కంఠగా సాగుతోంది. హౌస్‌లో అడుగుపెట్టబోయే కామన్‌మెన్ ఎవరు కాబోతున్నారు? అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయిన 15 మందిలో తుది వరకు ఎవరు నిలుస్తారు? ఇంటికి ఎవరు వెళ్తారు? అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 8కి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
వెరైటీ టాస్క్‌లు
15 మంది కంటెస్టెంట్స్‌ను రెండు టీమ్‌లుగా విడదీయగా.. టాస్క్‌లలో ప్రియ, దాల్యలు చెరో టీమ్‌కి లీడర్ అయ్యే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత రెండు జట్లలో ఉన్న 15 మందిని ఒక్క చోటికి చేర్చి కుండలన్నీ పగులగొట్టే టాస్క్ ఇచ్చారు న్యాయ నిర్ణేతలు. కుండలను సింగిల్ ఫింగర్ మీద నిలబెట్టాల్సి ఉంది. ఆ కుండలు బద్ధలైతే దానిలో ఉన్న ఫోటో బయటికొస్తుందని అప్పుడు ఆ కుండలో ఉన్న ఫోటో గల వ్యక్తి రేసులో నుంచి తప్పుకున్నట్లు అని చెబుతుంది శ్రీముఖి.

ముగ్గురు లీడర్స్
ఇందులో చివరి వరకు కల్కి నిలిచి టీమ్‌ను గెలిపించడంతో టీమ్ లీడర్ దాల్య సంతోషించింది. వెంటనే అతనికి ఓటు కోసం అప్పీల్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటి వరకు కంటెస్టెంట్స్‌లో ఎవరు చురుగ్గా ఉన్నారు? ఎవరికి తెలివి ఉంది? హౌస్‌లోకి అడుగుపెడితే ఎవరు ఎలా ప్రవర్తిస్తారు? అనే దానిని బిగ్‌బాస్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఎపిసోడ్ 8 ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఫ్రూట్స్ బాక్స్‌లో నుంచి గ్రీన్ ఆపిల్స్‌ను చేతిలోకి తీసుకున్న నాగ, మనీష్, షాకిబ్‌లు ఈరోజు ఆడే టాస్క్‌లు టీమ్ లీడర్స్‌గా ఉంటారని శ్రీముఖి చెప్పింది. అనంతరం జడ్జిల నుంచి ముగ్గురు మూడు కార్డులను తీసుకోమని చెప్పింది. తొలుత నాగ .. అభిజిత్ దగ్గరి కార్డ్‌ని, మనీష్.. బిందు మాధవి కార్డ్, షాకీబ్.. నవదీప్ దగ్గర ఉన్న కార్డ్‌ని తీసుకున్నారు.
టాస్క్‌లో గెలిచిన నాగ టీమ్
వాటిపై ఉన్న నెంబర్స్‌ను బట్టి మీ మీ జట్లలో మెంబర్స్ ఉంటారని శ్రీముఖి తెలిపింది. దీని బట్టి నాగ టీమ్‌లో నలుగురు, మనీష్ టీమ్‌లో ఆరుగురు, షాకిబ్ టీమ్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చారు. అలాగే కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేసుకునే పవర్ కూడా లీడర్స్‌కు ఇచ్చారు న్యాయనిర్ణేతలు. దాంతో కళ్యాణి, దివ్యలను షాకిబ్ తీసుకోగా.. నాగ తన టీమ్‌లోకి ప్రియ, హరీష్, శ్రీజ, అనూషలను తీసుకున్నాడు.. మిగిలిన వారంతా మనీష్ టీమ్‌లోకి వచ్చారు. తర్వాత మూడు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున స్టేజ్ మీదకి పిలిచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వీటికి ముందుగా గంట మోగించిన వారు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇందులో మనీష్ టీమ్ ఓడిపోగా.. నాగ టీమ్ గెలిచింది. దగ్గరుండి జట్టును గెలిపిచిన నాగ.. తనకొచ్చిన ఓట్ అప్పీల్ ఛాన్స్‌ని ప్రియకు ఇచ్చాడు.
వరస్ట్ ప్లేయర్ ఎవరంటే?
ఎపిసోడ్ 8లో వరస్ట్ ప్లేయర్‌గా మనీష్‌కు ఎల్లో కార్డ్.. మోస్ట్ వాల్యుబల్ ప్లేయర్‌గా నాగను సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో ప్రియకు త్యాగం చేసినప్పటికీ నాగకు మరోసారి ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. మొత్తం మీద బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాలని కంటెస్టెంట్స్ అంతా హోరాహోరీగా పోరాడుతున్నారు. ఒక్కరు కూడా తమకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్.. సెప్టెంబర్ 7న ప్రారంభం కానుండటంతో అగ్నిపరీక్షలో ఎవరు మిగులుతారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











