Bigg Boss 9 Agnipariksha Finale: బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫైనల్.. దివ్యకి ఛాన్స్ ఇవ్వని హరీష్, కళ్యాణ్ సవాల్
బిగ్‌బాస్ తెలుగు 9లో కామన్‌మెన్స్‌ని తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమం తుది అంకానికి చేరుకుంది. వివిధ వడపోతల అనంతరం 40 మందిని ఎంపిక చేయగా.. వారిలో 15 మందిని టాప్ 15 పేరుతో సెలెక్ట్ చేశారు బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన అభిజిత్, నవదీప్, బిందు మాధవి. సెప్టెంబర్ 7 నుంచి బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం కానుండగా.. శుక్రవారంతో బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో అగ్నిపరీక్ష ఫినాలే కార్యక్రమం మొదలైంది.
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫైనల్
బిగ్‌బాస్ అగ్నిపరీక్షను చూస్తున్న వారిలో నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగుతుండగా.. 15 మందిలో ఎవరు విజేతలుగా నిలుస్తారోనని ప్రేక్షకులు కూడా టెన్షన్ పడుతున్నారు. మనకే ఇలా ఉంటే ఆడుతున్న కామన్‌మెన్ పరిస్ధితి ఏంటో చెప్పనక్కర్లేదు. తాజాగా బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 15 ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వహకులు. ఫైనల్ ఎపిసోడ్ కావడంతో కంటెస్టెంట్స్ అంతా కలర్‌ఫుల్‌గా రెడీ అయ్యారు. కంటెస్టెంట్స్‌తో కలిసి జడ్జిలు నవదీప్, బిందు మాధవి, అభిజిత్ డ్యాన్స్‌లు వేశారు. నవదీప్ కొంచెం ఎమోషనల్ అయ్యారని శ్రీముఖి చెప్పింది.

ఇద్దరు ఔట్
ఫినాలేలో టాప్ 15 నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్‌ని ఇప్పటికే న్యాయ నిర్ణేతలు ఎలిమినేట్ చేశారు. యూకే నుంచి బిగ్‌బాస్ షోలో పాల్గొనాలని వచ్చిన శ్వేతశెట్టి గతంలోనే ఎల్లో కార్డ్ తెచ్చుకోగా.. తాజా ఎపిసోడ్‌లో మరోసారి ఎల్లో కార్డ్ రావడంతో ఆమెకు రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేశారు. అగ్నిపరీక్ష స్టేజ్‌ను వీడుతూ శ్వేత ఎమోషనల్ అయ్యింది. బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొనాలని ది బెస్ట్ ఇచ్చానని, ఎంతో కష్టపడ్డానని .. కానీ టైం కలిసి రాకపోవడంతో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని .. హౌస్‌లోకి తన తల్లిని తీసుకెళ్లాలనే కల నెరవేరలేదని బాధపడింది. దాంతో శ్రీముఖి ఆమెను ఓదార్చి.. నీ జర్నీ ఇంకా ఉందని బుజ్జగించింది.
అమ్మ కల తీర్చలేకపోయా
శ్వేత ఎలిమినేషన్‌తోనే అగ్నిపరీక్ష స్టేజ్ మొత్తం ఎమోషనల్ అయ్యారు. తన మైండ్ గేమ్, దూకుడైన ప్రవర్తనతో మర్యాద మనీష్ గతంలో తనకి జడ్జిలు ఇచ్చిన ఎల్లో కార్డ్‌ను విత్ డ్రా చేసుకునేలా దుమ్ములేపాడు. అయితే ఈ కార్డ్‌ను తీసుకునే సమయంలో.. కార్డ్ మా దగ్గర ఉండదని, మరో కంటెస్టెంట్‌ని చేరాల్సిందేనని నవదీప్ చెప్పాడు. గతంలో ఓసారి ఎల్లో కార్డ్ వచ్చిన వ్యక్తికే మళ్లీ ఈ కార్డ్ వెళ్తుందని.. దాంతో రెండు డబుల్ ఎల్లో కార్డ్స్ వచ్చిన వారికి రెడ్ కార్డ్ వస్తుందన్న రూల్ ప్రకారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడని అన్నాడు. దాంతో ఎవరికి ఎల్లో కార్డ్ వస్తుందోనని అంతా ఊపిరి బిగబెట్టి చూస్తుండగా కండల వీరుడు ప్రసన్నకి ఎల్లో కార్డ్ వెళ్లింది.
నువ్వు రియల్ లైఫ్‌లో గెలిచావ్
ప్రసన్న అద్భుతంగా ఆడాడని, ఖచ్చితంగా హౌస్‌లో ఉంటాడని అనుకున్నామని.. కానీ ఎలిమినేట్ అవుతున్నాడని చెబుతూ నవదీప్ ఎమోషనల్ అయ్యాడు. అటు ప్రసన్న వెళ్తూ వెళ్తూ గుండెల్ని కదిలించాడు.. నేను నోరు విప్పకపోవడం వల్లే ఇలా జరిగిందని, అయినప్పటికీ ఇక్కడి వరకు రావడం, లక్షలాది మందికి నా కథను వినిపించడం సంతోషంగా ఉందని ప్రసన్న అన్నాడు. అతని మాటలు విన్న జడ్జి అభిజిత్ సైతం.. నేను రియాలిటీ షో గెలిచినా, నువ్వు మాత్రం రియల్ లైఫ్‌లో గెలిచావంటూ హగ్ చేసుకున్నాడు. ప్రస్తన్న, శ్వేతలు ఎలిమినేషన్ కావడంతో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష టాప్-15లో ఇంకెంత మంది మిగులుతారోనని ఉత్కంఠ నెలకొంది.
టాస్క్‌ల్లో హరీష్, కళ్యాణ్ హోరాహోరీ
ఎపిసోడ్ 15కి సంబంధించి తాజాగా ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీముఖి ఓ బాక్స్ ఓపెన్ చేసి ఏ కలర్ మీరు ఎంపిక చేసుకున్నారని అడిగింది. తొలుత హరీష్ గ్రీన్ కలర్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పగా.. దివ్య పింక్ కలర్‌ను సెలెక్ట్ చేసుకుంది. రెండు గొట్టాలు ఏర్పాటు చేసి ఎవరి బాల్స్ అయితే పైప్ మొత్తం ఫుల్‌గా నిండిపోతాయో వారు ఈ టాస్క్‌లో గెలిచినట్లు అని చెబుతుంది శ్రీముఖి. గేమ్ మొదలయ్యాక.. హరీష్, దివ్యలు హోరాహోరీగా ఆడారు.
ఈ గేమ్‌లో హరీష్ గెలుపొందగా.. దివ్య చప్పట్లు కొడుతూ తప్పుకుంది. ఆ తర్వాత కళ్యాణ్, హరీష్‌లతో ఓ వాటర్ బాటిల్‌ను పైకి విసిరి.. అది స్టడీగా నేలకు తాకేలా చేయాలనే టాస్క్ ఇస్తుంది శ్రీముఖి. ఇందులో కళ్యాణ్ అద్భుతంగా ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. జడ్జి బిందు మాధవి అయితే వావ్ అంటూ సర్‌ప్రైజ్ అయ్యింది. మరి లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఎవరు విన్ అయ్యారు? ఎవరు ఔట్ అయ్యారు? చివరిగా ఎంతమంది మిగిలారు? అన్నది మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











