Bigg Boss 9 Agnipariksha: టాప్ 15 ఎంపిక పూర్తి.. లిస్ట్‌లో ఎవరంటే? అసలు సిసలు పరీక్షకు రెడీయా
బిగ్‌బాస్ తెలుగు 9 మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి హౌస్‌లో మామూలుగా ఉండదని, అందరి సరదా తీర్చేస్తానని అక్కినేని నాగార్జున ముందే చెప్పారు. దీనికి తగినట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌లో ఈసారి సామాన్యులకు కూడా గేట్లు తెరిచారు.. పలువురు సామాన్యులను ఇంట్లోకి పిలుస్తానని చెప్పిన బిగ్‌బాస్.. ఈ కామన్‌మెన్ల ఎంపిక కోసం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 4 ఎపిసోడ్స్ పూర్తికాగా.. తాజాగా 5వ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఉత్కంఠగా బిగ్‌బాస్ అగ్నిపరీక్ష
సామాన్యులను కంటెస్టెంట్‌గా ఎంపిక చేసే బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్‌లు వ్యవహరిస్తున్నారు. వేలల్లో వచ్చిన అప్లికేషన్స్ నుంచి పలు ప్రక్రియలు, వడపోతల ద్వారా 40 మందిని ఎంపిక చేసిన బిగ్‌బాస్ నిర్వాహకులు.. వీరిలో 15 మంది మందిని ఫైనల్ రౌండ్‌కు పంపి, వారిలో నుంచి కొందరిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపనున్నారు. వీరిని సెలెక్ట్ చేసే బాధ్యతను న్యాయ నిర్ణేతలకు అప్పగించాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా పలు టాస్క్‌లు, పరీక్షలు పెడుతున్నారు.

టాస్క్‌లపై అభ్యంతరాలు
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఇప్పటి వరకు విజయవాడకు చెందిన దివ్య.. హైదరాబాద్‌కు చెందిన ప్రసన్న.. తణుకు చెందిన పవన్.. నెల్లూరుకు చెందిన శ్రేయ.. వరంగల్‌కు చెందిన అనూష, హైదరాబాద్‌కు చెందిన శ్వేతలు సెలెక్ట్ అయ్యారు. మరికొందరు హోల్డ్‌లో ఉండగా వీరిలో ఎవరు సెలక్ట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. మొత్తం 15 మందిలో నుంచి కామన్‌మెన్‌గా ఎవరు హౌస్‌లో అడుగు పెడతారనేది ఉత్కంఠగా మారింది. సెప్టెంబర్ 5 వరకు ఈ 15 మందికి సంబంధించిన ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యుంటాయని, ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా వీరిని ఎంపిక చేయవచ్చని బిగ్‌బాస్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ సెలెక్షన్ ప్రాసెస్ సరిగా లేదని.. సెలబ్రెటీలను నేరుగా హౌస్‌లోకి పంపుతూ, సామాన్యులకు పిచ్చి పిచ్చి టాస్క్‌లిస్తూ వారిని అవమానిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
ఫోన్లు బద్ధలు కొడితేనే
తాజాగా బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 5కి సంబంధించి 3వ ప్రోమోను విడుదల చేశారు. ముందుగా హోస్ట్ శ్రీముఖి.. మీకు ఇది చివరి అవకాశమని, ఏడుగురి సెల్‌ఫోన్లను ప్రవేశపెట్టండి అని చెబుతుంది. అవి కేవలం ఫోన్ మాత్రమే కాదు, వారికి సంబంధించిన ఒక మెమొరీ అయ్యుండొచ్చని చెప్పింది. లాస్ట్ ఫైనల్ డేర్.. టాప్ 15లో వాళ్లు, వాళ్ల స్థానాన్ని ఓకే చేసుకోబోయే డేర్. మీ మీ ఫోన్లను ఇక్కడున్న సుత్తితో పగులగొట్టాలని శ్రీముఖి టాస్క్ ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. వాళ్లు షాక్ నుంచి తేరుకునేలోగానే.. జడ్జి నవ్‌దీప్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశాడు.
టాప్ 15 కంటెస్టెంట్స్ వీరే
వారిలో షాకీబ్, నికితా మాత్రమే వాళ్ల ఫోన్లను పగొలగొట్టి డేర్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. మొత్తంగా వివిధ రకాల టాస్క్‌లు పెట్టి టాప్ 15లోకి మర్యాద మనీష్, దాలియా, నాగ ప్రశాంత్, షాకీబ్‌లను ఎట్టకేలకు 15 మందిని విజయవంతంగా పూర్తి చేశారు జడ్జిలు. ఈ 15 మంది జాబితా చూస్తే.. దివ్య నిఖిత, శ్రియ, శ్వేత శెట్టి, డెమాన్ పవన్, ప్రసన్నకుమార్, అనూష రత్నం, దమ్ము శ్రీజ, కల్కి, దాలియా, ప్రియా, మర్యాద మనిష్, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, ప్రశాంత్, షాకీబ్‌లు స్థానం సంపాదించారు.
అసలు సిసలు పరీక్ష మొదలు
ఆ తర్వాత విడుదలైన ఎపిసోడ్ 6 తొలి ప్రోమోలో టాప్ 15కి అసలైన అగ్నిపరీక్ష ఉంటుందని రివీల్ చేశారు. దీనికి ప్రిపేర్ అయ్యుండాలో అనేది ప్రిపేర్ చేస్తామని జడ్జ్ నవదీప్ అన్నారు. ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు మైక్స్‌ని ధరించడానికి సిద్ధంగా ఉన్నారా అని శ్రీముఖి టాప్ 15కి మైక్ ఉన్న బ్యాగ్‌లు అందజేసింది. ఆ తర్వాత మీ బలాల ఆధారంగా మీ స్థానాలను మీరు ఎంచుకోవాల్సి ఉంటుందని ఓ 15 బోర్డులు పెట్టారు. ఆ వెంటనే నవదీప్ స్టార్ట్ అనగానే 15 మంది నెంబర్స్ ఉన్న స్థానాల దగ్గర నిలబడ్డారు. ఈ ప్రాసెస్‌లో ఒకరినొకరు నెట్టుకున్నారు.
బిందు మాధవి సెటైర్లు
7వ నెంబర్ దగ్గర ఎందుకు నిలబడ్డావని ప్రశాంత్‌ని శ్రీముఖి అడిగింది. ఎక్కడ నిల్చొన్నా నాకు నెంబర్ 7 కనిపిస్తుంది, అదే కొడతానని ఆన్సర్ ఇచ్చాడు ప్రశాంత్. దాంతో 15లో నిలబడొచ్చు కదా ఇంకా దూరంగా ఉంటుందని బిందు మాధవి సెటైర్లు వేసింది. ఆ తర్వాత ఆ 15 మందిని వారు నిలబడ్డ స్థానాలకు అర్హులో కాదో నిర్ణయించే బాధ్యతను కంటెస్టెంట్స్‌కే అప్పగించడంతో వారి మధ్య గొడవ జరిగింది. మరి కంటెస్టెంట్స్ మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి? జడ్జిలు ఎలాంటి టాస్క్‌లు ఇచ్చారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











