Bigg Boss 9: డిమోన్ పవన్ కి బిగ్ షాక్.. హౌజ్ నుంచి గెంటేసిన నాగార్జున.. రీతూ మాత్రం..
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ అంటేనే ఆడియన్స్‌లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యంగా నాగార్జున హోస్ట్‌గా వచ్చే ఎపిసోడ్‌ల్లో ఎప్పటిలాగే క్లాస్ అండ్ ఎమోషన్ మేళవింపుతో హౌస్ మేట్స్‌కి లెజెండరీ లెవెల్ క్లాసులు ఇస్తుంటారు. కానీ, ఈ వారం మాత్రం నాగార్జున ఫుల్ ఫైర్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఎవరూ ఊహించని రీతూ-డెమోన్ గొడవ, తనూజ-కళ్యాణ్ తగాదా, సంజన-మాధురి ఫుడ్ ఇష్యూస్ అన్నీ కలిపి ఈ ఎపిసోడ్ మొత్తాన్నీ ఫుల్ ఫైర్ షోగా మార్చేశాయి.
సంజన-మాధురిలకు నాగార్జున క్లాస్
ఫుడ్ విషయంలో ఈ వారం హౌస్‌లో గట్టి టెన్షన్ నెలకొంది. రేషన్ మేనేజర్‌గా ఉన్న తనూజ సీరియస్‌గా హౌస్ డిసిప్లిన్ మెంటైన్ చేయడానికి ప్రయత్నిస్తే.. సంజన,మాధురి ఇద్దరూ రివర్స్ ఫైర్ అయ్యారు. సంజన ఫుడ్ వదిలేయడం, మాధురి నిరాహార దీక్ష అనే డ్రామాలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాల నాగార్జున ఫైర్ అయ్యారు. ముఖ్యంగా సంజనాను టార్గెట్ చేస్తూ.. "నామినేషన్ టైమ్‌కి ఎందుకు అలా బిహేవ్ చేస్తావ్ సంజనా? ఎవరు అడిగినా సెన్స్ లెస్, బ్రెయిన్ లెస్ అంటావ్. ఇది గేమ్ షో, మీ పర్సనల్ ఫైట్ కాదు" అంటూ నాగ్ గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాత మాధురిని చూపించి "గురివింద గింజలా బిహేవ్ చేయకు!" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కళ్యాణ్-తనూజ డ్రామా
అలాగే.. తనూజ, కళ్యాణ్ మధ్య గొడవ ఈ వారం ఎక్కువగా హైలైట్ అయింది. రేషన్ మేనేజర్ అయిన తనూజ ఇచ్చిన ఆర్డర్‌ను కళ్యాణ్ పట్టించుకోకపోవడం, "ఆక్ పాక్ కరేపాక్" అన్నట్టుగా జవాబులు ఇవ్వడం నాగార్జునకు ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. "కెప్టెన్ ఆర్డర్ అంటే ఫాలో అవ్వాలి, ఫన్ కాదు" అంటూ కళ్యాణ్‌కి ఓ రేంజ్ క్లాస్ పీకారు. దివ్య కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకోవడంతో నాగ్ ప్రశ్నించారు. "హౌస్ మేట్స్ అందరికీ ఆర్డర్స్ ఇచ్చే హక్కు ఉందా?" అని. దీంతో దివ్య 'నో' అని చెప్పింది. నాగార్జున వీడియో చూపించి "అయితే ఆర్డర్స్ జారీ చేసిన తనూజపై నీ రియాక్షన్ ఏమిటి?" అని ప్రశ్నించడంతో, దివ్య సమాధానంతో నాగార్జున ఆశ్చర్యపోయారు.
డెమోన్ పవన్‌కు రెడ్ కార్డు షాక్!
ప్రోమోలోనే హైలైట్ సీన్ డిమోన్ పవన్ రీతూని కెప్టెన్ బెడ్‌పైకి తోసేసే సీన్. ఈ వీడియో ప్లే చేశారు. ఈ వీడియో చూసిన తరువాత నాగార్జున కళ్లలో కోపం స్పష్టంగా కనిపించింది. "ఒక అమ్మాయిని ఇలా తోసేయడం సరైనదేనా?" అని పవన్ ను నాగార్జున నిలదీశారు. "మీ ఇంట్లో ఆడపిల్లలపై ఇలాంటిదే జరిగితే ఏమి చేస్తారు? బెల్ట్‌తో కొడతారా లేదా?" అని ఆడియన్స్‌ని అడిగారు. ఆ షోలో ఉన్న ఆడియన్స్ కూడా ఆ విషయాన్ని తప్పుబట్టారు. అది "తప్పే!" అని స్పందించడంతో కింగ్ నాగ్ కోపం తారాస్థాయికి చేరింది.
వెంటనే పవన్ 'సారీ'అని చెప్పాడు. దీంతో నాగ్ కోపం మరింత పెరిగింది. 'సారీ చెప్పడం సరిపోదు.. ఇది బిగ్ బాస్ హౌస్. ఇలాంటి ప్రవర్తనను మేము సహించం. ప్యాక్ యువర్ బ్యాగ్స్!" అని గట్టిగా అరిచారు కింగ్ నాగార్జున. వెంటనే " బిగ్ బాస్, ఓపెన్ దీ డోర్స్!" అని చెప్పడంతో మొత్తం హౌస్ సైలెంట్ అయ్యింది. రీతూ చౌదరి ఏడుస్తూ "సార్, ప్లీజ్ వద్దు సార్!" అని బతిమాలినా, నాగార్జున తన నిర్ణయంలో వెనక్కి తగ్గలేదు. ఈ సీన్ చూస్తే.. పవన్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? లేక ప్రోమో కట్ మాత్రమేనా? అనేది ఆ రాత్రి ఎపిసోడ్‌లోనే తెలుస్తుంది.
ఈ వారం బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ పూర్తిగా నాగార్జున షోగా మారిపోయింది. ఒక వైపు ఫైర్, మరో వైపు ఎమోషన్. పవన్-రీతూ ట్రాక్ బిగ్ ట్విస్ట్ తెస్తుందా లేక నాటకీయ మలుపేనా అన్నది నైట్ షోలోనే తెలుస్తుంది. ఏదేమైనా, ఈ వీకెండ్ బిగ్ బాస్ హౌస్‌లో "రెడ్ కార్డ్ డ్రామా" హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











