Bigg Boss 9 Week 2nd Elimination: డేంజర్ జోన్‌లో 5 గురు కంటెస్టెంట్లు.. ఈ వారం షాకింగ్‌గా బిగ్‌బాస్ ఎలిమినేషన్
అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ రియాలిటీ షో రసవత్తరంగా సాగుతున్నది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల ఆటతీరుతో రకరకాల భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. రెండో వారంలో ఈ షోలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. దాంతో ఈ గేమ్‌పై ఆడియెన్స్‌కు ఆసక్తి పెరిగేలా చేస్తున్నది. అయితే తొలివారం ఎలిమినేషన్ ముగిసిన తర్వాత రెండో వారంలో నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే నామినేషన్ ప్రక్రియ ముగియగానే ఈ భారీగా ఓటింగ్ నమోదు అవుతున్నది. తాజా ఓటింగ్ వివరాలు, అలాగే ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉన్నారనే విషయాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు షో రెండో వారంలోకి ఘనంగా అడుగుపెట్టింది. తొలివారం శ్రష్టి వర్మ అనూహ్యంగా ఎలిమినేట్ కావడం ఆడియెన్స్‌కు షాకిచ్చింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భావించిన ఆమె ఇంటి నుంచి వెళ్లడంతో ఈ గేమ్‌లో ఇంపాక్ట్ మారిపోయింది. ఇతర కంటెస్టెంట్లు జాగ్రత్త పడి కంటెంట్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేసుకొన్నట్టు కనిపించారు. ఇక నామినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగించి రక్తి కట్టించడం కనిపించింది.

ఇక రెండో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించిన విషయంలో ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు ఘాటుగా కామెంట్స్ చేసుకొన్నారు. ఎక్కువ మంది హరిత హరీష్‌ను టార్గెట్ చేసి 7కు పైగా నామినేషన్లు వేశారు. దాంతో ఈ సారి అందరి చూపంతా ఆయనపై పడింది. ఇక ఇంటిలో భరణి, ఇమ్మాన్యుయేల్, సంజన, తనూజ గౌడ లాంటి కంటెస్టెంట్లు కూడా తమ వాదనలను భారీగా వినిపించారు.
బిగ్‌బాస్ తెలుగు షో నుంచి నామినేట్ అయిన వారి జాబితా ఇలా ఉంది. మొత్తం 7 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. నామినేషన్‌లో నిలిచిన వారిలో హరిత హరీష్, భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్ నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కెప్టెన్ సంజనకు స్పెషల్ పవర్ ఇచ్చి ఒకరిని నామినేట్ చేయమని అడిగితే.. సుమన్ శెట్టిని డైరెక్టుగా నామినేట్ చేశారు. దాంతో టాప్ కంటెస్టెంట్లు అంతా ఈ వారం నామినేషన్‌లోకి రావడంతో మరింత రంజుగా మారింది.
ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో కమెడియన్ సుమన్ శెట్టి జోరును కొనసాగిస్తున్నాడు. ఆయన అందరికంటే ఎక్కువగా ఓటింగ్ సాధిస్తున్నాడు. కడపటి వార్తలు అందేసరికి సుమన్ శెట్టికి పోలైన ఓట్లలో 45 శాతం ఓట్లను ఆయన దక్కించుకొన్నాడు. ఇక ఆయన తర్వాత టెలివిజన్ యాక్టర్ భరణి శంకర్ రెండోస్థానంలో ఎక్కువ ఓట్లు సొంతం చేసుకొన్నాడు. ఆయనకు 30 శాతం ఓట్లు లభించాయి. ఆ తర్వాత మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు కూడా చాలా తక్కువ ఓట్లను రాబట్టుకోవడంతో అందరూ డేంజర్ జోన్లలోనే ఉన్నారు.
నామినేషన్‌లో ఉన్న హరిత హరీష్, డీమాన్ పవన్, ఫ్లోరా షైనీ, ప్రియా, మనీష్ ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. హరీష్ 8 శాతం ఓట్లు, పవన్ 7 శాతం, ఫ్లోరా షైనీ 6 శాతం, ప్రియా శెట్టి 6 శాతం, మనీష్ 6 శాతం ఓట్లతో పోటాపోటీగా కింద స్థానంలో పోరాట చేస్తున్నారు. దాంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పడం చాలా ఛాలెంజింగ్‌గా మారిందనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











