Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌బాస్‌లో తారుమారైన ఓటింగ్.. రీతూ చౌదరీ, హరీష్, శ్రీజలో ఎవరు అవుట్ అంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో తన గేమ్ స్వభావానికి అనుకూలంగా ముందుకు కొనసాగుతున్నది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, విభేదాలు, లవ్ ట్రాక్ జోరుగా కొనసాగుతున్నాయి. అయితే రోజులు గడిచిన కొద్ది ఇంటిలో అండర్ డాగ్‌గా ఉన్న కంటెస్టెంట్లు జోరును కనిపిస్తుండగా.. టాప్ సెలబ్రిటీలు తమ స్థాయికి తగినట్టు ఆడకపోవడాన్ని ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య 4వ వారం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ వారం ఇంటిలో ఉండటానికి అర్హత లేని కంటెస్టెంట్ ఎవరు? ఎవరు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో గత మూడు వారాల ఎలిమినేషన్ ప్రక్రియలను పరిశీలిస్తే.. ముగ్గురు కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇద్దరు కామన్ మ్యాన్స్, ఒక సెలబ్రిటీ ఎలిమినేట్ అయ్యారు. తొలివారం టాప్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియకు తెరలేపారు.

బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 4వ వారం నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగింది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు వాగ్భాణాలు సంధించుకొన్నారు. ఇంటిలో జరిగిన సంఘటనల ఆధారంగా తమ నామినేషన్‌కు కారణాలు చెబుతూ కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొనేంతగా బిహేవ్ చేశారు. కంటెస్టెంట్ల నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్న వారి పేర్లను అధికారికంగా ప్రకటించారు.
బిగ్‌బాస్ తెలుగు 4వ వారంలో నామినేట్ అయిన వారిలో సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరీ సెలబ్రిటీ క్యాటగిరిలో ఉన్నారు. ఇక కామన్ మ్యాన్ క్యాటగిరిలో హరిత హరీష్, శ్రీజ, దివ్య నిఖిత నామినేషన్‌లోకి వచ్చారు. దాంతో ఈ వారం మొత్తం 6 గురు నామినేషన్స్‌లోకి వచ్చారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే జోరుగా ఓటింగ్ మొదలైంది.
బిగ్‌బాస్ తెలుగు నామినేషన్స్‌లో ఉన్న సంజన అత్యధికంగా ఓటింగ్ సంపాదించుకొన్నది. ఆమెకు సుమారుగా 30 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు 10 వేలకుపైగా ఓట్లు వచ్చాయి అని తెలిసింది. ఇక ఆమె తర్వాత సీనియర్ హీరోయిన్ ఫ్లోరా సైనీ 20 శాతం ఓట్లు సంపాదించుకొన్నది. ఇంటిలోకి వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన దివ్య నిఖిత తొలివారమే నామినేషన్‌లోకి వచ్చారు. ఆమె కూడా 19 శాతం భారీ ఓటింగ్ సంపాదించుకొని మూడో స్థానంలో నిలిచారు.
ప్రస్తుతం వారంలో డేంజర్ జోన్‌లో ఉన్న వారిలో రీతూ చౌదరీ 15 శాతం ఓటింగ్‌తో 4వ స్థానంలో, 14 శాతం ఓటింగ్ హరిత హరీష్ 5వ స్థానంలో, 12 శాతం ఓటింగ్‌తో శ్రీజ చివరిస్థానంలో నిలిచారు. అయితే తొలివారం నామినేషన్‌లో ఉన్న విద్య నిఖిత అనూహ్యంగా ఓటింగ్‌ను మెరుగుపరుచుకొని రీతూ చౌదరీని డేంజర్ ప్లేస్‌లోకి నెట్టిందనే విషయం స్పష్టమైంది. అయితే ఇంకా ఓ రోజు ఓటింగ్ మిగిలి ఉంది కనుక అనూహ్యంగా ఓటింగ్ శైలి మారితే .. డేంజర్ జోన్‌లో ఉన్న వారు సేఫ్ అయ్యే పరిస్తితి కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











