Bigg Boss 9 Telugu 6th Week Nominations: బిగ్‌బాస్ 6వ నామినేషన్స్‌లో 6 గురు.. నామినేషన్‌లో ఎవరెవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు జరిగిన కామన్ మ్యాన్, సెలబ్రిటీల ప్రచ్ఛన్న మాటల యుద్ధం ట్రయాంగిల్‌గా మారింది. వైల్డ్ కార్డుల ద్వారా ఆరుగురు ఇంటిలోకి రావడంతో ఇప్పటి వరకు సాగిన చదరంగం కాస్త.. రణరంగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ వారం అంటే 6వ వారం నామినేషన్ ప్రక్రియ రంజుగా, వాడిగా, వేడిగా కొనసాగిందనే విషయం బయటకు వస్తున్నది. ఈ వారం ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారు? ఇంటిలో ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో గత 5 వారాలుగా పలు రకాల వివాదాలు, సంచలనాలతో ముందుకు సాగుతున్నది. ఇప్పటికే ఇంటి నుంచి 6 గురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. 5వ వారంలో డబుల్ ఎలిమినేషన్ కావడంతో ఇద్దరిని బయటకు సాగనంపారు. ఇప్పటి వరకు శ్రష్టివర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్ ఎలిమినేట్ కాగా, తాజాగా ఆశా సైనీ, శ్రీజ దమ్ము ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

Bigg Boss 9 Telugu 6th Week Nominations

ఇక ఇంటిలోకి కొత్త వారిని వైల్డ్ కార్డుల ద్వారా పంపించారు. ఫైర్ స్ట్రామ్ పేరుతో 2.0 ఈవెంట్‌ను భారీగా కండక్ట్ చేశారు. కన్నడ హోస్ట్ కిచ్చ సుదీప, మలయాళం హోస్ట్ మోహన్ లాల్, తమిళ హోస్ట్ విజయ్ సేతుపతి గెస్టులుగా కనిపించి.. ఇంట్లోకి కంటెస్టెంట్లను పంపించారు. వారికి పవర్ అస్త్రాలను ఇచ్చి వారికి ఎనర్జీని ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా ఇంట్లోకి వెళ్లిన వారిలో అలేఖ్య చిట్టి పికిల్ రమ్య మోక్ష, దివ్వెల మాధురీ, టీవీ నటి ఆయేషా, గౌరవ్, నిఖిల్ నాయర్, శ్రీనివాస్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చారు.

కొత్త పాత కంటెస్టెంట్ల మేళవింపుతో బిగ్‌బాస్ ఇంటిలో 6వ వారం నామినేషన్ల ప్రక్రియ జోష్‌గా సాగింది. నామినేషన్లను డిసైడ్ చేయడానికి ఫైర్ స్ట్రామ్ టీమ్‌కు అవకాశం ఇచ్చారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్‌ను నిర్ణయించే శక్తి ఫైర్ స్ట్రామ్ చేతుల్లో ఉంది. అందుకోసం ఇచ్చే టాస్క్ బాల్ ఆఫ్ ఫైర్ అంటూ బిగ్‌బాస్ చెప్పారు. దాంతో బిగ్‌బాస్ ఆదేశాలు ఇవ్వడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు రెచ్చిపోయారు.

నామినేషన్ల సందర్భంగా రమ్య మోక్ష ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచే తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను చూపించే ప్రయత్నంలో ఉన్నారు. నామినేషన్ల సందర్బంగా కంటెస్టెంట్లకు స్ట్రాంగ్‌గా డోస్ ఇస్తూ అలేఖ్య చిట్టి పికిల్ భామ ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా సుమన్ శెట్టిపై తనుజా గౌడ కంప్లైంట్ చేసింది. అలాగే రమ్య మోక్ష కూడా ఘాటుగా స్పందిస్తూ.. రీతూ చౌదరీ, డీమాన్ పవన్‌పై హాట్ కామెంట్స్ చేసింది. నీవు ఫిజికల్ టాస్క్‌లు ఆడుతావు కానీ.. నీకు బుర్ర లేదు అంటూ కనిపించింది. ఈ విషయంలో కూడా నీకు క్లారిటీ లేదు అని అన్నారు.

ఇదిలా ఉండగా, కడపటి వార్తలు అందేసరికి, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, రాము, దివ్య నిఖిత, భరణి శంకర్, తనుజా గౌడ నామినేట్ అయినట్టు సమాచారం. అయితే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో పూర్తి వివరాలపై క్లారిటీ రాలేదు. అధికారికంగా త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ వారం నామినేషన్లకు సంబంధించిన వివరాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X