Bigg Boss 9: శ్రీజకు మరో అన్యాయం.. అందరూ కలిసి దెబ్బేశారుగా!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో శ్రీజ దమ్ము, భరణి ఈ ఇద్దరిని మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ కోసం బిగ్ బాస్ పంపించారు.ఈ ఇద్దరిలో ఒక్కరిని పర్మినెంట్ హౌస్‌మేట్‌గా ఉంచేందుకు బిగ్ బాస్ టాస్క్‌లు, ఓటింగ్‌లతో సస్పెన్స్ క్రియేట్ చేశారు. అయితే ఇప్పటికే ఏడుగురు ఎలిమినేట్ అయిన తర్వాత ఈ ఇద్దరికే బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చారనే ప్రశ్న అభిమానుల్లో చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలు చూస్తే.. శ్రీజ దమ్ముకు మరోసారి అన్యాయం జరిగిందన్న భావన ప్రేక్షకుల్లో బలంగా వ్యక్తమవుతోంది.ఇంతకీ ఏం జరిగింది?
ఇప్పటికే శ్రీజ దమ్మును అన్యాయంగా హౌస్ నుంచి పంపేశారని అభిమానులు అప్పట్లోనే ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పుడు మళ్లీ ఆమెను హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చి, చివరికి భరణికే పర్మినెంట్ హౌస్‌మేట్‌గా అవకాశం ఇవ్వడం మరోసారి వివాదానికి కారణమవుతోంది. వాస్తవానికి శ్రీజ-భరణిల మధ్య పోటీ అంటే అది వన్‌సైడ్ ఫైట్ అవుతుందని, ఖచ్చితంగా శ్రీజకే ఎక్కువ ఓట్లు వస్తాయని చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఫలితం అంచనాలకు పూర్తి భిన్నంగా వచ్చింది. ఆ వన్‌సైడ్ ఓటింగ్ శ్రీజకోసం కాకుండా భరణి వైపు మళ్లింది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

బిగ్ బాస్ లో ఎవరిని పర్మినెంట్ హౌస్‌మేట్‌గా చూడాలనుకుంటున్నారు? అనే ప్రశ్నతో ఓటింగ్ ప్రారంభించినా, ఆ ఓటింగ్‌కు పెద్దగా స్పందన రాలేదు. అంతేకాకుండా ఓటింగ్‌ను కేవలం ఒక్కరోజు మాత్రమే నిర్వహించడం కూడా అభిమానుల్లో అసంతృప్తిని కలిగించింది. మరోవైపు..వీరిద్దరి మధ్య మొదట ఓ ట్కాస్ నిర్వహించారు. ఈ టాస్క్ లో భరణికి తీవ్ర గాయాలు అయి..ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో శ్రీజ దమ్ము పర్మినెంట్ హౌస్‌మేట్ అవుతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అనూహ్యంగా భరణి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ హౌస్‌లోకి వచ్చాడు. దీంతో శ్రీజ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది.
భరణీ రీ ఎంట్రీ తరువాత..పర్మినెంట్ హౌస్‌మేట్ లో భాగంగా మొదటగా 'రేజ్ ఆఫ్ మైజ్' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో శ్రీజ, భరణి తరపున దివ్య ఆడారు. ఈ టాస్క్‌లో శ్రీజ చిత్తుగా ఓడిపోయింది. దీంతో భరణి టీం విజయం సాధించింది. బిగ్ బాస్ కోటపై తన జెండాను ఎగరవేశాడు. ఆ తరువాత "రిలీజ్ ద వారియర్" అనే గేమ్ పెట్టారు. రెండవ టాస్క్ లో శ్రీజ తరపున కళ్యాణ్, భరణి తరపున రామూ పోటీ పడ్డారు. ఈ టన్నెల్ టాస్క్‌లో శ్రీజ టీం అద్భుతంగా ఆడి విజయం సాధించింది. భరణి టీం 8 నిమిషాలల్లో గేమ్ పూర్తి చేయగా.. శ్రీజ టీం మాత్రం కేవలం 2 నిమిషాల్లో గేమ్ పూర్తి చేసింది.దీంతో ఈ సారి శ్రీజ బిగ్ బాస్ కోటపై తన జెండాను ఎగరవేసింది.
ఇలా ఇద్దరూ సమాన పాయింట్స్ గెలుచుకోవడంతో బిగ్ బాస్ మరో టాస్క్ నిర్వహించారు. అదే రైట్ కలర్ రైట్ కనెక్షన్.. ఈ గేమ్ లో భరణి తరపున ఇమ్మాన్యుయేల్, శ్రీజ తరపున కళ్యాణ్ ఆడారు. కళ్యాణ్ చేసిన చిన్న తప్పిదం వల్ల ఈ టాస్క్‌లో భరణి టీం గెలిచింది. ఈ సందర్భంలో శ్రీజ, డెమోన్ మధ్య మాటల యుద్ధం కూడా చెలరేగింది. సాధారణంగా ఓటింగ్ జరిపినా, శ్రీజకే ఎక్కువ ఓట్లు వస్తాయని ఫ్యాన్స్ భావించారు. కానీ ఫలితం రివర్స్ అయింది - భరణికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో మళ్లీ ఆమెను బయటకు పంపి, చివరికి భరణినే పర్మినెంట్ కంటెస్టెంట్‌గా ఉంచుతున్నారని టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి శ్రీజ ఎలిమినేట్ అయ్యి మూడు వారాలు కావడంతో, ఆడియన్స్‌లో ఆమె పాపులారిటీ కొంత తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు భరణికి సీరియల్ ఫ్యాన్స్ మద్దతు బలంగా ఉంది. ఆయనకు తనూజ, ఇమ్మాన్యుయేల్ లాంటి కంటెస్టెంట్స్ సపోర్ట్ చేయడం కూడా ప్లస్ అయ్యింది. సెలబ్రెటీ కావడం, పీఆర్ టీం బలంగా ఉండటం కూడా భరణికీ కలసి వచ్చాయనే చెప్పాలి. ఇలా ఓటింగ్ లో కూడా వెనుకబడటంతో మరో సారి శ్రీజని ఎలిమినేటర్ అయింది. మళ్లీ తీసుకురావడం, తిరిగి పంపడం చూస్తే.. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందని ఆడియన్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు.
మరోసారి సోషల్ మీడియాలో శ్రీజకు అన్యాయం జరిగిందనీ, జస్టిస్ ఫర్ శ్రీజ అనే కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. "బిగ్ బాస్ ముందే డిసైడ్ అవుతాయి, ఓటింగ్ కేవలం షో కోసం మాత్రమే" అని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద, ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో సస్పెన్స్, వివాదం, భావోద్వేగం అన్నీ కలగలిసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. శ్రీజా అభిమానులు నిరాశలో ఉన్నా, భరణి అభిమానులు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. తదుపరి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఏ కొత్త ట్విస్ట్ ఇవ్వబోతారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











