Bigg Boss 9 Telugu Live: లేడీ కంటెస్టెంట్‌పై ఇమ్మాన్యుయేల్ ముద్దుల వర్షం

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో రెండో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే తొలివారం శ్రష్టి వర్మ ఇంటి నుంచి బయటకు ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. రెండో వారం గొడవలు, కొట్లాటలతో ఇల్లు దద్దరిల్లింది. ఈ షోకు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున ప్రారంభమైన ఈ షో సుమారుగా 15 వారాలు కొనసాగే అవకాశం ఉంది. టాప్ రేటింగ్ రియాలిటీ షోకు సంబంధించిన ప్రారంభ వేడుకకు సంబంధించిన విశేషాలు, కంటెస్టెంట్ల పేర్లు, వారి గురించిన సమాచారానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు షో కు సంబంధించిన నవగ్రహాలకు అధిపతిగా హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించబోతున్నారు. అయితే ఈ సారి అది డ్రీమ్ హౌస్ కాదు.. డబుల్ హౌస్.. డబుల్ డోస్... అద్దె లేని టెనెంట్‌వి అంటూ నాగ్ తేల్చేశాడు. కామన్ మ్యాన్, సెలబ్రిటీలు కలిసి ఆడే ఆట.. ఇప్పటి వరకు చూసిన కంటెంట్ వేరు.. పాత సిలబస్‌తో కొత్త ఎగ్గామ్ రాయలేరు అంటూ కంటెస్టెంట్లకు నాగ్ వార్నింగ్ ఇచ్చారు. రెండో వారంలో నామినేషన్‌లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.

Bigg Boss 9 Telugu live updates

LIVE Feed
  • Sep 17, 2025 6:25 PM

    రెండో వారం కెప్టెన్సీ టాస్క్

    బిగ్‌బాస్ ఇంటిలో రెండో వారం కెప్టెన్సీ టాస్క్‌ను మొదలుపెట్టారు. ఇంటికి కాబోయే రెండో కెప్టెన్ రేసులో పోటీ పడేందుకు ఓనర్లు, టెనెంట్స్‌కు టాస్క్ ఇచ్చారు. కొన్ని గంటల సమయం ఇచ్చి నిద్ర పోకుండా టాస్కులను కంటిన్యూ చేయాలని సూచించారు. ఎవరు ఎక్కువ సేపు నిద్ర పోకుండా ఉంటారో.. వారి టైమింగ్ పెరిగి.. కెప్టెన్సీ టాస్క్‌కు అవకాశం పెరుగుతుందని వెల్లడించారు.

  • Sep 17, 2025 3:06 PM

    ఇమ్మాన్యుయేల్ కామెడీతో

    బిగ్‌బాస్ హౌస్‌లో ఇమ్మాన్యుయేల్ కామెడీతో అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఇమ్ము క్రియేట్ చేసే ఫన్ ఆడియెన్స్‌కు కూడా వినోదాన్ని అందిస్తున్నది. అయితే తనూజా గౌడతో క్రియేట్ చేసిన ఫన్ లవ్ ట్రాక్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. తాజాగా సరదాగా సాగిన ఫోన్ కాల్ సంభాషణ సందర్భంగా తనూజపై ఇమ్ము కురిపించిన ముద్దుల వర్షం అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. ఈ వీడియోను మీరే చూడండి.

  • Sep 16, 2025 4:23 PM

    సుమన్ శెట్టికి సంజన వార్నింగ్

    బిగ్‌బాస్ తెలుగు 9 షోలో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య భారీ వాగ్వాదం సృష్టించింది. సంజనకు సుమన్ శెట్టికి గట్టిగా పోట్లాట జరిగింది. సుమన్ శెట్టిని నామినేట్ చేసిన తర్వాత.. ముఖానికి రంగు రాసేయండి.. టైమ్ వేస్ట్ అంటే.. నీ కామెడీలు నా వద్ద నడవవు అని సంజన వార్నింగ్ ఇచ్చింది. అలాగే సుమన్ శెట్టికి ప్రియాశెట్టికి కూడా గట్టిగానే మాటల యుద్దం చోటు చేసుకొన్నది.

  • Sep 16, 2025 4:22 PM

    భరణి వర్సెస్ ప్రియా శెట్టి

    అలాగే భరణికి ప్రియాకు కూడా నామినేషన్ల సందర్భంగా వాగ్వాదం జరిగింది. మీరు ఓ డాక్టర్ అంటూ భరణి ఏదో చెప్పబోతే.. నా ప్రొఫెషన్ గురించి చెప్పకు అంటూ హెచ్చరింది. ఇక రెడ్ ఫ్లవర్ అంటూ కామెంట్ చేసిన హరీష్‌ను ఇమ్మాన్యుయేల్ నామినేట్ చేశారు. ఈ సందర్భంగా గుండు బాస్, రెడ్ ఫ్లవర్ విషయాలపై వాదులాడుకొన్నారు.

  • Sep 15, 2025 12:58 PM

    రెండో వారం నామినేషన్‌లో

    తొలి వారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన తర్వాత రెండో వారం నామినేషన్స్ జోరుగా సాగాయి. కామన్ మ్యాన్స్, సెలబ్రిటీలు ఒకరిపై మరొకరు పోటీ పడి నామినేట్ చేసుకొన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు నామినేట్ అయిన వారిలో హరిత హరీష్, ఫ్లోరా సైనీ, భరణి శంకర్, రీతూ చౌదరీ, ప్రియా శెట్టి ఉన్నట్టు సమాచారం.

  • Sep 13, 2025 9:43 AM

    బిగ్‌బాస్‌లో బటర్ ఫ్లై ఎఫెక్ట్

    బిగ్‌బాస్‌లో బటర్ ఫ్లై ఎఫెక్ట్.. శివాజీ స్ట్రాంగ్ వార్నింగ్ బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో బటర్ ఫ్లై ఎఫెక్ట్‌తో బిగ్‌బాస్ బజ్ మొదలుపెట్టనున్నారు. బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటే.. ప్రకృతిలో ఎక్కడో జరిగే ఓ సంఘటన ఇంకెక్కొడో జరిగే మూమెంట్‌ను ఎఫెక్ట్ చేస్తుంది. అదే విధంగా కంటెస్టెంట్స్ తీసుకొనే నిర్ణయం కారణంగా ఆడియెన్స్‌లో అభిప్రాయాలు మారుతుంటాయి. ఇది బిగ్‌బాస్ బటర్ ఫ్లై అంటూ యాక్టర్ శివాజీ హోస్ట్‌గా తెర ముందుకు వచ్చారు. ఈ సారి బజ్ మామూలుగా ఉండదు అంటూ కామెంట్ చేశాడు.

  • Sep 11, 2025 1:35 PM

    లేడీ గెటప్‌లో అదరగొట్టిన ఇమ్మాన్యుయేల్

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో జబర్దస్త్ ఆర్టిస్టులు రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ కామెడీ, ఫన్ మూమెంట్స్‌తో అదరగొడుతున్నారు. పెన్సిల్ కనబడటం లేదు.. ఎవరైనా దొంగతనం చేశారా అని రీతూతో హరీష్ అంటే.. ఇంటా వంటా లేదు. కావాలంటే మనసుల్ని దొంగతనం చేస్తాను అని రీతూ సమాధానం ఇచ్చింది. ఇలాంటి డైలాగ్స్ 15 ఏళ్ల వయసులోనే వాడాం అని కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆడ గెటప్‌లో ఇమ్మాన్యుయేల్ అదరగొట్టాడు.

  • Sep 11, 2025 11:56 AM

    తొలివారం నామినేషన్‌లో ఉన్న వారు ఎవరంటే?

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో తొలివారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సెలబ్రిటీలలో సుమన్ శెట్టి, తనూజ, రీతూ చౌదరీ, సంజన గల్రానీ, శ్రష్టి వర్మ, డీమాన్ పవన్, ఆశా సైనీ, ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్ ఉన్నారు.

  • Sep 11, 2025 12:02 AM

    గుడ్డు దొంగతనం చేసిన సంజన

    ఇంట్లో గుడ్డు దొంగతనం జరగడం వల్ల పెద్ద గందరగోళమే జరిగింది. సంజన గల్రానీ గుడ్డు దొంగలించి తినడం వల్ల భరణి, హరీష్ మధ్య భారీ గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు గట్టిగా అరుచుకొన్నారు. అయితే ఓ దశలో నిన్ను చూస్తుంటే.. డీజే టిల్లు సినిమాలో రాధిక గుర్తుకు వస్తున్నది అంటూ సంజనాతో ఇమ్మాన్యుయేల్ అనడం కనిపించింది.

  • Sep 10, 2025 11:58 PM

    నీ కోసం నీవు

    నీ కోసం నీవు ప్రొటెక్ట్ చేసుకొంటున్నావు. కానీ వేరే వాళ్ల గురించి ఆలోచించడం లేదు. సాక్ష్యాలు ఉన్నా మనం అబద్దాలు ఆడుతున్నాం. దాని వల్ల మన మీద నమ్మకం పోతున్నది. మన టీమ్ మెంబర్స్ మీద ట్రస్ట్ పోతున్నది అని శ్రష్టి వర్మ వాపోయింది.

  • Sep 10, 2025 5:28 PM

    సంజన గల్రానీ చుట్టే

    బిగ్‌బాస్ ఇంటిలో సంజన గల్రానీ చుట్టే నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అందరూ ఆమె బిహేవియర్ గురించి ప్రస్తావిస్తూ నామినేట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే కంటెస్టెంట్లు ట్రాక్ మిస్ అవుతున్నారని భావించిన బిగ్‌బాస్ ... ఇంటి సభ్యులకు క్లాస్ పీకారు. సరైన కారణాలతో నామినేట్ చేయండి అంటూ మందలించారు. ఈ వీడియోను మీరే చూడండి..

  • Sep 10, 2025 12:43 PM

    మాస్క్ మ్యాన్ గురించి ఇమ్ము

    మాస్క్ మ్యాన్ హరీష్‌ మనస్తత్వం గురించి ఇమ్మాన్యుయేల్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. సంజన గల్రానీ అందరూ ఎటాక్ చేయడం పాపం అనిపించింది. ఆమె ఓ దశలో ఓపిక పట్టింది. కానీ ఆ తర్వాత ఆమె గట్టిగా ఇచ్చిపడేసింది అని ఇమ్ము, రీతూ చౌదరీ ముచ్చటించారు. వారి ముచ్చట గురించి మీరు లుక్కేయండి.

  • Sep 10, 2025 12:33 PM

    నామినేషన్లు వాడివేడిగా

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో తొలివారం నామినేషన్లు వాడివేడిగా సాగాయి. సెలబ్రిటీలు, కామన్ మ్యాన్స్‌కు మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగింది. మీ పద్దతి బాగాలేదు. మీ ప్రవర్తన బాగాలేదు అని తనూజ గౌడపై శ్రీజ దమ్ము, హరిత హరీష్ విరుచుకుపడ్డారు. దాంతో భోరున విలపించిన తనూజ గౌడ. అలాగే సంజనా గల్రానీపై కూడా కంటెస్టెంట్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఈ ప్రోమోలో ఇంట్లో జరిగిన వాగ్వాదం మీరే చూడండి..

  • Sep 9, 2025 6:50 PM

    సంజన గల్రానీపై కారాలు మిరియాలు

    తాజాగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. నిన్న టీజర్ మాత్రమే రిలీజ్ చేశాను. కానీ మీకు అసలు సినిమా చూపిస్తాను అంటూ బిగ్‌బాస్ చెప్పారు. ఇక నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇంటి సభ్యులందరూ సంజన గల్రానీని టార్గెట్ చేశారు. హరిత హరీష్, సుమన్ శెట్టికి గట్టిగానే వాగ్వాదం జరిగింది.

  • Sep 9, 2025 1:10 PM

    నామినేషన్‌లో ఉన్న సెలబ్రిటీలు వీరే..

    బిగ్‌బాస్ ఇంటిలో తొలివారం నామినేషన్‌కు గురైన వారిలో తనూజ గౌడ, ఫ్లోరా సైనీ,ఇమ్మాన్యుయేల్, శ్రష్టి వర్మ, రీతూ చౌదరీ, డెమాన్ పవన్, సంజన గల్రానీ, రాము రాథోడ్, సుమన్ శెట్టి ఉన్నట్టు సమాచారం.

  • Sep 9, 2025 1:06 PM

    బిగ్‌బాస్‌లో నామినేషన్ రచ్చ.. నా రిలేషన్ గురించి మాట్లాడుతావా? సంజన‌కు వార్నింగ్

    బిగ్‌బాస్‌ తెలుగు 9 రియాలిటీ షోలో సోమవారం నామినేషన్ రచ్చ మొదలైంది. ఓనర్స్, టెనెంట్స్ మధ్య భారీ గొడవకు దారి తీసింది. అయితే టెనెంట్స్‌ను నామినేట్ చేయాలని ఓనర్స్‌కు బిగ్‌బాస్ సూచించాడు. ఈ సందర్భంగా.. నా రిలేషన్‌షిప్ గురించి ఎందుకు మాట్లాడావని ప్రశ్నిస్తూ సంజన గల్రానీకి ఆశా సైనీ వార్నింగ్ ఇచ్చింది. ఇంకా ఈ వీడియోలో ఏం జరిగిందో మీరే చూడండి..

  • Sep 8, 2025 7:22 PM

    ప్రియాంక జైన్, విష్ణు ప్రియ, అమర్ దీప్ ఎంట్రీ

    బిగ్‌బాస్ తెలుగు 9 ఇంటిలోకి గత సీజన్ కంటెస్టెంట్లు ప్రియాంక జైన్, విష్ణు ప్రియ, అమర్ దీప్ వచ్చారు. వారు హోమ్ టూర్‌కు వచ్చి కంటెస్టెంట్లను సర్‌ప్రైజ్ చేశాడు. ఇంకా వారు ఇంట్లో ఎలాంటి రచ్చ చేశారో చూడాలంటే.. ఫుల్ ఎపిసోడ్‌పై కన్నేయండి..

  • Sep 8, 2025 7:20 PM

    బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌

    బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌ ఇంటి క్లీనింగ్ బాధ్యతను అప్పగించడం తెలిసిందే. అయితే ఇంటిని మొత్తం శుభ్రం చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పమంటే.. ఒక రోజు పండుతుందని సమాధానం చెప్పాడు. అయితే ఎంత సమయమో కచ్చితంగా చెప్పు అంటూ అడిగితే... మొహం తేలేసాడు. దాంతో తన టీమ్ లీడర్‌కు ఆ బాధ్యతను అప్పగించారు. ఇక హరిత హరీష్‌ను గుండు అని కామెంట్ చేయడంపై బాడీ షేమింగ్ అంటూ రచ్చ మొదలైంది.

  • Sep 8, 2025 7:05 AM

    వైల్డ్ కార్డు ఎంట్రీతో ఆలీ భార్య?

    అయితే ఈ షోలోకి కమెడియన్ ఆలీ భార్య జుబేదా ఇంటిలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చే బిగ్‌బాస్.. ఆమెకు ఈ విడుత స్థానం కల్పించలేదు. అయితే ఈ క్రమంలో ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీతో ఇంట్లోకి ప్రవేశిస్తుందనే మరో ప్రచారం జరుగుతున్నది. ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

  • Sep 7, 2025 9:35 PM

    15వ కంటెస్టెంట్ ఎంపికలో ట్విస్ట్

    15వ కంటెస్టెంట్ ఎంపికలో ట్విస్ట్ చోటుచేసుకొన్నది. 14 మందితోనే షోను రన్ చేయాలని అనుకొన్నారు. కానీ అభిజిత్, శ్రీముఖి చాయిస్ మేరకు చివరి కామనర్‌గా మర్యాద మనీష్‌ను ఎంపిక చేశారు.

  • Sep 7, 2025 9:33 PM

    14వ కంటెస్టెంట్‌గా

    14వ కంటెస్టెంట్‌గా ప్రియాశెట్టి, 15వ కంటెస్టెంట్‌గా మర్యాద మనీష్ ఇంటిలోకి వెళ్లారు. శ్రీముఖి ఎంపిక చేయడం ద్వారా మనీష్‌కు ఈ అవకాశం లభించింది.

  • Sep 7, 2025 9:20 PM

    13వ కంటెస్టెంట్‌గా

    13వ కంటెస్టెంట్‌గా ఇంటిలోకి చివరి సభ్యుడిగా కమెడియన్ సుమన్ శెట్టి. జయం చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి 300 సినిమాలకుపైగా నటించాడు. బిగ్‌బాస్ అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకొన్నాను అని చెప్పాడు. నాగ్‌తో మాట్లాడితే.. ఇంటిలోకి అడుగుపెట్టాడు.

  • Sep 7, 2025 9:16 PM

    12వ కంటెస్టెంట్‌గా కామన్ మ్యాన్

    12వ కంటెస్టెంట్‌గా కామన్ మ్యాన్ కేటగిరి నుంచి దమ్ము శ్రీజ బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టింది. అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన ఆమెను జడ్జ్ నవదీప్ సెలెక్ట్ చేశాడు. ఈ షోలోకి వస్తానని నాకు ముందే తెలుసు. ముందు నవదీప్ ఎంపిక చేశాడు. ఇప్పుడు కూడా ఆయనే నన్ను ఇంటిలోకి పంపించే నిర్ణయం తీసుకొన్నాడు అని ఆమె చెప్పింది. శ్రీజ కాన్ఫిడెన్స్‌కు నాగ్ కూడా సర్‌ప్రైజ్ అయ్యారు.

  • Sep 7, 2025 9:06 PM

    11వ కంటెస్టెంట్‌గా

    11వ కంటెస్టెంట్‌గా రాను బొంబాయికి రాను అనే జానపద గేయం సృష్టికర్త రాము రాథోడ్ ఇంటిలోకి అడుగుపెట్టాడు. తన పాట 560 మిలియన్ల వ్యూస్ సాధించిందని తెలిపాడు. మిస్ వరల్డ్ పోటీల్లో కూడా తన పాట పాపులర్ అయిందని నాగ్ తెలిపాడు. నాగార్జున గురించి పాట పాడి ఇంట్లోకి అడుగుపెట్టాడు.

  • Sep 7, 2025 8:58 PM

    10వ కంటెస్టెంట్‌గా బుజ్జిగాడు హీరోయిన్

    10వ కంటెస్టెంట్‌గా బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. తన కెరీర్, డ్రగ్ కేసు గురించి వివరంగా చెప్పింది. తనను అన్యాయంగా ఇరికించారు అని ఆరోపించింది. తన భర్త, తల్లిదండ్రులు నన్ను సరిగా అర్ధం చేసుకొన్నారు అని చెప్పింది. తాను తన గురించి నిజాలు చెప్పుకొనే వేదికగా బిగ్‌బాస్‌ను ఎంచుకొన్నానని చెప్పింది.

  • Sep 7, 2025 8:55 PM

    9వ కంటెస్టెంట్‌గా డీమాన్ పవన్

    9వ కంటెస్టెంట్‌గా డీమాన్ పవన్ బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టాడు. జపాన్ వెబ్ సిరీస్ చూసి డీమాన్ క్యారెక్టర్ తనకు ఇన్సిపిరేషన్ అని చెప్పాడు. తనకు ఫిట్‌నెస్ అంటే ఇష్టం. కామన్ మ్యాన్ కేటగిరిలో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.

  • Sep 7, 2025 8:38 PM

    7వ కంటెస్టెంట్‌గా

    7వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరీ అడుగుపెట్టింది. దివ్య అంటూ నాగ్ పిలువడంతో ఆ పేరుతో పిలవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. ఆ తర్వాత నాగ్‌తో మాట్లాడి.. అతడిని కౌగిలించుకొని ఇంటిలోకి అడుగుపెట్టింది.

  • Sep 7, 2025 8:36 PM

    8వ కంటెస్టెంట్‌గా

    7వ కంటెస్టెంట్‌గా టీవీ కంటెస్టెంట్ భరణి శంకర్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. తన చేతిలో ఎర్రటి బాక్స్ ఉండటం గురించి నాగ్ అడిగితే.. తన సీక్రెట్ అందులో ఉంది. అది నా బాడీలో ఒక పార్ట్. కాబట్టి అనుమతించాలని పట్టుబట్టాడు. కానీ బిగ్‌బాస్ ఒప్పుకోకపోవడంతో రాజీ పడలేక ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకొన్నాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ అనుమతించడంతో తిరిగి ఇంటిలోకి వెళ్లాడు.

  • Sep 7, 2025 8:20 PM

    6వ కంటెస్టెంట్‌గా

    బిగ్‌బాస్ తెలుగు ఇంటిలోకి మాస్క్ మ్యాన్ హరిత హరీష్ అడుగుపెట్టాడు. బిగ్‌బాస్ విజేత బిందు మాధవి ఎంపిక చేయడంతో కంటెస్టెంట్‌గా కన్ఫార్మ్ అయ్యారు. వేదికపైకి వచ్చి తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించాడు. ఇంటిలో ఉన్నన్ని రోజులు గుండుతోనే ఉంటానని మాట ఇచ్చాడు.

  • Sep 7, 2025 8:12 PM

    5వ కంటెస్టెంట్‌గా శ్రేష్టి వర్మ

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఇంటిలోకి వివాదాస్పద కొరియోగ్రాఫర్ శ్రేష్టివర్మ. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసులో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోవద్దని చెప్పారు. ఎవరు ఏమనుకొన్నా పట్టించుకోవద్దు అని సలహా ఇచ్చారు. హలో బ్రదర్ సినిమాలో కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో పాటకు డ్యాన్స్ చేసి నాగ్‌ను ఆకట్టుకొన్నారు.

  • Sep 7, 2025 7:59 PM

    నాలుగో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్

    నాలుగో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ అడుగుపెట్టాడు. తన ఆడియో వీడియో విజువల్ ప్రజెంటేషన్‌ను చూసి ఎమోషనల్ అయ్యాడు. తల్లిదండ్రుల కోసం తాను కూలీ పని చేశానని చెప్పాడు. తన బాధలను తలచుకొని.. మన తలరాతను మనమే రాసుకోవాలని జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టానని చెప్పాడు.

  • Sep 7, 2025 7:51 PM

    మూడో కంటెస్టెంట్‌గా సోల్జర్ కల్యాణ్

    ఇంటిలోకి మూడో కంటెస్టెంట్‌గా సోల్జర్ కల్యాణ్ కామన్ కేటగిరి ద్వారా ఛాన్స్ దక్కించుకొన్నారు. నాగార్జున పిలువగానే.. వేదికపైకి వచ్చారు. తనతోపాటు కామన్ మ్యాన్ కంటెస్టెంట్ ప్రియ ఉంటే బాగుంటుందని చెప్పారు. తను, ఫ్లోరా సైనీకి ఓ డ్యూటీ అప్పగించే బాధ్యతతో ఇంటిలోకి అడుగుపెట్టారు.

  • Sep 7, 2025 7:42 PM

    ఫ్లోరా సైని రెండో కంటెస్టెంట్‌గా

    బిగ్‌బాస్ ఇంటిలోకి రెండో కంటెస్టెంట్‌గా సీనియర్ నటి ఆశా సైనీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె మిరాయ్ సినిమాలోని వైబ్ ఉందని పాటపై స్టెప్పులేస్తూ ఆకట్టుకొన్నది. తన పేరు ఫ్లోరా సైనీ. తన పేరును ఎందుకు మార్చారో అనే విషయాన్ని చెప్పారు.

  • Sep 7, 2025 7:34 PM

    ఫస్ట్ కంటెస్టెంట్‌గా తనూజ గౌడ

    సీరియల్ నటి తనూజా గౌడ తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. తనలోని 9 క్వాలిటీలు చెప్పారు. వంట బాగా చేస్తానని చెప్పి.. మటన్ బిర్యానీ తీసుకొచ్చానని చెప్పారు. ఆమె తెచ్చిన మటన్ బిర్యానీని నాగ్ తీసుకొన్నాడు

  • Sep 7, 2025 7:23 PM

    బిగ్‌బాస్ లోకి ఆలీ భార్య జుబేదా

    బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ హర్షిత్ రెడ్డి, కమెడియన్ ఆలీ వైఫ్ జుబేదా సుల్తానా ఇంటిలోకి అడుగుపెడుతున్నట్టు వార్తలు వచ్చాయి.

  • Sep 7, 2025 7:11 PM

    కళ్లకు గంతలు కట్టి

    కళ్లకు గంతలు కట్టుకొని ఇంట్లోకి అడుగుపెట్టిన హోస్ట్ నాగార్జున అక్కినేని.. ముందుంది ముసళ్ల పండుగ.. వేచి చూడండి.. మిరపకాయ తోరణాలతో నాగ్‌కు స్వాగతం పలికాడు. దాంతో ఏ పరీక్షకైనా సిద్దమంటూ నాగార్జున సిద్దమైంది. ఆ తర్వాత కిచెన్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బెడ్ రూమ్ లోకి ప్రవేశించాడు.

  • Sep 7, 2025 6:02 PM

    కామన్ మ్యాన్ కేటగిరిలో ఎవరెవరంటే?

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభ వేదికపైన హోస్ట్ నాగార్జునతో శ్రీముఖి, నవదీప్ తదితరులు వచ్చారు. కామన్ మ్యాన్స్ నుంచి ఎవరు ఇంటిలోకి వెళ్తారనే విషయాన్ని తమ చేతుల్లో ఉన్న కవర్ల నుంచి తీసి బయటకు చెప్పారు. కామన్ మ్యాన్స్ ఎవరెవరూ ఇంట్లోకి అడుగుపెట్టారనే విషయం షో స్టార్ట్ అవ్వగానే తెలుస్తుంది ట్విస్ట్ ఇచ్చారు.

  • Sep 7, 2025 5:54 PM

    భరణి కుమార్‌కు బిగ్‌బాస్ షాక్

    టెలివిజన్ ఆర్టిస్ట్ భరణి కుమార్‌కు వేదిక మీదే షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. తనతోపాటు తెచ్చుకొన్న ఓ బాక్స్‌ను తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన నేను షోలోకి రానని మొండికేశాడు. దాంతో బిగ్‌బాస్.. నిబంధనలు పాటించిన వారు ఇంట్లోకి ఉండటానికి వీల్లేదు అనగానే.. నేను వెళ్లిపోతాను అంటూ బయటకు వచ్చాడు. భరణి.. అయితే భరణి ఉన్నాడా? లేడా? అనేది ఫుల్ వీడియోలో చూడాల్సిందే.

  • Sep 7, 2025 5:45 PM

    ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటూ

    డబుల్ హౌస్‌తో డబుల్ జోష్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9. ఆశ, ఆశయానికి మధ్య జరిగే రణరంగం. ముందుంది ముసళ్ల పండుగ అంటూ బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చారు. ఇంటిని అందంగా తీర్చి దిద్దారు. ఈ సీజన్ ప్రారంభ వేడుక గురించి ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. దానిపై మీరు లుక్కేయండి.

  • Sep 6, 2025 12:56 PM

    18 మంది 105 రోజులు

    బిగ్‌బాస్ తెలుగు 9 పాల్గోనే 18 మంది కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి కావడం.. వారికి సంబంధించిన అగ్రిమెంట్స్ వ్యవహారాలు కూడా కంప్లీట్ చేయడంతో దాదాపు 105 రోజులపాటు ఇంటిలో ఉండేదుకు రెడీ అయ్యారు

  • Sep 4, 2025 5:06 PM

    కామన్ మ్యాన్ కేటగిరిలో

    ఇక కామన్ మ్యాన్ కేటగిరిలో శ్రీజా, పవన్ కల్యాణ్, ప్రియా శెట్టి, పవన్ డెమోన్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీష్, మనీష్ తదితరులు ఉన్నారు.

  • Sep 4, 2025 5:05 PM

    సెలబ్రిటీ క్యాటగిరీలో

    బిగ్‌బాస్ సెలబ్రిటీల లిస్టులో భరణి కుమార్, ఆశా సైనీ, సంజనా గల్రానీ, తనుజా గౌడ, రాము రాథోడ్, శ్రష్టి వర్మ, హర్షిత్ రెడ్డి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికిల్ తదితరులు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X