For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Buzzz: మానస్ నిజస్వరూపం బయటపెట్టిన ఆరియానా.. పింకీ లెక్కలో బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే!

  |

  దాదాపు ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి ఇక్కడి ప్రేక్షకులు భారీ అంటే భారీ స్థాయిలో స్పందనను అందించారు. దీంతో ఇది ఆరంభంలోనే మంచి టీఆర్పీని అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఐదో సీజన్ కూడా అంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో దూసుకుపోతోంది. ఇక, ఇది చివరి దశకు చేరుకోవడంతో మరింత రంజుగా మారింది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్‌లో పాల్గొన్న ఆమెకు.. హోస్ట్ ఆరియానా.. మానస్‌కు సంబంధించిన ఓ వీడియోను చూపించింది. ఆ వివరాలు మీకోసం!

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో స్పెషల్‌గా

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో స్పెషల్‌గా

  తాజాగా ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ప్రియాంక సింగ్ అలియాస్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్ అయింది. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపు అందుకున్న సాయితేజ.. సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయింది. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి బిగ్ బాస్ ఆఫర్ పట్టుకుంది.

  Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్‌తో పాటు ర్యాంకులు.. టాప్‌లో అతడు లాస్ట్ ఆమె.. అందరికీ షాక్

  ఆట.. అందంలో అదుర్స్ అనేలా

  ఆట.. అందంలో అదుర్స్ అనేలా

  బిగ్ బాస్‌లోకి ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, పింకీ మాత్రం ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే ఈర్శ పడేంత అందంగా తయారవుతూ అదుర్స్ అనిపించింది.

  అతడితో క్లోజ్‌గా ఉంటూ సందడి

  అతడితో క్లోజ్‌గా ఉంటూ సందడి

  షోలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే ప్రియాంక సింగ్‌ ఫోకస్ అయింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించింది. దీంతో ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ రచ్చ చేసేసింది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లు ఒక టాస్కులో ఇద్దరికీ పెళ్లి కూడా చేశారు. అలా వీళ్లు జంటగా సందడి చేశారు. దీంతో పింకీ తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

  మాల్దీవుల్లో సినీ జంట రొమాన్స్: సీక్రెట్‌గా తీసుకున్న వీడియోతో మేటర్ లీక్.. పెళ్లి కాకున్నా ఆ పనులు

  షో నుంచి ప్రియాంక ఎలిమినేట్

  షో నుంచి ప్రియాంక ఎలిమినేట్

  ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన ప్రియాంక సింగ్.. మంచి ఆటతీరుతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇలా చాలా సార్లు ఎలిమినేషన్‌ను తప్పించుకుంది. ఈ క్రమంలోనే గత వారం నామినేట్ అయిన ఆమె.. తక్కువ ఓట్లు పోలైన కారణంగా 13వ వారంలో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమె బిగ్ బాస్ ప్రయాణం అలా ముగిసిపోయింది.

  ఆరియానాతో కలిసి సందడి చేసి

  ఆరియానాతో కలిసి సందడి చేసి

  ఐదో సీజన్ బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ అయిన వాళ్లతో ఆరియానా గ్లోరీ 'బిగ్ బాస్ బజ్' పేరిట ఓ టాక్ షోను చేస్తున్న విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో హౌస్ నుంచి బయటకు వచ్చేసిన ప్రియాంక సింగ్‌తోనూ ఆమె చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల గురించి చాలా విషయాలు చెప్పింది. అలాగే, కొన్ని సందర్భాల్లో బాగా ఎమోషనల్ కూడా అయిపోయింది.

  హాట్ షోలో హద్దు దాటిన మలైకా: ప్రైవేటు పార్టులు చూపిస్తూ అలా.. 48 ఏళ్ల వయసులో అవసరమా!

  మానస్ వీడియో చూపించడంతో

  మానస్ వీడియో చూపించడంతో

  బిగ్ బాస్ బజ్‌లో ప్రియాంక వచ్చినప్పటి నుంచి మానస్‌ను బాగా హైలైట్ చేశారు. అందుకు అనుగుణంగానే పింకీ కూడా అతడి గురించే ఎక్కువగా మాట్లాడింది. ఈ క్రమంలోనే హోస్ట్ ఆరియానా గ్లోరీ ఆమెకు మానస్, కాజల్ మాట్లాడుతున్న ఓ వీడియోను చూపించింది. దీంతో షాకైన పింకీ 'సారీ మానస్.. నీ నుంచి ఇది ఊహించలేదు' అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది.

  Recommended Video

  Pushpa Trailer Delay | Samantha As Yashodha || Filmibeat Telugu
  పింకీ లెక్కలో విన్నర్ ఎవరంటే

  పింకీ లెక్కలో విన్నర్ ఎవరంటే

  ఇక, ఈ షోలో భాగంగా ఐదో సీజన్‌కు విన్నర్ ఎవరు అవుతారు అని ఆరియానా గ్లోరీ.. ప్రియాంక సింగ్‌ను అడిగింది. దీనికి ఏమాత్రం తడబాటు లేకుండా మానస్ పేరు చెప్పేసింది. ఆ తర్వాత మాట్లాడుతూ.. 'మానస్ ఎవరినైనా చదివి పడేస్తాడు. నాకు పిల్లలు ఉంటే ఎలా చూసుకుంటానో.. అతడిని హౌస్‌లో అలా చూసుకున్నా' అంటూ ఏడ్చింది. దీంతో ఆరియానా ఓదార్చింది.

  English summary
  Bigg Boss Recent Episode Priyanka Singh Eliminated. After That Ariyana Glory Shows Maanas Video to Her In Bigg Boss Buzzz.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X