Bigg Boss Buzzz: ‘భయమా..? నా బ్లడ్‌లోనే లేదు'.. ఆ దెబ్బకు మాధురికి దండం పెట్టిన శివాజీ..
Madhuri Bigg Boss Buzzz: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హౌస్‌లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నా, తన బోల్డ్ కామెంట్స్, కౌంటర్‌లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మాధురి. ఎలిమినేట్ అయిన తర్వాత కూడా అదే అటిట్యూడ్‌తో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో మెరిసింది. తనదైన స్టైల్‌లో హోస్ట్ శివాజీతో ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చిన మాధురి, ప్రశ్నలకు ఘాటైన సమాధానాలతో షాక్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాధురికి స్వాగతం పలికిన శివాజీ మొదటి నుంచే సరదాగా సెటైర్లు వేస్తూ వాతావరణాన్ని హీట్ చేశారు. "మిమ్మల్ని ఏమని పిలవాలి మాధవినా? లేక మాధురినా?" అంటూ చమత్కారంగా అడిగిన శివాజీకి, మాధురి "నా పేరు మాధురి మాధవి కాదు" అంటూ నేరుగా సమాధానం ఇచ్చింది. దీంతో శివాజీ "ఇదే ఆ రోజు చెప్పుంటే గొడవ ఉండేది కాదు కదా ఆ అమ్మాయితో" అని పంచ్ వేశారు. అదీ కాకుండా, "అందరికీ ఎలా చెబుతాను, నాకు నచ్చితే చెప్తాను" అంటూ మాధురి కౌంటర్ ఇవ్వడం ప్రోమోలో హైలైట్ అయింది.

తరువాత శివాజీ "100 శాతం మీరు తెలుగు ఇళ్లలోకి వెళ్లాలనుకున్నారు కదా?" అని అడిగితే, మాధురి ధైర్యంగా "వెళ్లాను" అని సమాధానమిచ్చింది. అప్పుడు శివాజీ "వెళ్లి ఇంత తొందరగా ఎలా వచ్చారు?" అని చమత్కరించగా, మాధురి "వెళ్లాలనిపించి వెళ్లాను.. రావాలనిపించింది కాబట్టి వచ్చాను. నేను నటించడం రాదు.. మాస్కులు పెట్టుకోను" అని చెప్పింది. దీంతో శివాజీ చమత్కారంగా "అది ఎవరూ అడగలేదే!" అంటూ పంచ్ వేసారు.
ఇక శివాజీ మాట్లాడుతూ "బిగ్ బాస్‌లో ఎంత తోపు అయినా..." అంటూ మొదలుపెట్టగానే, మాధురి మధ్యలోనే అడ్డుపడి "ఇప్పుడెవరూ తోపులని అనుకోవడం లేదు.. నేను తోపు అనట్లేదు!" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో శివాజీ కూడా వెంటనే "నేను మీ గురించి అనట్లేదు అమ్మా, మీరు తోపు అని ఎవరూ అనలేదు!" అంటూ హ్యూమర్‌గా పరిస్థితిని సర్దేశారు.
తర్వాత ఇంటర్వ్యూలో శివాజీ, మాధురి బిగ్ బాస్ హౌస్‌లో చేసిన ఒక కామెంట్ గురించి ప్రస్తావిస్తూ .. "బయట అయితే జుట్టు పట్టుకొని కొడతా అన్నారట... ఎలా కొడతారండి?" అని ప్రశ్నించాడు. దీంతో మాధురి కాస్త సీరియస్ అవుతూ.. "నేను ఎవ్వరినీ భయపెట్టడానికి కాదు, నా భావం చెప్పాను అంతే!" అని సమాధానమిచ్చింది.
"ఈ విధంగా మాట్లాడితే బిగ్ బాస్ ఆడియన్స్ ఉండనిస్తారా?" అని శివాజీ ప్రశ్నించగా.. మాధురి కౌంటర్‌గా "ఉండనిస్తారా, ఉండనివ్వరా అంటే వాళ్ల ప్రకారమే నేను మాట్లాడాలా?" అంటూ ఫైర్ అయింది. ఆ సమాధానంతో శివాజీ కాసేపు షాక్ అయ్యారు. మాధురి మాటలపై స్పందిస్తూ "అంటే ఓడిపోయాక నేను కావాలనే ఓడిపోయానంటారా?" అని సైటర్ వేశారు. దీంతో మాధురి కూడా వెంటనే "అవును.. కొన్ని సందర్భాల్లో మనం మనసుకు నచ్చినట్టు డెసిషన్ తీసుకోవాలి కదా!" అంటూ తన అటిట్యూడ్ చూపించింది.
తరువాత శివాజీ ఒక ఉదాహరణ చెబుతూ.. "డాక్టర్ అన్నాడు గట్టిగా మాట్లాడొద్దు.. ప్రతి సారి అలా చేస్తే నెగెటివిటీ వస్తుంది. హౌస్‌లో మీ వాదనలు భయపెట్టేలా ఉన్నాయి." అని అన్నాడు. దీంతో మాధురి ఒక్కసారిగా "మీకా?" అంటూ చమత్కారంగా అడిగింది. శివాజీ కూడా నవ్వుతూ "నాకు కాదు అమ్మా, లోపలున్న సాయికి!" అంటూ 'అని శివాజీ దండం పెట్టాడు.
'శ్రీజని చూసి మీరు భయపడ్డట్టు అనిపించింది'అని శివాజీ రెచ్చగొట్టాడు. మాధురి దానికి ఘాటుగా స్పందిస్తూ "భయమనేది నా బ్లడ్‌లోనే లేదు!" అంటూ పవర్‌ఫుల్ డైలాగ్ కొట్టింది. ప్రస్తుతం ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రోమోనే ఇలా ఉంటే వీళ్ల ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు "శివాజీకి సరైన కౌంటర్ ఇచ్చిన ఒక్క కంటెస్టెంట్ మాధురే!" అని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











