Bigg Boss Buzzz: ఓ అమ్మాయిపై అలా ముద్ర కర్టెనా? ఆ వీడియో చూపించి.. పచ్చళ్ల పాపకు శివాజీ క్లాస్..
Sivaji Bigg Boss Buzzz: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో ఈ వారం మరో షాక్ ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చి, తన మాటలతో రచ్చ రేపిన పచ్చళ్ల పాప రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది. కేవలం రెండు వారాలే ఉన్నా రమ్య హౌస్‌లో చేసిన కామెంట్స్, గొడవలు, సెటైర్లు ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కళ్యాణ్, తనూజ, డీమాన్, రీతూ వంటి కంటెస్టెంట్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు హౌస్‌ను హీటెక్కించాయి. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన రమ్య బిగ్‌బాస్ బజ్ షోలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో శివాజీ అడిగిన ప్రశ్నలు, వేసిన సెటైర్లు, రమ్య సమాధానాలు చూపిన నెటిజన్లు "ఇది ఇంటర్వ్యూ కాదు.. క్రాస్ ఎగ్జామినేషన్!"అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
పచ్చళ్ల పాపకి బిగ్‌బాస్ షాక్!
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం డేంజర్ జోన్‌లో రమ్య మోక్షతో పాటు సంజన కూడా ఉన్నారు. వీరిద్దరిలో తక్కువ ఓట్లు రావడంతో రమ్య ఎలిమినేట్ అయిపోయింది. హౌస్‌లో ఆమె చేసిన ప్రవర్తన, మాటలు, గొడవలు చూస్తే చాలా మంది " రమ్య అసలు సైలెంట్‌గా ఉండదు" అని అనుకున్నారనే చెప్పాలి. రీతూ, డీమాన్ మధ్య గొడవ పెట్టడం, కళ్యాణ్‌ని "అమ్మాయిల పిచ్చి" అనడం, తనూజ-కళ్యాణ్ రిలేషన్‌పై సెటైర్లు వేయడం ఇవన్నీ ఆమెకు నెగెటివ్ ఇమేజ్ ను క్రియేట్ చేశాయనే చెప్పాలి.

బిగ్ బాస్ హౌస్ నుంచి రమ్య బయటకు రాగానే బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొన్నారు. మొదట రమ్య రాగానే శివాజీ "క్లాప్ కొట్టి సౌండ్ వచ్చిందా?" అని ప్రశ్నించారు. రమ్య "వచ్చింది సార్" అని అనగానే, "విజిల్ వేసి.. సౌండ్ ఇక్కడ బాగా వినపడిందా? లేక అక్కడ?" అంటూ శివాజీ సెటైర్ వేశాడు. రమ్య కూడా నవ్వుతూ "ఇక్కడే బాగా వినిపించింది సార్" అంది. ఇలా సైటర్లతో ఇంటర్వ్యూ ప్రారంభమైంది. కానీ, ఆ తర్వాత ఘాటు ప్రశ్నలు, ముక్కు సూటి సమాధానాలతో ఇంటర్వ్యూ హీటెక్కింది.
తర్వాత స్క్రీన్‌పై తాబేలు ఫోటో చూపించి "ఇది ఎవరికి సూట్ అవుతుంది?" అని శివాజీ అడిగాడు. రమ్య "రాము" అని చెప్పేసింది. తర్వాత చీతా ఫోటో చూపించగా.. "గౌరవ్" అని చెప్పింది. వెంటనే శివాజీ 'గౌరవ్? బయట ఉన్నప్పుడు ఎపిసోడ్స్ చూడలేదు అనుకున్నా.. కానీ లోపల ఉన్నప్పుడు కూడా ఏం అబ్జర్వ్ చేయలేదు అమ్మడూ నువ్వు!" అంటూ ఘాటు సెటైర్ వేశాడు. దీంతో రమ్య మాత్రం కొంచెం కంగారు పడింది.
తర్వాత శివాజీ సీరియస్ మోడ్‌లోకి వెళ్లి "హౌస్‌లో మీరే నెగెటివ్ అని అందరూ అంటున్నారు" అన్నాడు. రమ్య వెంటనే "అందరూ అనలేదు సార్.. ఇద్దరు మాత్రమే అనారు.. అది వాళ్ల ఆలోచన" అని సూటిగా సమాధానం ఇచ్చింది. కానీ శివాజీ వదలకుండా "ఆది గారు వచ్చినప్పుడు మీకు ఒక హింట్ ఇచ్చారు కదా.. 'థాంక్యూ' అన్నప్పుడు మీ ఫేస్‌ఎక్స్‌ప్రెషన్ చూడలేదా? అంత ఆటిట్యూడ్ ఎందుకు?" అంటూ రమ్యను ఇమిటేషన్ చేస్తూ చూపించాడు శివాజీ. రమ్య కంగారుపడుతూ.. 'అలా రీచ్ అయి ఉంటుందేమో'అంది. వెంటనే శివాజీ "ఆ రీచ్ అయింది కాబట్టే మిమ్మల్ని ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది!" అని మరోసారి పంచ్ వేశాడు.
తర్వాత శివాజీ మరో కౌంటర్ వేస్తూ "మీరు ఈ హౌస్‌కి కరెక్ట్ కాదేమో అనిపించిందా?" అని అడిగాడు. రమ్య "ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో, వాళ్లతోనే ఉండాలని అనిపిస్తుంది సార్" అంది. దానికి వెంటనే శివాజీ "అంటే మీకు సింపథీ కావాలా?" అని అడిగాడు. రమ్య "నాకేం సింపథీ కాదు సార్" అంటూ సమాధానం ఇచ్చింది. కానీ శివాజీ "సింపథీ లేకుంటే సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఎందుకు కావాలనిపించిందో?" అని మరొకసారి సెటైర్ వేశాడు.
అంతటి శివాజీ ఆగకుండా ఇంటర్య్వూలో మరింత హీట్ పెంచే ప్రయత్నం చేశారు. "మీ గేమ్ మీద ఫోకస్ పెట్టకుండా ఓదార్పు యాత్రకి వెళ్లారా? కళ్యాణ్-తనూజ లవర్స్ అని మీరు అన్నారా?" అని అడిగాడు. రమ్య తడబడుతూ "నాకు అనిపించింది చెప్పడంలో తప్పా సార్?" అంది. దాంతో శివాజీ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. "ఒక అమ్మాయి-అబ్బాయి గురించి అలా మాట్లాడితే.. వాళ్లపై ముద్ర పడుతుంది కదా?" అని ఫైర్ అయ్యాడు. రమ్య "అది సరదాగా చెప్పాను సార్" అని చెప్పగానే, శివాజీ మళ్లీ "పవన్‌తో పులిహోర ఎందుకు కలపడం మొదలెట్టావ్?" అంటూ రమ్యకు దిమ్మతిరిగిపోయేలా చేస్తాడు. "నేను పవన్‌తో పులిహోర ఏం కలపలేదు సార్" అని కాస్త గట్టిగానే అంది.
వెంటనే శివాజీ "వీడియో ప్లీజ్" అని అన్నాడు. వెంటనే స్క్రీన్‌పై వీడియో ప్లే అయింది. అందులో మాధురి రమ్యని అడుగుతుంది. "ఈ హౌస్‌లో నీకు ఎవరు నచ్చారు?" అని. రమ్య నవ్వుతూ "పవన్ చాలా ఇన్నోసెంట్.. పవన్‌యే నాకు ఇష్టం" అని చెబుతుంది. వీడియో ముగిసిన వెంటనే శివాజీ "కట్!" అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పటి వరకూ నవ్వుతున్న రమ్య ముఖంలో ఆందోళన కనిపిస్తోంది. "అది సార్ జస్ట్ సరదాగా అన్నా.." అని చెప్పగా, శివాజీ "ఇది సరదా కాదు, ఇది ఇన్‌ఫ్లూయెన్స్.. హౌస్‌లో చిన్న మాట పెద్ద కాంట్రవర్సీ అవుతుంది" అంటూ క్లాస్ పీకుతాడు.
ఇంటర్వ్యూ మొత్తం శివాజీ రమ్యపై సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. ఒక దశలో "మీకు ఆటిట్యూడ్ ఎక్కువా లేక ఆక్టింగ్ ఎక్కువా?" అని అడగగా, రమ్య "రెండు మిక్స్ సార్" అంటూ నవ్వింది. ఈ బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూ ప్రోమోతోనే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. "శివాజీ తన ప్రశ్నలతో రమ్యను వణికించాడు"అంటూ నెటిజన్లు రియాక్షన్లు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











