Just In
- 9 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఖిల్‌కు షాకిచ్చిన బిగ్ బాస్: అభిజీత్‌కు మద్దతుగా మార్పు.. దెబ్బకు రికార్డు క్రియేట్ చేశాడు
రికార్డు బ్రేకింగ్ రేటింగ్‌తో గ్రాండ్ ఓపెనింగ్ సాధించింది బిగ్ బాస్ నాలుగో సీజన్. ఆ తర్వాతా అదే రీతిలో కంటిన్యూ చేస్తూ సక్సెస్‌ఫుల్ సీజన్‌గా ప్రసారం అవుతోంది. ఇలా ఇప్పుడు ఫినాలే వరకూ చేరుకుంది. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో గత సీజన్లలో ప్రసారం కాని సరికొత్త టాస్కులు కనిపిస్తున్నాయి. టాప్ -5కి చేరుకునేందుకు కంటెస్టెంట్లంతా తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలేకు చేరిన అఖిల్‌కు బిగ్ బాస్ షాకిచ్చాడు. అభిజీత్‌కు మద్దతుగా మార్పులు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

ఫినాలేకు అఖిల్.. నామినేషన్‌కు దూరం
గత వారం జరిగిన రేస్ టు ఫినాలే టాస్కులో విజయం సాధించడం ద్వారా నేరుగా ఫైనల్‌కు చేరుకున్నాడు అఖిల్ సార్థక్. దీంతో ఈ వారం మిగిలిన ఐదుగురిని నేరుగా నామినేట్ చేశాడు బిగ్ బాస్. వీళ్లందరూ టాస్కుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని సూచించాడు. అలాగే, బెస్ట్ పెర్ఫార్మర్ నేరుగా ఆడియెన్స్‌తో మాట్లాడొచ్చని ఆఫర్ ఇచ్చాడు.

టాస్కులు ఆడొద్దు.. జడ్జ్‌మెంట్ చేయాలి
ఐదుగురు సభ్యులు ఈ వారం నామినేషన్‌లో ఉండడంతో వాళ్లలో అఖిల్‌తో కలిసి టాప్ -5లో ఎవరు ఉంటారన్న దానిని ప్రేక్షకులే తమ ఓట్ల ద్వారా నిర్ణయించనున్నారు. నాలుగు స్థానాల కోసం వాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ కనిపిస్తోంది. దీంతో బిగ్ బాస్ సరికొత్త టాస్కులు ఇస్తున్నాడు. వాటికి అఖిల్ సార్థక్ సంచాలకుడిగా పని చేయాల్సి ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు.

ఓపిక టాస్కులో ఓపికగా కూర్చుని అలా
బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం వరుసగా టాస్కులు జరుగుతున్నాయి. మొదటి రౌండ్‌లో భాగంగా ‘కింగ్ ఆర్ క్వీన్' టాస్క్ జరగగా, అందులో ప్రతి కంటెస్టెంట్‌కు అఖిల్ సార్థక్ మంత్రిగా వ్యవహరించాడు. కింగ్ ఆర్ క్వీన్ అయిన వాళ్లను తనదైన సలహాలు ఇచ్చాడు. ఇక, రెండో రౌండ్ ‘ఓపిక' టాస్కులో సంచాలకుడిగా వ్యవహరించి, కంటెస్టెంట్లకు పాయింట్లు ఇచ్చాడు.

వాళ్ల మధ్య గొడవలతో రణరంగంగా టాస్క్
‘కింగ్ ఆర్ క్వీన్' టాస్క్ సోహెల్ - అఖిల్ - హారిక గొడవ మినహా మొత్తం బాగానే సాగింది. కానీ, ‘ఓపిక' టాస్క్ మొత్తం గొడవలతో సాగింది. ఇందులో మొదట ఆరియానా గ్లోరీ - మోనాల్ గజ్జర్ మధ్య వ్యక్తిగత దూషణలు జరిగాయి. ఫలితంగా ఇద్దరూ సుదీర్ఘంగా గొడవ పడ్డారు. ఆ తర్వాత సోహెల్ - ఆరియానా మధ్య భీకర యుద్ధం జరిగింది. ఒకానొక సందర్భంలో కొట్టుకునేంత వరకూ వెళ్లింది.

అఖిల్ సార్థక్‌కు భారీ షాకిచ్చిన బిగ్ బాస్
వరుస గొడవలతో బిగ్ బాస్ హౌస్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. వీటిలో అభిజీత్ ఎంతో హుందాగా కనిపించాడు. తన మార్క్ చూపిస్తూ మిగిలిన కంటెస్టెంట్లను టాస్కులో ఓడించే ప్రయత్నం చేసిన అతడు.. టాస్కులో జరిగిన గొడవలను కూడా బాగా ఆపగలిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సందర్భంలో అభిజీత్‌కు మద్దతు తెలిపిన బిగ్ బాస్.. అఖిల్ సార్థక్‌కు భారీ షాకిచ్చాడు.

దెబ్బకు రికార్డు క్రియేట్ చేసిన అభిజీత్
అసలేం జరిగిందంటే.. ఓపిక టాస్క్ కోసం అభిజీత్ కుర్చీ మీద కూర్చుని వెంటనే దిగిపోయాడు. రూల్ ప్రకారం అలా చేస్తే అతడు ఔట్ అయినట్లు. ఇదే విషయం అఖిల్.. బిగ్ బాస్‌కు గుర్తు చేశాడు. కానీ, ఆయన మాత్రం అస్సలు స్పందించలేదు. దీంతో అభి టాస్క్ కంటిన్యూ చేశాడు. అయితే, అతడు రికార్డు స్థాయిలో 27 సార్లు ఎక్స్‌ప్రెషన్స్ మార్చాడు. దీంతో అంతా నవ్వుకున్నారు.