‘నా జీవితంలో ఎందరో మగాళ్లు... పగలు రాత్రి అదే పని, హీరోలతో తట్టుకోలేం’
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ హిందీ 19 ఈ ఏడాది ఆగస్ట్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్‌తో షోను ప్రారంభించారు. వీరిలో నటీనటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్స్ తదితరులు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. జియో హాట్‌స్టార్, కలర్స్ టీవీలలో ఈ సీజన్ టెలికాస్ట్ అవుతోంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్‌లో ఎవరికి వారే ప్రత్యేకం.. వీరిలో సీనియర్ నటి, సింగర్ కునికా సదానంద మాత్రం తన గేమ్‌తో ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
రెండు సార్లు విడాకులు
కునిక సదానంద్ నటిగా, సింగర్‌గా, లాయర్‌గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తన సత్తా చాటుకున్నారు . 80వ దశకంలో విలన్, లేడీ కమెడియన్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించారు. అయితే సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితం, వివాదాలతోనే కునిక వార్తల్లో నిలిచారు. ఆమెకు రెండు సార్లు వివాహం జరగ్గా .. రెండు సార్లూ విడాకులు తప్పలేదు. తొలుత ఢిల్లీకి చెందిన అభయ్ అనే వ్యక్తితో కునిక వివాహం జరగ్గా ఈ దంపతులకు అరిహంత్ జన్మించారు. అభయ్‌తో విడిపోయిన తర్వాత లాల్ అనే వ్యక్తిని పెళ్లాడారు. ఈ దంపతులకు అయాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక కునిక రిలేషన్స్, ఎఫైర్స్ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. దిగ్గజ నటుడు ప్రాణ్ కుమారుడు సునీల్ సికంద్‌తో డేటింగ్ చేశారు. ఆ తర్వాత సింగర్ కుమార్ సానుతో రిలేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

క్యాస్టింగ్ కౌచ్‌పై వ్యాఖ్యలు
వైట్ ఇటాలియన్ కేఫ్, జింగ్‌కేఫ్ మెజిస్టికా, ది రాయల్ బాంక్వెట్ హాల్, ఎక్స్‌హేల్ స్పా వంటి వ్యాపారాలు నిర్వహిస్తూ వ్యాపారవేత్తగానూ సక్సెస్ అయ్యారు కునికా సదానంద్. కర్మ ఈవెంట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీని స్థాపించి దానిని లాభాల బాట పట్టించారు. గడిచిన 20 ఏళ్లుగా ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. 2005లో తారా ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి బడుగు బలహీన వర్గాల వారికి విద్య, వైద్యం అందిస్తున్నారు. మనసులో ఏమున్నా సరే కుండబద్ధలు కొట్టడం కునిక స్టైల్... ఈ విషయంలో ఎన్ని రూమర్స్ వచ్చినా ఆమె వెనక్కి తగ్గరు. బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సెట్‌లో లైట్‌మెన్లు కూడా హీరోయిన్‌లని అనుభవించాలి అన్నట్లుగా ఆకలితో ఉన్న సింహాల మాదిరిగా తిరిగే వారని బాంబు పేల్చారు.
ఆ పనితో బరువు పెరిగిపోయా
సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే కునిక సదానంద్ బిగ్‌బాస్ హిందీ 19లో అడుగుపెట్టడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. తొలి రోజు నుంచి తనదైన ఆటతో దూసుకెళ్తున్న కునిక.. ఇటీవల హౌస్‌లో ప్రణీత్ మోరే, గౌరవ్ ఖన్నా, మృదుల్ తివారీలతో ముచ్చట్లు పెట్టింది. ఈ సందర్భంగా వీరి మధ్య మద్యానికి బానిస కావడం, రిలేషన్స్, ఎఫైర్స్ గురించి డిస్కషన్ సాగింది. మీ జీవితంలో మంచి, చెడ్డ అలవాట్లను చెప్పమని మృదుల్ అడగ్గా... నేను జీవితంలో డ్రగ్స్ జోలికి వెళ్లలేదు, కానీ బీభత్సంగా మద్యం తాగే అలవాటుంది. బ్రేకప్స్ తర్వాత మానసికంగా కృంగిపోయే దానిని... మందు తాగి తాగి బరువు పెరిగిపోయా. స్టూడియోలో డబ్బింగ్ చెప్పడానికి వెళ్లి అద్దంలో నన్ను నేను చూసుకుని దేవుడా నేను ఇలా అయ్యానేంటీ అనుకున్నా అని కునిక తెలిపారు.
స్టార్స్‌తో డేటింగ్ వద్దు
బాధతో పగలు రాత్రీ తేడా లేకుండా మద్యం తాగడమే పనిగా ఉండేది, పట్టపగలే బీర్ సేవించా. నైట్ క్లబ్‌కి వెళ్లి తాగుతూ గడిపే దానిని. మరొకరి డబ్బుతో మందు తాగొద్దని నాన్న హెచ్చరించేవారు. నన్ను కొందరు డిన్నర్‌కి పిలిచేవాళ్లు. మంచి షాంపైన్ తెచ్చానని, చాలా కాస్ట్‌లీ అని ఊరించి మరింత తాగించేవాళ్లు. దాంతో తర్వాత డిన్నర్‌కు రానని ముఖం మీదే చెప్పేదాన్ని అని కునిక వెల్లడించారు. ఇదే సంభాషణల మధ్య మీకున్న రిలేషన్స్ గురించి చెప్పమని గౌరవ్ అడగటంతో.... ఇద్దరితో సహజీవనం చేశా, నలుగురితో రొమాన్స్ చేశా, ఇద్దరిని పెళ్లి చేసుకున్నా.. కానీ స్టార్స్‌తో మాత్రం డేటింగ్ చేయలేదు. హీరోలు అద్దంలో తమ ముఖాల్ని చూసుకుని మురిసిపోతారని అలాంటి వాళ్లని మనం తట్టుకోలేమని కుండబద్ధలు కొట్టారు కునిక. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











