Bigg Boss: బిగ్‌బాస్ షోలోకి మైక్ టైసన్.. ఇంటర్నేషనల్ కేటగిరిలో వరల్డ్ టాప్ బాక్సర్
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ హిందీ 19 సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆగస్ట్ 24న ఈ మెగా రియాలిటీ షో ప్రారంభం కానుంది. దీంతో కంటెస్టెంట్స్ ఎవరు? ఏ ఏ కేటగిరీలలో ఎవరెవరు? ఎంట్రీ ఇవ్వున్నారు? ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ప్రత్యేకతలు ఏంటీ? అంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ నిర్వాహకులు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరేనా?
బిగ్‌బాస్ హిందీ 19 సీజన్‌కు కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గడిచిన కొద్దిరోజులుగా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ రకరకాల పేర్లు వైరల్ అయ్యాయి. దీని ప్రకారం బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా, ఒకప్పటి బాలనటి అస్నూర్ కౌర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు భార్యాభర్తలైన అవెజ్ దర్బార్, నగ్మా మిరాజ్కర్, బషీర్ అలీ, అభిషేక్ బజాజ్, హునార్ హలే, షాఫాక్ నాజ్, సివెట్ తోమర్, ఖాంక్ వాఘ్నానీ, వీడియో గేమ్స్ డెవలపర్ పాయల్ ధారే, నిర్మాత జిషాన్ ఖాద్రీ, మృదుల్ తివారీల పేర్లు దాదాపు కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఫుల్ లిస్ట్ కోసం వెయిటింగ్
వీరితో పాటు ఇండియన్ ఐడల్ 5 విన్నర్, తెలుగు బిగ్‌బాస్ 5 రన్నరప్ శ్రీరామచంద్ర, బిగ్‌బాస్ మరాఠీ నుంచి ఆర్బాజ్ పటేల్, నిధి షా, ప్రియా రెడ్డి, సిదే మౌట్, సామాజిక కార్యకర్త అతుల్ కిషాన్, న్యాయవాది అలీ ఖాసిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎంత మందికి అవకాశం దక్కుతుంది? ఈ లిస్ట్ కరెక్టేనా? కొత్త జాబితా తెరపైకి వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ఆగస్ట్ 24న సాయంత్రం 9 గంటలకు బిగ్‌బాస్ హిందీ 19 టెలికాస్ట్ కానుంది. జియో హాట్‌స్టార్, కలర్స్ టీవీలో బిగ్‌బాస్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది.
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మైక్ టైసన్
ఇదిలాఉండగా.. ఈసారి బిగ్‌బాస్ హిందీ 19 సీజన్‌లో ఓ ఇంటర్నేషనల్ సెలబ్రెటీ కూడా కంటెస్టెంట్‌గా అడుగుపెట్టనున్నట్లుగా గత కొద్దిరోజుల నుంచి మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఎవరో కాదు లెజండరీ బాక్సర్, నటుడు మైక్ టైసన్. ఆయనతో బిగ్‌బాస్ నిర్వాహకులు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం లేదా 10 రోజుల్లో మైక్ టైసన్ ఎంట్రీ ఉండే ఛాన్స్‌లు ఉన్నాయని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
టైసన్ ఎంట్రీతో మారిపోనున్న లెక్కలు
అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. బిగ్‌బాస్ హిందీ ప్రారంభమైన ఇన్నేళ్లలో మైక్ టైసన్ వంటి ఇంటర్నేషనల్ సెలబ్రెటీ ఈ రియాలిటీ షోలో పాల్గొన్న తొలి వ్యక్తి కానున్నారు. అదే జరిగితే బిగ్‌బాస్‌పై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైక్ టైసన్‌తో హౌస్‌లో వాగ్వాదాలు, పనులు, గొడవలు పడాలంటే ఎంత ధైర్యం ఉండాలి? మరి ఆ ధైర్యం ఎవరు చేస్తారు? అతనితో పోరాడటం అంత తేలిక కాదన్న విషయం తెలిసిందే. మరి టైసన్ ఎంట్రీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











