twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stop Final List.. అషు రెడ్డి, సరయూ..ఇంకా హాట్ హాట్ సెలబ్రిటీలు ఎంట్రీ..ఎప్పటి నుంచి స్ట్రీమింగ్

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు సంబంధించిన సరికొత్త కార్యక్రమం ఓటీటీలో ప్రారంభానికి రంగం సిద్దమవుతున్నది. డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ అయ్యే బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతున్నది. అయితే ఈ షోకు సంబంధించిన ఫార్మాట్, సెలబ్రిటీల ఎంపిక వివరాల గురించి సోషల్ మీడియాలోను, వెబ్‌ మీడియాలోను రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా నిర్వాహకులు రూపొందించిన ఫైనల్ జాబితా గురించిన వివరాల్లోకి వెళితే..

    9 మంది బిగ్‌బాస్ సెలబ్రిటీలు..

    9 మంది బిగ్‌బాస్ సెలబ్రిటీలు..

    తెలుగు బుల్లితెరపై మొట్టమొదటి బిగ్‌బాస్ ఓటీటీ షోకు సెలబ్రిటీల ఎంపిక ఇంట్రెస్టింగ్‌గా చేశారు. ఇప్పటి వరకు కొనసాగిన బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ల నుంచి 9 మంది టాప్ కంటెస్టెంట్లను ఎంపిక చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. మరో తొమ్మితి మందిని నాన్ బిగ్‌బాస్ సెలబ్రిటీల ఎంపిక కోసం సినీ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ల్ఫూయన్సర్లను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.

    ఓటీటీలోకి బిగ్‌బాస్ మాజీ సెలబ్రిటీలు

    ఓటీటీలోకి బిగ్‌బాస్ మాజీ సెలబ్రిటీలు

    ప్రస్తుతం ఓటీటీలో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో కోసం గత బిగ్‌బాస్‌లో తమదైన శైలిలో రాణించి.. ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్న సెలబ్రిటీల్లోని కొందరిని సెలెక్ట్ చేశారు. వారిలో సీజన్ 1లో ఆకట్టుకొన్న ముమైత్ ఖాన్, సీజన్ 2లో టాప్ సెలబ్రిటీ తేజస్వి మదివాడ, సీజన్ 3 సెలబ్రిటీ అషురెడ్డి, మహేష్ విట్టా, బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొన్న అరియానా గ్లోరి, అఖిల్ సార్థక్, సీజన్ 5లోని హమీదా, సరయూ, నటరాజ్ మాస్టర్ తదితరులు ఉన్నారు.

    నాన్ బిగ్‌బాస్ సెలబ్రిటీల లిస్టు ఇదే..

    నాన్ బిగ్‌బాస్ సెలబ్రిటీల లిస్టు ఇదే..


    ఇక నాన్ బిగ్‌బాస్ సెలబ్రిటీల విషయానికి వస్తే.. వర్మ చిత్రంలో నటించిన శ్రీ రాపాక, యాంకర్ స్రవంతి చొక్కారపు, యువ హీరో అజయ్ కథుర్వార్, స్పోర్ట్స్ యాంకర్ వింధ్యా మేడపాటి, యాంకర్ మౌనికా రెడ్డి, యాంకర్ వర్ష, అనిల్ రాథోడ్, ఆర్జే చైతూ, సిరి హన్మంతు బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

    క్వారంటైన్‌లో సెలబ్రిటీలు

    క్వారంటైన్‌లో సెలబ్రిటీలు


    అయితే బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లోకి అడుగు పెట్టే సెలబ్రిటీలను ఇప్పటికే క్వారంటైన్‌లోకి తరలించారు. ప్రముఖ హోటల్‌లో వారికి బస ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 26వ తేదీన వారిని ఇంటిలోకి పంపే ముందు కోవిడ్ నిర్ణారణ పరీక్షలు చేస్తారు. కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని ఓటీటీ షోలోకి పంపిస్తారు. లేకపోతే స్టాండ్‌బైలో ఉంచిన సెలబ్రిటీల్లోంచి కొందరిని బిగ్‌బాస్ షోలోకి పంపించే ఏర్పాట్లు చేశారు.

    Recommended Video

    Bigg Boss OTT Telugu : Contestants List Updates, Starting Date | Filmibeat Telugu
    84 రోజులపాటు ఏకధాటిగా

    84 రోజులపాటు ఏకధాటిగా

    బిగ్‌బాస్ నాన్ స్టాప్‌కు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తారు. దాదాపు ఓటీటీ షో 84 రోజులు కొనసాగుతుంది. గతంలో మాదిరిగా వారానికి రెండు రోజులు కాకుండా ఒకే రోజు హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు, బుల్లితెర ప్రేక్షకులకు కనిపిస్తారని తెలిసింది. అయితే ఓపెనింగ్ వేడుక కోసం భారీగా సెట్స్‌ను ముస్తాబు చేస్తున్నారు. కనివినీ ఎరుగని రీతిలో సినీ తారలు వేదికపై హంగామా చేసేందుకు సిద్దమవతున్నారు.

    English summary
    Bigg Boss Non Stop promising 24/7 entertainment, direct from the Bigg Boss house, only on Disney+ Hotstar. Here is the Bigg Boss Non Stop show's Contestants final List.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X