Just In
- 3 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 5 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే టైమింగ్‌లో మార్పులు: ఆ భయంతోనే స్టార్‌మా ఈ సంచలన నిర్ణయం
తెలుగు బుల్లితెరపై రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ సంచలనంగా మారింది బిగ్ బాస్ షో. సరికొత్త కంటెంట్‌తో ప్రసారం అవుతున్నప్పటికీ.. మన ప్రేక్షకులు దీన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. ఈ కారణంగా వరుసగా మూడు సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఈ క్రమంలోనే నాలుగోది కూడా ఘనంగా ముగించబోతుంది. దాదాపు 105 రోజుల పాటు సాగిన నాలుగో సీజన్ ఆదివారంతో ముగియనుంది. ఈరోజే విన్నర్‌ను ప్రకటించబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రాండ్ ఫినాలే టైమింగ్ విషయంలో బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

ఫినాలేకు ఐదుగురు.. ఇద్దరు అవుట్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా అందులో దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్, అభిజీత్, అఖిల్ సార్థక్‌లు మాత్రమే ఫినాలేలో అడుగు పెట్టారు. వీళ్లలో లేడీ కంటెస్టెంట్లు ఇద్దరికే తక్కువ ఓట్లు పోలయినట్లు తెలుస్తోంది. ఫలితంగా హారిక, ఆరియానా చివరి స్థానాల్లో నిలిచి ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారని సమాచారం.

అందులో వాళ్లకు మరోసారి పరాభవం
మొదటి సీజన్‌ను శివ బాలాజీ, రెండో దానిని కౌశల్ మండా, మూడో సీజన్‌ను రాహుల్ సిప్లీగంజ్ గెలుచుకున్నారు. అంటూ మూడు సార్లు మగవాళ్లే విజేతలుగా నిలిచారు. దీంతో ఈ సారి లేడీ కంటెస్టెంట్‌కు గెలిచే అవకాశం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, టాప్ -5లో నిలిచిన దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీ ఎలిమినేట్ అవడంతో ఆడవాళ్లకు మరోసారి నిరాశే ఎదురైంది.

విజేత ఏకగ్రీవం... రన్నరప్ కోసం ఫైట్
ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడంతో టైటిల్ ఫైట్‌లో సయ్యద్ సోహెల్ రియాన్, అభిజీత్, అఖిల్ సార్థక్‌లు మాత్రమే మిగిలారు. వీరిలో బయట ఫాలోయింగ్ ప్రకారం.. మిస్టర్ కూల్ విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఇదే ఫిక్స్ అని అంతా భావిస్తున్నారు. ఇక, రన్నరప్‌గా నిలిచేందుకు ఇద్దరు స్నేహితులు పోటీ పడుతున్నట్లు అయింది.

ఫినాలేకు ఆయనే గెస్ట్... మరికొందరు
ఆదివారం సాయంత్రం జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం గెస్టుగా ఎవరు వస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సీజన్‌కు కూడా మెగాస్టార్ చిరంజీవే రాబోతున్నారని రెండు రోజుల క్రితం ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆయనతో పాటే లక్ష్మీ రాయ్, మెహ్రీన్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయనున్నారు. అలాగే, థమన్ లైవ్ మ్యూజిక్ షో ఇవ్వనున్నాడు.

గ్రాండ్ ఫినాలే టైమింగ్‌లో మార్పులు
ఎప్పటిలా కాకుండా ఈ సారి బిగ్ బాస్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు. ఈ సీజన్ మొత్తం అదే కంటిన్యూ చేసిన ఆయన.. ఫినాలే విషయంలోనూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి ఫినాలే షూటింగ్ కంటిన్యూగా చేస్తారు. కానీ, ఈ సారి మాత్రం రెండు పార్టులుగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే శనివారం మొదటి భాగం షూట్ చేసేశారు.

ఆ భయంతోనే ఈ సంచలన నిర్ణయం
గత సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ షో గురించి ఎక్కువగా లీకులు వస్తున్నాయి. లోపల ఏం జరిగినా క్షణాల్లో బయటకు వచ్చేస్తుంది. ఈ విషయంలో భయపడిన నిర్వహకులు.. ఫినాలే టైమింగ్‌ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే శనివారం ఒక పార్ట్.. ఆదివారం సాయంత్రం మరో పార్ట్ చిత్రీకరించనున్నారని సమాచారం. దీంతో విజేత ఎవరో ముందే తెలిసే అవకాశం ఉండదు.