Just In
- 24 min ago
చివరి నిమిషంలో లెక్కలు మార్చిన వకీల్ సాబ్.. ఒక్కసారిగా పెరిగిన రేటు.. మంచి. లాభమే!
- 1 hr ago
బాక్సాఫీస్ ఫైట్: అల్లుడు అదుర్స్ vs రెడ్.. థియేటర్స్ కోసం గొడవలు.. చివరికి ఎంత రాబట్టారంటే?
- 1 hr ago
RED Movie Day 1 Collections: రికార్డు స్థాయిలో వసూల్ చేసిన రామ్.. ఫస్ట్ డే ఎంత రాబట్టాడంటే!
- 2 hrs ago
అభిజీత్‌కు రోహిత్ శర్మ కానుక: ఏకంగా ఆస్ట్రేలియా నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన టీమిండియా క్రికెటర్!
Don't Miss!
- News
పార్లమెంట్ భేటీకి ముహూర్తం ఫిక్స్: బడ్జెట్ ఎప్పుడంటే?: పేపర్ లెస్..నిర్మలమ్మ స్పెషాలిటీస్
- Finance
విలువలేదు: బిట్ కాయిన్, టెస్లా జంప్‌పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
- Sports
బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్‌కు రోహిత్ శర్మ గిఫ్ట్!
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : అన్ని చింతలు మరిచిపోయి, ఈరోజు పూర్తిస్థాయిలో ఆస్వాదించాలి...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సోహెల్‌కు నాగార్జున డబుల్ ధమాకా.. మానవత్వం చాటుకొన్న మన్మధుడు.. కాళ్లు మొక్కిన మెహబూబ్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో సయ్యద్ సోహెల్ ర్యాన్ టాప్ 4 కంటెస్టెంట్‌గా రికార్డులోకి ఎక్కాడు. భారీ ప్యాకేజ్‌తో స్వచ్ఛందంగా ఇంటి నుంచి బయటకు వచ్చిన సోహెల్‌కు వేదిక మీద హోస్ట్ నాగార్జున డబుల్ షాకిచ్చారు. వేదికపై నాగార్జున ఇచ్చిన షాకేమిటి అంటే..

25 లక్షల రూపాయలతో సోహెల్ బయటకు
ఇంటి నుంచి టాప్ 3 కంటెస్టెంట్‌గా సోహెల్ సయ్యద్ 25 లక్షల రూపాయల ఆఫర్‌తో వేదిక మీదకు వచ్చాడు. అయితే తన సోదరుడు చెప్పినట్టుగా కాకుండా అనాధలకు 10 లక్షలు ఇవ్వడం లేదు. అనాధలకు రూ.5 లక్షల రూపాయలు ఇస్తాను. మిగితా 5 లక్షల రూపాయలను నా స్నేహితుడు మెహబూబ్ దిల్ సే ఇంటి నిర్మాణానికి ఇస్తాను అంటూ సోహెల్ చెప్పాడు.

సెంటిమెంట్‌తో కొట్టిన మోహబూబ్, సోహెల్
అయితే సోహెల్ ప్రతిపాదనను మెహబూబ్ తిరస్కరించాడు. తనకు ఇస్తానన్న 5 లక్షల రూపాయలను కూడా నా తరఫున అనాధ శరణాలయానికి ఇస్తాను అంటూ మెహబూబ్ ప్రకటించాడు. దాంతో అందరూ చప్పట్లుకొట్టి స్వాగతించారు. వారి నిర్ణయాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

మోహబూబ్ ఎమోషనల్‌గా
లాక్‌డౌన్ సమయంలో ఎందరో అనేక కష్టాలకు గురయ్యారు. కాబట్టి మనకు లభించిన ఈ డబ్బును ఆపదలు, కష్టాల్లో ఉన్న వారికి అందిస్తాం. సమస్యల్లో ఉన్న వారిని ఆదుకొనేందుకు ఉపయోగిద్దాం అంటూ మోహబూబ్ భావోద్వేగంతో తన మనసులో మాటను చెప్పారు.

నాగార్జున 10 లక్షల విరాళం
అయితే సోహెల్, మెహబూబ్ దిల్ సే మధ్య ప్రేమ, స్నేహం, సహాయం చేసే గుణం చూసిన హెస్ట్ నాగార్జున స్పూర్తిగా తీసుకొన్నారు. ఇద్దరికి సంబంధించిన 10 లక్షలు వారే ఉంచుకోవాలి. సోహెల్ తన ఇంటికి 25 లక్షల రూపాయలను తీసుకెళ్లాలి. నా తరఫున వారికి చెరో ఐదు లక్షల రూపాయలను ఇస్తాను అంటూ నాగార్జున ఎమోషనల్ అయ్యాడు.

నాగ్ కాళ్లకు మొక్కిన మోహబూబ్, సోహెల్
హెస్ట్ నాగార్జున 10 లక్షల రూపాయలను ఇస్తామని చెప్పడంతో సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. నాగ్‌ను అమాంత కౌగిలించుకొన్నారు. మెహబూబ్ వేదిక మీదకు వచ్చి నాగ్ కాళ్లకు మొక్కాడు. ఆ తర్వాత సోహెల్ కూడా నాగ్ కాళ్లకు మొక్కడం జరిగింది.

సోహెల్ 35 లక్షల రూపాయలతో
ఇంటి నుంచి సోహెల్ కేవలం 25 లక్షల రూపాయలే కాదు.. మొత్తం 35 లక్షల రూపాయలు తీసుకెళ్తున్నాడు. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. వారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. వారిద్దరిని చూస్తే, వారి ఇద్దరి మధ్య ఉన్న స్నేహం చూస్తే నాకు ఇన్సిపిరేషన్ కలిగింది అంటూ నాగార్జున ఎమోషనల్ అయ్యాడు.

టాప్ 3 కంటెస్టెంట్‌గా సోహెల్ జర్నీ క్లోజ్
టెలివిజన్, సినీ నటుడిగా గుర్తింపు పొంది బిగ్‌బాస్ ఇంటిలోకి సాధారణ సెలబ్రిటీగా సోహెల్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత తన త్యాగాలు, స్నేహభావంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొన్నాడు. బిగ్‌బాస్‌లో టాప్ 3 కంటెస్టెంట్‌గా సోహెల్ తన ప్రయాణాన్ని ముగించాడు.