అతడిపై ముద్దుల వర్షం కురిపించిన మోనాల్.. కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు

బిగ్‌బాస్ రియాలిటీ షోలో 72వ రోజున లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ కోసం గేమ్స్ జరిగాయి. ఈ గేమ్ కోసం అందరూ మిలటరీ కమాండెంట్స్‌గా మారారు. మిలటరీ దుస్తులు ధరించి ఇంటిలో కవాతు, ఇతర ప్రదర్శనలు చేశారు. అలాగే ఇంటిలో ఇంకా ఏం జరిగిందంటే...

కమాండర్స్‌గా ఇంటి సభ్యులు

కమాండర్స్‌గా ఇంటి సభ్యులు

కమాండెంట్ టాస్క్ సందర్భంగా ఇంటి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అఖిల్ బిగ్ బాస్ దళానికి నాయకుడిగా వ్యవహరించారు. కవాతు చేస్తున్న సమయంలో బజర్ మోగగానే లాన్ ఉన్న లైట్‌ను చేతితో తాకాలి. ఈ గేమ్‌లో ఇంటి సభ్యులందరూ పాల్గొన్నారు.

గేమ్‌లో సోహైల్ ఫెయిల్

గేమ్‌లో సోహైల్ ఫెయిల్

కవాతు చేస్తున్న సమయంలో బజర్ మోగగానే మొదటి ప్రయత్నంలో సోహెల్ లైట్‌ను కొట్టేశాడు. దాంతో గేమ్‌లో పాల్గొనే అవకాశం లభించింది. వెయిట్స్‌ను స్విమ్మింగ్ ఫూల్ ఒక వైపు నుంచి మరో వైపుకు చేరవేయాలి. 5 నిమిషాల్లో వెయిట్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఈ గేమ్‌లో సోహైల్ సక్సెస్ కాలేకపోయాడు.

పోల్ గేమ్‌లో అఖిల్

పోల్ గేమ్‌లో అఖిల్

ఇక మూడో బజర్ మోగగానే అఖిల్ పరుగెత్తి లైట్‌ను కొట్టేశాడు. అభిజిత్ వెంట్రుక వాసిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఇక గేమ్‌లో భాగంగా ఓ పోల్‌నుపట్టుకొని ఉండాలి. బిగ్‌బాస్ ఆదేశం వచ్చే వరకు అఖిల్ అలానే ఉండాలి. ఈ గేమ్‌లో అఖిల్ విజయం సాధించాడు.

అభిజిత్‌ విజయం సాధించి

అభిజిత్‌ విజయం సాధించి

ఇక రెండోసారి బజర్ మోగగానే అభిజిత్‌ లైట్‌ను కొట్టేశాడు. దాంతో మంకీ బార్ గేమ్‌ను ఎంచుకొన్నారు. పది నిమిషాలపాటు అభిజిత్ ఆ బార్‌కు వేలాడాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో అభిజిత్ 10 నిమిషాలు వేలాడటంతో విజయం సాధించాడు.

చివరి రౌండ్‌లో హారిక సక్సెస్

చివరి రౌండ్‌లో హారిక సక్సెస్

ఇక చివరి రౌండ్‌లో బజర్ మోగగానే హారిక వేగంగా పరుగెత్తుకెళ్లి లైట్‌ను కొట్టేసింది. దాంతో ఆమె టైర్‌ను దొర్లించే గేమ్‌ను ఎంచుకొన్నారు. 15 నిమిషాల్లో 10 రౌండ్లు లాన్‌లో టైర్‌ను దొర్లించాలి. ఈ గేమ్‌లో హారిక విజయం సాధించారు.

కెప్టెన్సీ రేసులో ముగ్గురు

కెప్టెన్సీ రేసులో ముగ్గురు

ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ గేమ్‌లో విజయం సాధించిన ముగ్గురిని కెప్టెన్సీ టాస్క్‌ కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. రేపు జరిగే కెప్టెన్సీ టాస్క్‌లో అభిజిత్, హారిక, అఖిల్ పోటీ పడనున్నారు. ఈ గేమ్‌ మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది.

Recommended Video

Cheppina Evvaru Nammaru Lyrical Song Launch
పుట్టిన రోజు వేడుకల్లో అఖిల్‌కు మోనాల్ ముద్దులు

పుట్టిన రోజు వేడుకల్లో అఖిల్‌కు మోనాల్ ముద్దులు

ఇదిలా ఉండగా, ఇంటిలో అఖిల్ జన్మదిన వేడుకలు జరిగాయి. లాస్య తయారు చేసిన కేక్‌ను కట్ చేసి మోనాల్‌కు తినిపించాడు. ఆ తర్వాత లాన్‌లో కూర్చొని మోనాల్‌తో మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత అఖిల్ వెళ్లి పోతూ మోనాల్‌ను కౌగిలించుకొన్నాడు. దాంతో బుగ్గలపై మోనాల్ ముద్దుల వర్షం కురిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X