బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. తొమ్మిది మందిలో ఎవరు అవుట్ అంటే..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఐదోవారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారబోతున్నది. ప్రస్తుత వారంలో మొత్తం తొమ్మిది మంది సభ్యులు నామినేషన్‌లోకి వచ్చారు. అయితే ఇంత మందిని నామినేషన్ ప్రక్రియలోకి తీసుకురావడంతో ఈ వారం డబుల్ నామినేషన్ తప్పదనే ఊహగానాలు మొదలవుతున్నాయి. అయితే ఈ వారం ఎవరు ఇంట్లోని నుంచి బయటకు వెళ్తున్నారు. డబుల్ నామినేషన్ ఉంటుందా అనే విషయానికి వస్తే...

ఐదోవారం నామినేషన్‌లో 9 మంది
ఐదోవారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం జరిగిన నామినేషన్‌లోకి మొత్తం తొమ్మిది మందిని బిగ్‌బాస్ లాగేశారు. అభిజిత్, అఖిల్, యాంకర్ లాస్య, సోహైల్, మోనాల్ గజ్జర్, హారిక, అరియానా, అమ్మా రాజశేఖర్, జోర్దార్ సుజాత నామినేట్ అయ్యారు. అయితే భారీ సైజులో నామినేషన్ జరిగినందున డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ఊహగానాలు మొదలయ్యాయి. తాజా వార్తల ప్రకారం ఇంటిలో డబుల్ నామినేషన్ ఉండే ప్రస్తక్తి లేదనే విషయం స్పష్టమైంది.

టాస్కుల విసయంలో పేలవంగా
ఇంటిలో టాస్కుల విషయంలో కొందరు పేలవమైన పెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శిస్తున్నారనే వాదన ప్రేక్షకుల్లో నెలకొంది. ముఖ్యంగా సుజాత, అమ్మా రాజశేఖర్, దివి, లాస్య పెర్ఫార్మెన్స్‌పై చాలా మంది పెదవి విరుస్తున్నారు. అయితే కొన్ని విషయాల్లో కంటెంట్ పరంగా అమ్మా రాజశేఖర్, లాస్య, దివి ఫర్వాలేదనే విషయం తాజా ఎపిసోడ్స్‌లో స్పష్టమైంది.

అత్యధిక ఓట్లు సాధించిన అభిజిత్
అయితే శుక్రవారం రాత్రి వరకు జరిగిన ఓటింగ్ ప్రక్రియ ప్రకారం అభిజిత్ అత్యధిక ఓట్లతో అంటే దాదాపు 30 శాతం ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే రెండో స్థానంలో అఖిల్ సార్థక్ 10 నుంచి 20 శాతం మధ్య ఓట్లను సాధించారనేది తాజా సమాచారం. ఆ తర్వాత నాలుగు, ఐదు స్థానాల్లో యాంకర్ లాస్య, సోహైల్ సయ్యద్ ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ వారం ఓటింగ్ సరళిని బట్టి వీరిద్దరికి 10 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయనే విషయం తెలిసింది.

అత్యల్పంగా సాధించిన సుజాత, మోనాల్, అమ్మా
ఇక తొమ్మిది మందిలో అత్యల్ప ఓటింగ్‌ను సాధించిన వారిలో మోనాల్ గజ్జర్, అమ్మా రాజశేఖర్, సుజాతలు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఈ ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నప్పటికీ.. మోనాల్ కాస్తా ఇద్దరికంటే మోనాల్ కొంచెం మెరుగుగా ఓటింగ్ సాధించారనే విషయం బయటకు వచ్చింది. అయితే అందరి కంటే తక్కువగా సుజాతకు ఓటింగ్ జరిగినట్టు సమాచారం. అయితే ఈ ఓటింగ్ కేవలం హాట్ స్టార్ యాప్ నుంచి వచ్చిన ఓట్లు మాత్రమే. అయితే ఇంకా మిస్డ్ కాల్ డేటాను కలిపితే ఎలిమినేషన్ తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదనే విషయాన్ని పరిశీలకులు భావిస్తున్నారు.
Recommended Video

ఆ ఇద్దరిపై వేలాడుతున్న ఎలిమినేషన్ కత్తి
ఏది ఏమైనప్పటికీ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే చివరి స్థానాల్లో నిలిచిని అమ్మా రాజశేఖర్, సుజాతలపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నది. గత కొద్దికాలంగా సుజాత ఆట తీరు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న క్రమంలో ఆమె గానీ, అమ్మా రాజశేఖర్ గానీ బయటకు వెళ్లే అవకాశం ఉంది. కొద్ది గంటల్లోనే ఎవరు బయటకు వెళ్తారనే విషయం స్పష్టం కానున్నది.


Click it and Unblock the Notifications











