Just In
- 1 hr ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- News
కరోనా అప్డేట్ : తెలంగాణలో కొత్తగా 267 కేసులు... దేశంలో కొత్తగా 13,823 కేసులు
- Automobiles
రోడ్లపై గుంతలు పూడ్చే ప్రత్యేక యంత్రం.. నిజంగా సూపర్ గురూ
- Sports
ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టిన టీమిండియా.. నెం.1లో న్యూజిలాండ్!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్‌కు రేటింగ్ షాకింగ్‌గా.. డైలీ సీరియల్స్ కంటే దారుణంగా.. ప్రసార వేళల మార్పు!
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నదనే విషయం అందరి నోట నానుతున్న సంగతి తెలిసిందే. తాజాగా షో ప్రసారమయ్యే వేళలు మార్చడంతో ఆ వాదనకు మరింత బలం చేకూరుతున్నది. బిగ్‌బాస్ ప్రసారమయ్యే వేళల మార్పు ఇప్పుడు తెలుగు టెలివిజన్ రంగంలో చర్చనీయాంశమైంది. బిగ్‌బాస్ షో వేళలను ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రేక్షకాదరణ లేని సెలబ్రిటీలతో
బిగ్‌బాస్ తెలుగు షో 4 విషయానికి వస్తే.. గత సీజన్లతో పోల్చుకొంటే నిస్తేజంగా సాగుతున్నది. కరోనావైరస్ కారణంగా ఫిజికల్ టాస్కులను తగ్గించడం, అలాగే పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు లేకపోవడం దెబ్బ కొట్టింది. ప్రస్తు సీజన్‌లో టెలివిజన్ రంగంలోని ఔత్సాహికులు, యూట్యూబ్ స్టార్లను తెరపైకి తీసుకురావడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు.

వారం రోజులు డల్‌గా.. వీకెండ్‌లో టాప్‌గా
గత బిగ్‌బాస్ సీజన్లను పరిశీలిస్తే.. వారం రోజులపాటు సాగే ఎపిసోడ్‌లకు అనూహ్యమైన స్పందన కనిపించింది. బలమైన సెలబ్రిటీలు ఉండటమే అందుకు కారణం కారణమైంది. అయితే బిగ్‌బాస్ తెలుగు 4 విషయానికి వస్తే.. వారం రోజులపాటు సాగే ఎపిసోడ్స్‌కు రేటింగ్ దారుణంగా నమోదు అవుతున్నది. అయితే వీకెండ్‌లో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించే ఎపిసోడ్స్‌కు మంచి రేటింగ్ రావడం కొంత ఉపశమనంగా మారిందనేది తాజా సమాచారం.

కార్తీకదీపం కంటే తక్కువగా రేటింగ్
ఇక బిగ్‌బాస్ రేటింగ్ విషయానికి వస్తే అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న కార్తీకదీపం సీరియల్‌తో పోటీ పడలేకపోతుందనే విషయం తాజా గణాంకాల్లో స్పష్టమైంది. కార్తీకదీపం కంటే తక్కువ రేటింగ్ రావడంతో బిగ్‌బాస్ షో ప్రసార వేళలను మార్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.

బిగ్‌బాస్ ప్రసార వేళల మార్పు
ప్రతీ రోజు 9.30 గంటలకు ప్రసారమమయ్యే బిగ్‌బాస్ తెలుగు 4ను రాత్రి 10 గంటలకు షిఫ్ట్ చేసి.. దాని స్థానంలో వదినమ్మ సీరియల్స్‌ను తెరపైకి తెచ్చారు. ఇక వదినమ్మ ప్రసారమయ్యే 7 గంటల స్లాట్‌లో కొత్త సీరియల్‌ను ప్లేస్ చేస్తున్నాట్టు నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.

10 గంటల తర్వాత ప్రసారమైతే..
ఇప్పటికే అరకొర రేటింగ్‌తో ముందుకెళ్తున్న బిగ్‌బాస్ తెలుగు 4కు సంబంధించి వేళలు మార్చడంతో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 10 గంటల తర్వాత ప్రసారమయ్యే ఈ షోను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.