Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నీతో ఎమోషనల్ ఇష్యూస్.. నీ గేమ్ నీది.. నా గేమ్ నాది.. మోనాల్‌కు అఖిల్ గుడ్ బై
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో 78 రోజు హైడ్రామా నడిచింది. నామినేషన్ల ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య వాదనలు హోరాహోరీగా జరిగాయి. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసిందనుకొన్న ప్రేక్షకులకు బిగ్‌బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చాడు. 78వ రోజు ఇంకా ఏం జరిగిందంటే..

అవినాష్ అంకుల్.. అరియానా అంటీ
ఇంటిలో అవినాష్‌ను అరియానా టీజ్ చేసింది. షర్టు వేసుకొంటే అంకుల్‌లా ఉన్నావు అంటూ కామెంట్ చేసింది. అందుకు నేను అంకుల్ కాదు.. నీవే అంటీవి అంటూ అవినాష్ సెటైర్ వేశారు. ఆ ఇద్దరు అలా వాదించుకొంటుండగా అఖిల్, సోహెల్ మధ్యలో దూరారు. ఆ సందర్భంగా అవినాష్ అంకులే.. రెండు పెళ్లిళ్లు అయ్యాయంటూ సోహైల్ అనడంతో.. ఇన్ని రోజులు ఫ్రెండ్ షిప్ చేసింది అంకుల్‌తోనా అంటూ అరియానా అనడంతో వారి వాదన ఫన్‌గా సాగింది.

నీతో నేను డిస్టెన్స్ మెయింటెన్ చేస్తా
ఇక నామినేషన్ డే కావడంతో అఖిల్, మోనాల్ మధ్య ఎమోషనల్‌గా చర్చ జరిగింది. నీతో ఉండటం వల్ల నాకు ఎమోషనల్ ఇష్యూస్ వస్తున్నాయి. వాటిని భరించలేకపోతున్నాను. కాబట్టి నీతో డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని అనుకొంటున్నాను. నీ గేమ్ నీది.. నా గేమ్ నాది అంటూ మోనాల్‌కు అఖిల్ క్లియర్ చేశాడు.

తెరపైకి స్వాపింగ్ ప్రక్రియ
ఇక నామినేషన్ ప్రక్రియలో టోపీల గేమ్‌లో అఖిల్, అవినాష్, అరియానా, అభిజిత్ బుక్కయ్యారు. వారు ధరించిన టోపీల కింద రెడ్ కలర్ ఉండటంతో నామినేట్ అయినట్టు ప్రకటించారు. అయితే స్వాపింగ్ చేసుకొమని సూచించగా నామినేట్ అయిన సభ్యులు సోహైల్, మోనాల్‌ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయగా, అవి విఫలమయ్యాయి.

మోనాల్‌ను అభిజిత్ స్వాప్ చేసిన హారిక
ఇక నామినేషన్ ప్రక్రియలో బిగ్‌బాస్ ట్విస్టు ఇచ్చారు. కెప్టెన్ హారికకు అధికారం ఇస్తూ.. ఒకరిని నామినేషన్ నుంచి స్వాప్ చేయమని సూచించారు. దాంతో అఖిల్‌ను మోనాల్‌తో స్వాప్ చేయడంతో మోనాల్ అనూహ్యంగా నామినేట్ అయింది.

12వ వారంలో నామినేట్ అయింది వీరే
చివరకు నామినేషన్ల ప్రక్రియను బిగ్‌బాస్ ముగిస్తూ.. 12వ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన వ్యక్తులను ప్రకటించారు. అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ నామినేట్ అయినట్టు ప్రకటించారు. దాంతో నామినేషన్ల ప్రక్రియను ముగిసింది.