Just In
- 25 min ago
‘ఢీ’లో అలాంటి వ్యవహారాలా?.. కంటెస్టెంట్లతో మాస్టర్ల అఫైర్స్.. బయటపెట్టేసిన సుమ
- 37 min ago
వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుక: ‘F3’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన వెంకటేష్
- 47 min ago
Box office: 5వ రోజు రెడ్, అల్లుడు అదుర్స్ కలెక్షన్స్.. రామ్ టార్గెట్ ఫినిష్.. ఇంకా పైకిరాని బెల్లంకొండ
- 55 min ago
కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం: బడా నిర్మాణ సంస్థతో నందమూరి హీరో బిగ్ మూవీ
Don't Miss!
- News
అమరావతిపై జగన్ సర్కారుకు భారీ షాక్- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ కొట్టేసిన హైకోర్టు
- Sports
Brisbane Test: పంత్ హాఫ్ సెంచరీ.. విజయం దిశగా భారత్!! కొట్టాల్సింది 59 పరుగులే!
- Automobiles
కొత్త హోండా వెజెల్ ఎస్యూవీ టీజర్ విడుదల
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్ల భారీ జంప్, రిలయన్స్ రూ.2000 మార్క్ క్రాస్
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మోనాల్ గజ్జర్‌తో ఆ ఇద్దరి డేటింగ్ వ్యవహారం.. కంటతడి పెట్టిన అభిజిత్
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొంటున్న సమయంలో కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ట్విస్టుల మీదు ట్విస్టులు, షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా 80వ రోజు ఎపిసోడ్‌లో మోనాల్ గజ్జర్ తీసుకొచ్చి అఖిల్, అభిజిత్‌ను మళ్లీ ఇరికించే ప్రయత్నం చేశారు. 80వ రోజు ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో అసలు ఏం జరిగిందంటే..

శ్మశాన వాటికలో మోనాల్‌తో డేటింగ్
ఇంటిని శ్మశాన వాటికగా మార్చిన బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్‌ను ఇచ్చారు. టాస్క్ గురించి చెబుతూ పంపిన లేఖను సోహెల్ చేతిలో పెట్టారు. లేఖ ప్రకారం.. అఖిల్, అభిజిత్ ఇద్దరు కలిసి మోనాల్‌ను చాలా ఏడిపించారు. వాళ్లిద్దరూ కలిసి ఆమెను శ్మశాన వాటికకు డేటింగ్‌కు తీసుకెళ్లాలి అని బిగ్‌బాస్ సూచించాడు.

మళ్లీ హారికతో డేటింగా?
మోనాల్‌తో డేటింగ్ వ్యవహారం తెరపైకి రాగానే అభిజిత్ అసహనంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న హారికతో నాకు ఈ మోనాల్ వ్యవహారంలో నా పార్ట్ కావాలని లేదు. మోనాల్ విషయం వచ్చిన ప్రతీసారి నాకు ఏదో అడ్డు పడుతున్నది అంటూ ఆవేశంతో ఊగిపోయాడు.

ఫిట్టింగ్ ఏమీ లేదంటూ అఖిల్
అయితే ఈ టాస్క్ గురించి వినగానే మోనాల్ గజ్జర్ ముఖంలో కొంచెం సంతోషం కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ కనిపించింది. అయితే మోనాల్ డేటింగ్ విషయంలో పెద్దగా ఫిట్టింగ్ ఏమిలేదు. చేయాలనిపిస్తే చేయి.. లేదంటూ ఊరుకోవచ్చు అంటూ అరియానా, అవినాష్‌తో అఖిల్ అనడం కనిపించింది.

కంటతడి పెట్టిన అభిజిత్
బిగ్‌బాస్‌లో నా జర్నీ అంతా మోనాల్ విషయమే ఉంటుంది అంటూ అభిజిత్ భావోద్వేగంలో మునిగిపోయాడు. ఉద్వేగానికి లోనైన అభిజిత్ కంటతడి పెట్టుకోవడంతో హారిక, సోహెల్ ఓదార్చేందుకు ప్రయత్నించడం ప్రోమోలో కనిపించింది. అయితే ఈ రోజు ఎపిసోడ్ ఫన్‌తోపాటు ఎమోషనల్‌గా ఉండే అవకాశం కలిగించింది.