For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss telugu 5: ఉమాదేవి కొంపముంచిన కర్రీ గొడవ.. ఎలిమినేషన్ కు సిల్లి కారణాలు..

  |

  మొత్తానికి రెండు వారాలు విజయవంతంగా పూర్తిచేసుకుని బిగ్ బాస్ షో మూడో వారంలోలోకి వెడెక్కే వాతావరణంతో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ఇద్దరు ఎలిమినేషన్ అవ్వగా నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఎంతో ఆసక్తిగా మారింది. ఎందుకంటే మొదట ఇద్దరి విషయంలో ఆడియన్స్ కి కొంత క్లారిటీ ఉంది కానీ ఈ సారి ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో మాత్రం ఊహలకందని విధంగా ఉంది. అయితే రెండో వారంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉమాదేవి విషయం లో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆమె హౌస్ లో మరికొన్ని రోజులు ఉంటే పోటీ మరింత రసవత్తరంగా సాగేది అనే కామెంట్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. వెళ్ళిపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి అని నెటిజన్లు వారి స్టైల్ లో రివ్యూ అయితే ఇస్తున్నారు.

  పెద్దపులి అంటూ..

  పెద్దపులి అంటూ..

  పవర్ఫుల్ కంటెస్టెంట్ గా పెద్దపులి అంటూ హౌస్ లోకి అడుగుపెట్టిన ఉమాదేవి తప్పకుండా మరికొన్నాళ్లపాటు వివాదాలతో నిలుస్తుందని అనుకున్నారు. గొడవ పెట్టుకుంటే వెంటనే ఇంట్లో నుంచి వెళ్లి పోయే అవకాశం అయితే లేదు. ఈ రెండు వారాల్లో అందరికంటే ఎక్కువగా గొడవలు పెట్టుకుంది మాత్రం ఉమాదేవి అనే చెప్పాలి. ఆమెపై కొందరు ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు కూడా అనిపించింది. అయినప్పటికీ సోలో గా నే ఫైట్ చేసింది.

   బూతులు మరీ ఎక్కువగా..

  బూతులు మరీ ఎక్కువగా..


  గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ షోలో కాస్త ఎక్కువ బూతులు అయితే గట్టిగానే వినిపించాయి. ముందుగా మొదటి వారం లో ఎలిమినేట్ అయినటువంటి సరయి కొంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో గట్టిగానే వాదించింది పుట్టలో వేలు పెట్టడం అనే డైలాగు ఆమె వల్లే హైలెట్ అయ్యింది. కాజల్ మొదలుపెట్టిన ఆ డైలాగ్ తరువాత సరయు నుంచి ఉమాదేవి కూడా అలానే కొనసాగించారు.

  ఆలు కర్రీ ఎఫెక్ట్..

  ఆలు కర్రీ ఎఫెక్ట్..

  మొదట ఆలు కర్రీ విషయంలోనే ఉమాదేవికి ఇంట్లో వాళ్ళతో గొడవలు అయ్యాయి. దాదాపు అందరి కంటెస్టెంట్స్ తో ఆమెకు కాస్త ఎక్కువ గొడవలు అయ్యాయి. ఉమాదేవి నాన్ వెజ్ తినను అంటే తనకు ఆలు కర్రీ కావాలని నాగార్జునను ప్రత్యేకంగా అడిగింది. ఇక నాగార్జున కూడా ఇంట్లో ఆమె కోసమే ప్రత్యేకంగా అలు తెప్పించినట్లు క్లారిటీ ఇచ్చేశారు. అందుకే ఉమాదేవి హోస్ట్ మాటలకు కట్టుబడి ఎవరికి కూడా ఆ కర్రీ ఇవ్వలేదు. దీంతో కొంతమందికి ఆ విషయం నచ్చలేదు. అంతే కాకుండా ఆమెను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు అనిపించింది. నామినేషన్స్ జరిగే క్రమంలో ఆమె నోరు జారడంతో కొందరు బాగానే హార్ట్ అయ్యారు. షణ్ముఖ్ లాంటి వారు ఆమె ఇంట్లో ఉండడం సరికాదని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు.

  టీ షర్ట్ చింపేస్తాను అంటూ..

  టీ షర్ట్ చింపేస్తాను అంటూ..

  ప్రియాంకతో పాటు విశ్వ, ఆనీ మాస్టర్ కూడా గట్టిగానే గొడవ పెట్టుకున్నారు. కాజల్ తో కూడా ఆమెకు ఏమాత్రం సరితూగలేదు. ముఖ్యంగా అని మాస్టర్ తో ఆమె ఆలు కర్రీ దగ్గర గొడవ పెట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేసి నామినేట్ చేసినట్లు అనిపించింది. అని మాస్టర్ వల్లే తనకు బ్యాడ్ నేమ్ వచ్చింది అంటూ నామినేషన్ల లో కూడా ఆమె ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. నీ టీషర్ట్ చంపేస్తాను అంటూ అనడం కూడా ఉమాదేవి పై నెగటివ్ ఇంప్రెషన్ కలిగించింది.

  బూతులు కూడా రివర్స్ అయ్యాయి

  బూతులు కూడా రివర్స్ అయ్యాయి

  పెద్ద నోరు, గయ్యాలి అని అందరూ కామెంట్ చేసినా కూడా ఉన్నది ఉన్నట్లు చెప్పడం తన అలవాటు అంటూ ఉమాదేవి తన స్టైల్ లో చెప్పుకుంటూనే వస్తుంది. తనకు నచ్చిన విధంగానే ఉంటాను అని గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. అయితే రెండవ వారం నామినేషన్స్ లో ఆమె గట్టిగానే పోటీ ఇచ్చినప్పటికీ కూడా పొరపాటున బూతులతో నోరు జారడం పెద్ద మైనస్ గా మారింది. నీ అమ్మ అని తిట్టినట్లు కూడా సిరి ఆరోపణలు చేసింది. ఇక ఆ తర్వాత అన్ని తప్పులు తెలుసు ఉన్నప్పటికీ కూడా జరగాల్సింది జరిగిపోయింది.

  లోబోతో రొమాన్స్ ఒకే కానీ..

  లోబోతో రొమాన్స్ ఒకే కానీ..

  అలాగే లోబోతో ఉమాదేవి ప్రత్యేకంగా చేసిన రొమాన్స్ అయితే రెండవ వారం బిగ్ బాస్ షో లో హైలెట్ గా నిలిచింది. ఇద్దరు కూడా ప్రేమ పక్షుల తరహాలో సరదాగా రొమాంటిక్ సన్నివేశాలతో నవ్వించారు. బొంగు పొట్టి అని ప్రేమగా అంటూ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అందించారు. ఉమా దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు రోజు కూడా లోబో చాలా ఎమోషనల్ అయ్యాడు. అంతే కాకుండా కలిసి డాన్స్ చేసింది. అంతకుముందు రోజు అయితే సోఫా పై కలిసి పడుకుని ఇద్దరు మాట్లాడుకునే విధానం కూడా హౌస్ లో అందరిని నవ్వించింది. అది హైలెట్ గా అయినప్పటికీ ఉమాదేవి చేసిన తప్పు లిమిట్ అప్పటికే దాటిపోవడంతో ఎఫెక్ట్ పడింది.

  Bigg Boss Telugu 5 Episode 7 Analysis..RJ Kajal the ultimate target for housemates
  బయటకు వచ్చిన తరువాత

  బయటకు వచ్చిన తరువాత

  ఫైనల్ గా ఉమాదేవి గట్టిగానే పోరాడింది గాని కాస్త దూకుడుతో బూతులు మాట్లాడటం ఆమెకు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఆలు కర్రీ తో పాటు ఆనీ మాస్టర్ తో జరిగిన గొడవ కూడా ప్రేక్షకుల్లో నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆమె అందరికీ క్షమాపణలు చెప్పింది కానీ అప్పటికే సమయం దాటిపోయింది ఇక హౌస్ లో నుంచి బయటకు వెళ్లి పోయేటప్పుడు కూడా ఆమె పెద్దగా అప్సెట్ అయితే అవ్వలేదు. తోటి సభ్యులతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి బయటకు అడుగు పెట్టింది. అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేకమైన ఇంటర్వ్యూలలో ఉమాదేవి కాస్త దూకుడుగా కామెంట్ చేసింది. కంటెస్టెంట్స్ లలో చాలా మంది కూడా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు అంటూ ముందుగానే ప్లాన్ వేసుకోవచ్చా అని కూడా ఆరోపణలు చేశారు.

  English summary
  Bigg boss telugu 5 behind the reasons uma devi elimination
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X