For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nataraj Master in Bigg Boss Telugu 5 : ఏడో నెల భార్యను వదిలేసి, ఏడుస్తూ ఏడిపించేశాడు!

  |

  తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎట్టకేలకు ఈరోజు మొదలయి పోయింది. ఈరోజు రోజు కర్టెన్ రైజర్ ఈవెంట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్ ల పరిచయ కార్యక్రమాలు జరిగాయి. ఆట షో ద్వారా కొరియోగ్రాఫర్ గా పరిచయం అయిన నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లో పన్నెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన స్వస్థలం ఏమిటి ? ఎలా సినిమాల్లోకి వచ్చారు ? ఎలా క్రేజ్ సంపాదించారు అనే వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం.

  సినిమా పిచ్చితో చదువు ఆపేసి

  సినిమా పిచ్చితో చదువు ఆపేసి

  నటరాజ్ మాస్టర్ అనబడే నటరాజ్ కస్తూరి వృత్తి రీత్యా నటుడు, కొరియోగ్రాఫర్ మరియు నిర్మాత. ఆయన ప్రధానంగా తెలుగు పరిశ్రమలో పాపులర్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ శుక్రవారం, ఏప్రిల్ 16, 1982 , భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, విజయవాడలో జన్మించాడు. అతను 10వ తరగతి వరకు అక్కడే చదువుకోగా ఆ తరువాత 1998 లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటడానికి హైదరాబాద్ చేరాడు. ఇక ఇక్కడ సెటిల్ అవ్వడానికి కెరీర్ ప్రారంభంల అతను చాలా కష్టపడ్డాడు.

   హోటల్ లో వెయిటర్ గా

  హోటల్ లో వెయిటర్ గా

  ఆయనకు సినీ రంగంలోకి ఎంట్రీ అంత ఈజీగా అయితే దొరకలేదు. ఎందుకంటే అది అంత సులభం కాదు కదా, అందుకే ఆయన కొంత కాలం ఒక హోటల్‌ లో వెయిటర్‌ గా చేరాడు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ హోటల్ శ్రీహరి 'సాంబయ్య' చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సత్యనారాయణకు చెందినది. ఒకరోజు సత్యనారాయణ నటరాజ్ నృత్య ప్రతిభను గుర్తించి, అతను శ్రీహరి భార్య డిస్కో శాంతి నృత్య సంస్థలో నటరాజ్‌ను చేర్చాడు.

  నిర్మాత అండతో

  నిర్మాత అండతో

  అలా హోటల్ వెయిటర్ నుంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ కి చేరిన నటరాజ్ మాస్టర్ తర్వాత హైదరాబాద్‌లోని కొన్ని సంస్థలలో డ్యాన్సింగ్ టీచర్‌ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత జెమిని టీవీలో 'డాన్స్ బేబీ డాన్స్' షోలో పాల్గొన్నారు. తరువాత, అతను 2001లో 'ఈ టీవీ డాన్స్ 2000' షోలో పాల్గొన్నాడు. 2006 లో, అతను 'వీధి' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత హైవే, సై, చక్రం మరియు గొడవ వంటి కొన్ని సినిమాల్లో నటించాడు.

  ఆటతో ఫేమస్

  ఆటతో ఫేమస్

  2007 లో, అతను 'ఆట సీజన్ 1' లో తన డ్యాన్స్ తో జనాన్ని ఆకట్టుకున్నాడు. ఓంకార్ కు ఫేవరేట్ గా మారడంతో ఆయనకు భరత్ మరియు నీతూలకు మెంటర్‌ గా 'ఆట సీజన్ 2'లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన 2008లో ఈ 'ఆట సీజన్ 2' టైటిల్ గెలుచుకున్నాడు. అతను ఆట సీజన్ 3లో పోటీదారులు భరత్ మరియు శ్రీ విద్యలకు మెంటర్‌గా పనిచేశాడు, కానీ ఈసారి 3వ స్థానంలో నిలిచాడు.

  తన శిశ్యురాలితోనే పెళ్లి

  తన శిశ్యురాలితోనే పెళ్లి

  2009 లో, అతను జీ తెలుగు టీవీలో 'మగధీర డేర్ టు డ్యాన్స్' అనే డ్యాన్స్ షో నిర్మించారు. ఆ తర్వాత అతను జెమిని టీవీ మరియు మా టీవీలో జడ్జ్, దర్శకుడు మరియు నిర్మాతగా కొన్ని కార్యక్రమాలు చేశారు. 2009 లో, నటరాజ్ నీతూ అనే తన ఆట సీజన్ 2 కంటెస్టెంట్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను తన భార్య నీతూతో కలిసి టీవీ షోలు, ఆడియో మరియు అవార్డు ఫంక్షన్లు వంటి 200 కి పైగా కార్యక్రమాలు చేశారు. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్న ఆయన ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతున్నారు.

  ఏమేరకు ఆయన ఆకట్టుకుంటారు

  ఏమేరకు ఆయన ఆకట్టుకుంటారు

  ఇక తన స్వస్థలం ఆగిరిపల్లి అని చెబుతూ అక్కడ తాను ఎలా సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నా అనే విషయాన్ని నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. అంతేకాక తన భార్యతో ఎలా ప్రేమలో పడ్డాను ఆమెకు ఎలా ప్రేమ వ్యక్తం చేశాను అనే విషయాలు కూడా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భంతో ఉందని ఇలాంటి సమయంలో బిగ్ బాస్ నుంచి ఫోన్ రావడంతో కాస్త సందిగ్ధంలో పడ్డా అని అన్నాడు.

  బిడ్డ లోకంలోకి రాగానే

  బిడ్డ లోకంలోకి రాగానే

  షో కి రావచ్చా అనే విషయం మీద చాలా ఆలోచన చేసి చివరికి రావాలని అనుకున్నాను అని తన బిడ్డ లోకంలోకి రాగానే తన చూడలేకపోవచ్చు కానీ ఈ ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్తాను అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక పుష్ప సినిమాలోని మేక సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు, ఆ తర్వాత నాగార్జున వచ్చి వివరాలు అడుగగా తన గురించి వివరాలు పంచుకున్నాడు. అలాగే మీరు హీరో అవ్వాలని వచ్చారు కదా అంటే అవునని చెబుతూ, తన కెరీర్ గురించి కొంత చెప్పుకొచ్చాడు. అలాగే తన ప్రేమ కథ గురించి చెబుతూ తన భార్య తన కోసం ఏళ్ల పాటు వేచి చూసిందని కలర్ ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఆమెను పట్టించుకోకపోయినా తనను ప్రేమిస్తూనే ఉందని మిగతావన్నీ ఫేక్ లవ్ స్టోరీలు అని తెలుసుకునే సమయానికి ఏళ్లు పట్టిందని ఆయన చెప్పుకొచ్చాడు.

  ఏడుస్తూ ఏడిపించేశాడు

  ఏడుస్తూ ఏడిపించేశాడు

  చివరికి ఆమెను వివాహం చేసుకుని ఇప్పుడు హ్యాపీగా ఉన్నా అని అన్నాడు. ఇక నాగార్జున నట్రాజ్ మాస్టర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మిగతా ఎవరికీ అవకాశం లేకపోయినా ఆయన భార్య ఏడో నెల గర్భం ఉండడంతో స్టేజి మీదకు తీసుకువచ్చారు. ఇక స్టేజ్ మీద తన భార్యను చూసి ఎమోషనలయ్యాడు నట్రాజ్ మాస్టర్. తన భార్య బలవంతం మీదే లోపలికి వెళుతున్నాణని అనడంతో నాగార్జున ఎందుకు అని అడిగారు. దానికి ఆమె సమాధానం చెప్పారు. ఇక భార్యను చివరిసారిగా హగ్ చేసుకుంటానని చెప్పి తన భార్య గర్భం మీద తల పెట్టి ఏడుస్తూ అందరినీ ఏడిపించేశాడు నటరాజ్ మాస్టర్. అలా ఆయన పన్నెండవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టాడు.

  English summary
  Nataraj Master is an Indian Flim Actor, Choreographer and Dance director who mainly works in Telugu Industry. In 2006, He made his debut in Telugu Film Industry with the ‘Veedhi’ movie. He then acted in few movies like Highway, Sye, Chakram and Godava.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X