twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5 విషాన్ని స్వీట్ చేయలేం.. మానస్‌తో వీజే సన్నీ ఆవేదన.. జస్వంత్‌ను జైల్లో పెట్టిన బిగ్‌బాస్

    |

    బిగ్‌బాస్ ఇంటిలో ఇంటి సభ్యులు అభిప్రాయ బేధాలు మరోసారి స్పష్టంగా కనిపించాయి. నాలుగు వారాలు గడిచినా గానీ ఇంటి సభ్యుల మధ్య పరస్పర అవగాహన కొరవడిందనే విషయం కనిపించింది. అయితే కెప్టెన్సీ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య గ్యాప్‌ను మరింత పెంచింది. కెప్టెన్సీ టాస్క్ తర్వాత ఇంటి సభ్యుల్లో కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలను వాడివేడిగా పంచుకొన్నారు. అక్టోబర్ 1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    కెప్టెన్సీ టాస్క్‌లో కంటెస్టెంట్ల తీరుపై

    కెప్టెన్సీ టాస్క్‌లో కంటెస్టెంట్ల తీరుపై

    కత్తులు గుచ్చి కెప్టెన్సీ రేసు నుంచి తప్పించే పోటీదారులను తప్పించే క్రమంలో కాజల్ వ్యవహార తీరును శ్వేతావర్మ ఎండగట్టింది. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెబుతుంటావు. నీవు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని శ్వేతా వర్మ అంటే.. అది నా గేమ్ ప్లాన్ అంటూ కాజల్ జవాబు చెప్పింది. అయితే నాకు ఇష్టమైన వ్యక్తికి సపోర్ట్ చేసే ఛాన్స్ తీసుకొంటాను అని కాజల్ అంటే.. నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి.. మరొకరికి కత్తి గుచ్చడం సరికాదు అని శ్వేత అన్నారు. అయితే అది నీ అభిప్రాయం అది.. నా అభిప్రాయం నాకు వేరే ఉంటుందనే విషయాన్ని కాజల్ చెప్పారు.

    మానస్‌తో వీజే సన్నీ ఆవేదన

    మానస్‌తో వీజే సన్నీ ఆవేదన

    ఇక తనకు ఎక్కువ మంది కత్తు గుచ్చి.. తప్పుడు కారణాలు చెప్పడంపై వీజే సన్నీ తన బాధను మానస్‌తో పంచుకొన్నారు. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా చెప్పిన కారణాలు చాలా చీప్‌గా ఉన్నాయి అని వీజే సన్నీ అన్నాడు. అయితే కొందరిని ఓ వ్యక్తి నడిపిస్తున్నాడు. అయితే అసలు విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఆ సమయం వస్తే అసలు విషయం బయటపడుతుంది అని మానస్ అంటే.. తిపిని విషయం చేయడం సులభం. కానీ విషాన్ని తీపి పదార్థంగా చేయలేం. అలా చేయడం చాలా కష్టం అంటూ వీజే సన్నీ మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు.

    యాంకర్ రవి నత్తలా ఉంటాడంటూ

    యాంకర్ రవి నత్తలా ఉంటాడంటూ

    ఇక మరోసారి జంతువుల పేర్లు చెప్పి నటరాజ్ ఫన్ క్రియేట్ చేశాడు. యాంకర్ రవి నత్త లాంటి వాడు అంటూ లోబోతో నటరాజ్ చెప్పాడు. అంతలోనే యాంకర్ రవి అటువైపు వస్తుండటంతో నత్త లాగా ఎలా నడుస్తున్నాడో చూడు అంటూ నటరాజ్ అన్నాడు. ఏమిటి అంటూ యాంకర్ రవి అంటే.. నిన్ను నత్తతో పోల్చాడు అంటూ లోబో చెప్పాడు. ఏంటి బాస్ నన్ను ఇలా జంతువులతో పోల్చడం.. అన్ని జంతువుల పేర్లు నాకేనా అంటూ యాంకర్ రవి అనడం కనిపించింది.

    నన్ను జంతువులతో పోల్చవద్దు అంటూ

    నన్ను జంతువులతో పోల్చవద్దు అంటూ

    అయితే తనను గుంటనక్క అంటూ ఇప్పటికే వేధిస్తున్న నటరాజ్ మాస్టర్‌పై ఘాటుగా యాంకర్ రవి స్పందించారు. నన్ను జంతువులతో పోల్చవద్దని నటరాజ్ మాస్టర్‌కు చెప్పు అంటూ లోబోతో అంటే.. సరే నేను చెబుతాను అంటూ యాంకర్ రవికి లోబో సమాధానం చెప్పాడు. అయితే తనను జంతువులతో పోల్చడం వల్ల ప్రేక్షకులకు మరో విధంగా ప్రొజెక్ట్ అవుతుంది అని యాంకర్ రవి అనడం కనిపించింది.

    జైలుకు వెళ్లిన జస్వంత్

    జైలుకు వెళ్లిన జస్వంత్

    ఇక ఇంటిలో చెత్తగా ఆఢిన వారు.. ఉత్తమ కంటెస్టెంట్ ఎంపికను బిగ్‌బాస్ మొదలుపెట్టారు. అభ్యర్థులు ఎంపిక ప్రక్రియను కెప్టెన్ శ్రీరాంకు అప్పగించారు. కంటెస్టెంట్లను అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొన్న అనంతరం శ్రీరాం ఉత్తమ కంటెస్టెంట్‌గా మానస్‌ను, చెత్త కంటెస్టెంట్‌గా జస్వంత్‌ను ఎంపిక చేశాడు. ఈ వారానికి ఉత్తమ కంటెస్టెంట్‌గా ఎంపికైన మానస్‌ను బిగ్‌బాస్ అభినందించారు. చెత్త కంటెస్టెంట్‌గా ఎంపికైన జస్వంత్‌ను జైల్లో పెట్టారు.

    English summary
    Bigg Boss Telugu 5 October 1st episode preveiw: On day 26th day Jaswanth sent Jail who pointed as the worst contest by housemates.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X