For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: చుట్టూ కెమెరాలున్నాయి జాగ్రత్త.. అలాంటి తప్పులు చేయొద్దంటూ వాళ్లిద్దరికి లహరి వార్నింగ్

  |

  తెలుగులో ప్రసారం అవుతోన్న షోలు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మద్దతు లభించడం లేదు. దీంతో చాలా కార్యక్రమాలు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్లకు అస్సలు పరిచయమే లేని కాన్సెప్టుతో మొదలు పెట్టి.. చాలా తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్ అయిన ఏకైక షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని ఇలాంటి షోకు తెలుగు ప్రేక్షకులు ఊహకే అందనంత రెస్పాన్స్ అందించారు. దీంతో ఇది రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదోది కూడా ప్రారంభం అయింది. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్‌ నుంచి తాజాగా హాట్ బ్యూటీ లహరి షారి ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఉన్న ఇద్దరికి కెమెరాల ముందు అలా చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   భారీ రేంజ్‌లో ప్రారంభం... రికార్డుతోనే

  భారీ రేంజ్‌లో ప్రారంభం... రికార్డుతోనే

  ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన బిగ్ బాస్ సీజన్లు విజయవంతం అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కుల, గొడవలు, కొట్లాటలు, రొమాన్స్ వంటి వాటితో మరింత రంజుగా మార్చేశారు. దీంతో ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌‌కు ఏకంగా 18 రేటింగ్ వచ్చేసింది.

  అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!

   ఫస్ట్ వీక్ సరయు.. సెకెండ్ వీక్‌లో ఉమ

  ఫస్ట్ వీక్ సరయు.. సెకెండ్ వీక్‌లో ఉమ

  ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండేలా బిగ్ బాస్ నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి వారంలో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో సరయు షో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక, ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగిన రెండో వారం నామినేషన్స్‌లో ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. ఇందులో సీనియర్ నటి ఉమాదేవి గతవారం జరిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యారు. అంటే రెండు వారాల్లో ఇద్దరు లేడీస్‌ వెళ్లిపోయారు.

  మూడో వారం కూడా అమ్మాయే అవుట్

  మూడో వారం కూడా అమ్మాయే అవుట్

  బిగ్ బాస్ ఐదో సీజన్ ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, మూడో వారంలో జరిగిన నామినేషన్స్ టాస్కులో ఓ రేంజ్‌లో గొడవ జరిగింది. లహరి షారి క్యారెక్టర్‌ను విమర్శిస్తూ ప్రియ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత ఇందులోకి యాంకర్ రవి కూడా రావడంతో ఇది వివాదంగా మారింది. ఇంతటి హై ఓల్టేజ్ గొడవల వల్ల ఈ వారం నామినేషన్స్‌లో లహరి షారి, ప్రియ, ప్రియాంక సింగ్, మానస్, శ్రీరామ చంద్రలు వచ్చారు. మొదటి నుంచీ అనుకున్నట్లుగానే ఫలితం వచ్చింది. దీంతో తాజా ఎపిసోడ్‌లో లహరి షారి షోను ఎలిమినేట్ అయింది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  లహరి ఎలిమినేషన్‌కు కారణం అదేనా

  లహరి ఎలిమినేషన్‌కు కారణం అదేనా

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు అందరిలోనూ హాట్ హాట్‌గా ఉంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది లహరి షారి. అయితే, ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడం పెద్ద మైనస్ అయింది. 'అర్జున్ రెడ్డి', 'జాంబీ రెడ్డి', 'మాస్ట్రో' ఇలా పలు చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీనికి తోడు హౌస్‌లో అందరితో కఠువుగా ఉండడం.. తరచూ గొడవలకు దిగడం వంటివి లహరికి నెగెటివ్‌గా మారాయి. అలాగే టాస్కుల్లోనూ పెద్దగా కనిపించకపోవడం వంటి కారణాలతో ఆమె ఎలిమినేట్ అయి ఉండొచ్చు.

  లహరి షారి ఎలిమినేషన్... వాళ్లు షాక్

  లహరి షారి ఎలిమినేషన్... వాళ్లు షాక్

  ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో లహరి షారి ఎలిమినేట్ అయిందని తెలిసిన వెంటనే యాంకర్ రవితో పాటు కంటెస్టెంట్లు అందరూ షాక్ అయ్యారు. దీనికి కారణం ఆమెపై చెడుగా మాట్లాడిన కారణంగా ప్రియ ఈ సారి ఇంటి నుంచి వెళ్లిపోతుందని అంతా అనుకోవడమే. ఇక, నామినేషన్స్‌లో జరిగిన గొడవ వల్ల రవి ఆమె విషయంలో తప్పు చేశాడని అర్థం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో లహరి షో నుంచి ఎలిమినేట్ అవడంతో అతడు ఎంతగానో షాక్ అయ్యాడు. ఆ సమయంలో రవిని ఆమె హగ్ చేసుకుని 'జీవితంలో ఇదంతా ఓ భాగమే' అంటూ చెబుతూ హౌస్‌ను వీడింది.

  ప్రభాస్, ఎన్టీఆర్‌పై పవన్ కల్యాణ్ ఊహించని కామెంట్స్: సన్నాసుల్లారా అవి ఊరికే ఇవ్వలేదురా అంటూ!

  ఏ కంటెస్టెంట్ గురించి ఏం చెప్పింది

  ఏ కంటెస్టెంట్ గురించి ఏం చెప్పింది

  బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయే సమయంలో ప్రతి కంటెస్టెంట్ మనసులోని మాటలను చెబుతూ ఉంటారు. అలాగే, లహరి షారి కూడా కంటెస్టెంట్లు అందరి గురించి చెప్పింది. ఇందులో భాగంగానే గతంలో ఇద్దరు కంటెస్టెంట్లు చెప్పిన విధంగానే షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ కలిసి ఆడుతున్నారని ఆరోపించింది. దీనికి వాళ్లు ఒప్పుకోకపోవడంతో కాసేపు వాదన జరిగింది. ఆ తర్వాత శ్వేతను ధైర్యంగా ఉండమని, శ్రీరామ్‌ను టైమ్ వేస్ట్ చేయొద్దని, నటరాజ్‌ను భోళా శంకరుడు అని, విశ్వను స్ట్రాంగ్‌గా ఉండమని, హమీదాను ఆడవాళ్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పింది.

  Recommended Video

  SP Balasubrahmanyam : సజీవ మూర్తిగా ఎస్పీ బాలు.. చీకటి వెలుగులతోపాటు | Mohan Lal | Filmibeat Telugu
  కెమెరాలున్నాయి జాగ్రత్త అని వార్నింగ్

  కెమెరాలున్నాయి జాగ్రత్త అని వార్నింగ్

  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో యాంకర్ రవి, ఆర్జే కాజల్ వ్యవహరిస్తున్న తీరుపై చురకలు అంటించింది లహరి షారి. మొదట కాజల్‌ను ఉద్దేశించి 'వేరే వాళ్లు నామినేట్ చేశారని మీరు చేయకండి. దాని వల్ల ఈక్వేషన్స్ మారిపోతాయి' అంటూ చెప్పింది. ఇక, బయటకు వెళ్లిపోయే ముందు 'రవి, కాజల్.. మీ చుట్టూ వందల కెమెరాలు ఉన్నాయి. సో ఏం చేసినా జాగ్రత్తగా చేయండి. ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి' అంటూ పరోక్షంగా విమర్శలు చేసింది. మొత్తానికి లహరి షారి ఊహించని విధంగా హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Lahari Shari Shocking Comments on Ravi and RJ Kajal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X