For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షోలో శృతి మించిన రొమాన్స్.. పక్క పక్కన పడుకుని ఆ భాగాలను తాకుతూ దారుణంగా!

  |

  బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ షో దాదాపు ఐదేళ్లు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల మద్దతును విశేషంగా అందుకుని, రికార్డు స్థాయిలో రేటింగ్‌లను కూడా అందుకుంటోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ షో తెలుగులో ఏకంగా నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్‌ చేసుకుంది.

  ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. గతంలో కంటే ఈ సారి ఆరంభంలోనే హౌస్‌లో ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య రొమాన్స్ శృతి మించినట్లు కనిపించింది. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  గతంలో కంటే ఎక్కువ మజాను పంచుతూ

  గతంలో కంటే ఎక్కువ మజాను పంచుతూ

  బిగ్ బాస్ నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారు. అందుకు అనుగుణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులతో షో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో మరింత మజాను పంచుతూ సాగుతోంది.

  బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఆ శృంగారం ఎలా చేస్తారో వివరిస్తూ వీడియో.. అక్కలు, ఆంటీల కోసమే అంటూ!

  జంటలుగా మారేది ఎవరు? క్లారిటీ రాలేదు

  జంటలుగా మారేది ఎవరు? క్లారిటీ రాలేదు

  బిగ్ బాస్ షోకు ఆదరణ దక్కుతుందంటే అందులో కనిపించే లవ్ ట్రాకులు కూడా ప్రధాన కారణం అనే చెప్పాలి. అందుకే నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ కొందరిని జంటలుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎంతో మంది బిగ్ బాస్ జోడీలు అనిపించుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులర్ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఐదో సీజన్‌లో ఎవరు జంటలుగా మారతారు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు అనుగుణంగానే కొందరిని హైలైట్ చేస్తూ కలపడానికి ప్లాన్ చేస్తున్నారు.

  బిగ్ బాస్ ప్లాన్.. వాళ్లను కలుపుతూ హైలైట్

  బిగ్ బాస్ ప్లాన్.. వాళ్లను కలుపుతూ హైలైట్

  ఈ రియాలిటీ షోను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం లవ్ స్టోరీలపై ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఐదో సీజన్‌లో కూడా కొన్ని జంటలుగా మార్చాలని నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురిని జంటలుగా చూపిస్తూ ప్రోమోలు కూడా వదిలారు. అలాగే, రొమాంటిక్‌గా ఉండే టాస్కులు సైతం ఇస్తున్నారు. తద్వారా ప్రస్తుతానికి హౌస్‌లో రెండు మూడు జంటలు ఉన్నట్లు చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్లు తరచూ రొమాంటిక్‌గా చూసుకుంటూ.. హగ్గులు ఇచ్చుకుంటూ కనిపిస్తున్నారు. దీంతో షోపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది.

  Bigg Boss: పర్సనల్ విషయాలపై లేడీస్ పచ్చి మాటలు.. వాడుకుని వదిలేయ్ అంటూ ఆమెతో దారుణంగా!

  షోలో రెండు జంటలు... రొమాన్స్ మొదలు

  షోలో రెండు జంటలు... రొమాన్స్ మొదలు

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఇప్పటికే పలు జంటలు సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ షో జరిగిన తీరును గమనిస్తే.. సింగర్ శ్రీరామ చంద్ర.. హమీదా మధ్య ప్రేమ చిగురించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వీళ్లిద్దరూ పబ్లిక్‌గానే మసాజ్‌లు చేసుకోవడం.. రొమాంటిక్‌గా డ్యాన్స్ చేయడం వంటివి చేశారు. అలాగే, మాటలు కూడా కొంటెగానే మాట్లాడుతున్నారు. అలాగే, అనూహ్యం మానస్, లహరి షారి కూడా జంటగా మారారు. రెండు రోజులుగా వీళ్లిద్దరూ ప్రేమను ఒలకబోస్తున్నారు. ఈ క్రమంలోనే హగ్గులు ఇచ్చుకుంటూ రొమాన్స్‌ను ఓ రేంజ్‌లో పండిస్తున్నారు.

  వాళ్లిద్దరి కామెడీ రొమాన్స్... నవ్వుకున్నారు

  వాళ్లిద్దరి కామెడీ రొమాన్స్... నవ్వుకున్నారు

  బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి సీజన్‌లోనూ ఎంటర్‌టైనర్‌గా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఇక, ఈ సీజన్‌లో మాత్రం లోబో ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. తనదైన శైలి వ్యవహార శైలితో అందరినీ నవ్విస్తున్నాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో ఉన్న ఆడవాళ్లను తెగ ఏడిపిస్తున్నాడు. ఇక, అతడు.. సీనియర్ నటి ఉమాదేవితో జంటగా ఉన్నట్లు చేస్తున్న యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. అతడికి అనుగుణంగానే ఆమె కూడా రెచ్చిపోయి నటిస్తోంది. దీంతో వీళ్లిద్దరూ హౌస్‌లో జంటగా కనిపిస్తున్నారు. తద్వారా లోపల ఉన్న కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకూ మజాను పంచుతున్నారు.

  Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!

  బిగ్ బాస్ హౌస్‌లో శృతి మించిన రొమాన్స్

  బిగ్ బాస్ హౌస్‌లో శృతి మించిన రొమాన్స్

  ఏది చేసినా మితంగా చేస్తేనే రుచిస్తుంది. అలా అని అమితంగా చేస్తే ఓవర్ అవుతుంది. దీంతో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడిదే లోబో, ఉమాదేవి మధ్య జరిగిన రొమాన్స్ విషయాన్ని హైలైట్ చేస్తోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వీళ్లిద్దరూ పక్క పక్కనే పడుకుని ఓవర్‌గా రొమాన్స్ చేశారు. మరీ ముఖ్యంగా లోబో.. ఉమాదేవి పెదాలను, బుగ్గలను తాకుతూ ఏదేదో మాట్లాడాడు. అదే సమయంలో ఆమె కూడా అతడిని ముఖంపై, తలపై నిమురుతూ రెచ్చిపోయింది. ఇది కాస్త ఓవర్‌గా అనిపించింది. దీంతో వీళ్లిద్దరు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  వాళ్లంతా షాక్.. సిగ్గు పడిపోయిన నాగార్జున

  వాళ్లంతా షాక్.. సిగ్గు పడిపోయిన నాగార్జున

  శుక్రవారం జరిగిన ఈ సంఘటనను నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో మన టీవీలో చూపించాడు. ఇక, వీళ్లిద్దరి రొమాన్స్, మాటలు గమనించిన ఆయన తెగ సిగ్గు పడిపోయాడు. అదే సమయంలో హౌస్‌మేట్స్ కూడా వీళ్ల వ్యవహార శైలికి షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే రవి, సిరి అక్కడకు వచ్చి దగ్గర నుంచి వీళ్లను చూశారు. ఇది గమనించిన వాళ్లిద్దరూ పైకి లేచిపోయారు. ఆ సమయంలో హౌస్‌మేట్స్ అందరూ లోబో‌, ఉమాదేవిని ఆటపట్టించే ప్రయత్నం చేశారు. ఇదంతా ఫన్నీగానే సాగినప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మాత్రం కొంత ఇబ్బందిగానే అనిపించిందని చెప్పొచ్చు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Lobo and Umadevi Romance Highlight in The Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X