For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ రవికి మానస్ వార్నింగ్: ఆమెతో ఎఫైర్ ఉందని అనడంతో ఫైర్.. అతడి స్థాయి అదే అంటూ షాకింగ్‌గా!

  |

  తెలుగులో ఎంతో సక్సెస్ అయిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. అయితే, అవన్నీ పరిమితమైన కాన్సెప్టుతోనే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కానీ, గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌తో వచ్చి.. అప్పటి వరకూ ఉన్న బౌండరీలను బ్రేక్ చేసిన షో మాత్రం బిగ్ బాస్ అనే చెప్పాలి. సరికొత్తగా ఎన్నో మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంది కాబట్టే దీనికి తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. ఈ కారణంగానే ఇది ఏకంగా నాలుగు సీజన్లను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇక, ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను కూడా నిర్వహకులు ప్రారంభించారు. ఆరంభం నుంచే ఇది ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యాంకర్ రవిపై తాజాగా తోటి కంటెస్టెంట్ మానస్ ఫైర్ అయ్యాడు. అంతేకాదు, వేసేస్తారు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి

  కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి

  బిగ్ బాస్ షో విజయవంతంగా ప్రసారం అవడానికి జరిగే వ్యవహారాలే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ షోలో తరచూ ఏదో రకంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక జంట మధ్య లవ్ ట్రాకులు కూడా నడుస్తుంటాయి. బయట అస్సలు పరిచయం లేని కంటెస్టెంట్లు హౌస్‌లో మాత్రం ప్రేమాయణం నడుపుతున్నట్లు కనిపిస్తారు. వీటిపై హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో షో నిర్వహకులు సైతం ఇలాంటి వ్యవహారాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. తద్వారా వీటిని హైలైట్ చేసి మరీ చూపిస్తున్నారు.

  Bigg Boss 5 Promo: హమీదాతో శ్రీరామ్ రొమాంటిక్‌గా.. నీకు ఆ ఫీలింగ్స్ లేవా అని ఆమె అడగ్గానే!

   ప్రియాంక సింగ్ కామెంట్‌తో మొదలు

  ప్రియాంక సింగ్ కామెంట్‌తో మొదలు

  సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో అందరూ ప్రియాంక సింగ్‌ను చుట్టుముట్టి పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే యాంకర్ రవి ‘నువ్వు నన్ను అన్నయ్య అంటున్నావు. మిగతా వాళ్లను కూడా బ్రదర్ అనే పిలుస్తున్నావు. మరి మానస్‌ను మాత్రం ఎందుకు అలా పిలవట్లేదు' అని ప్రశ్నించాడు. దీనికి ప్రియాంక ‘నేను ఆయనను అలా పిలవను. తను నాకు బ్రదర్ లాంటోడు కాదు' అని సమాధానం ఇచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా కేకలు వేయడంతో ఇద్దరూ సిగ్గు పడిపోయారు. ఆ సమయంలో ‘ఎటో వెళ్లిపోయింది మానసు' అంటూ పాట పాడి కాసేపు ఇద్దరినీ ఏడిపించారు. దీంతో ఇదంతా సరదాగా సాగింది.

  ప్రియాంకను ఇమిటేట్ చేయడం వల్ల

  ప్రియాంకను ఇమిటేట్ చేయడం వల్ల

  బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో సిరి హన్మంత్‌కు పవర్ లభించింది. దీంతో ఒక కంటెస్టెంట్‌ను యజమానిగా, మరో కంటెస్టెంట్‌ను అతడికి పని మనిషిగా చేయమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో ఆమె ఓనర్‌గా షణ్ముఖ్, సర్వెంట్‌గా లోబోను ఎంచుకుంది. అందుకు అనుగుణంగానే వాళ్లిద్దరూ టాస్క్ చేశారు. ఈ క్రమంలోనే లోబోను హౌస్‌మేట్స్ అందరినీ ఇమిటేట్ చేయమని షణ్ముఖ్ ఆదేశించాడు. దీంతో అతడు ప్రియాంక సింగ్‌ను ఇమిటేట్ చేస్తోన్న సమయంలో యాంకర్ రవి.. మానస్‌ను ఆమె ఇష్టపడడాన్ని చూపించమని కోరాడు. అందుకు అనుగుణంగానే లోబో రొమాంటిక్‌గా చూస్తూ అందరినీ నవ్వించాడు.

  సుమ షోలో సంచలన సంఘటన: నిజంగా తిట్టుకున్న జబర్ధస్త్ భామలు.. కెమెరాలు ఉన్నా కిందపడి మరీ!

  ఆర్జే కాజల్‌ అతి ఆసక్తి.. మానస్‌తో అలా

  ఆర్జే కాజల్‌ అతి ఆసక్తి.. మానస్‌తో అలా


  బిగ్ బాస్ హౌస్‌లో ఆర్జే కాజల్ వ్యవహరించే తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పనులు చేస్తోన్న సమయంలోనే కాదు.. ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఆమె తరచూ కంటెస్టెంట్ల వ్యక్తిగత వ్యవహారాలపై చర్చలు జరుపుతుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరి దగ్గర ‘నీకు ఎలాంటి వాళ్లు కావాలి' అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇప్పటికే ఇలాంటి సంభాషణలు పలువురి దగ్గర చేసిన కాజల్.. ఎన్నో విషయాలను రాబట్టి బిగ్ బాస్‌కు కావాల్సిన కంటెంట్‌ను అందించింది. అదే సమయంలో తాజాగా మానస్‌తో కూడా ప్రియాంక సింగ్ వ్యవహారంపై మాట్లాడింది. ఇది ఎంతో ఆసక్తికరంగా సాగింది.

  తను చాలా స్వీట్.. అలా అని చేస్తారా?

  తను చాలా స్వీట్.. అలా అని చేస్తారా?

  ప్రియాంక సింగ్.. మానస్‌ను ఇష్టపడుతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్జే కాజల్ దీని గురించి మరోసారి అతడి దగ్గర ప్రస్తావించింది. ‘పింకీ విషయం గురించి ఏమని అనుకుంటున్నావ్? అసలు నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది?' అని ప్రశ్నలు వేసింది. దీనికి మానస్ ‘పింకీ చాలా మంచిది. చక్కగా వంట చేసి పెడుతుంది. ఎంతో రెస్పెక్ట్‌తో మాట్లాడుతుంది. చాలా కష్ట పడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. సో.. తనపై నాకు చాలా రెస్పెక్ట్ ఉంది' అని చెప్పాడు. దీంతో ప్రియాంకపై తనకు ఎలాంటి అభిప్రాయం ఉందో మానస్ స్పష్టం చేసేసినట్లైంది.

  Bigg Boss Telugu 5: ఆమె కాళ్లు పట్టుకుని ఏడ్చిన జస్వంత్.. మళ్లీ నోరు జారి అంత మాట అనడంతో!

  యాంకర్ రవిపై మానస్ తీవ్ర ఆగ్రహం

  యాంకర్ రవిపై మానస్ తీవ్ర ఆగ్రహం

  కాజల్‌తో జరిగిన సంభాషణ సమయంలోనే మానస్.. ప్రియాంక సింగ్ విషయంలో యాంకర్ రవి వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘పింకీ విషయంలో యాంకర్ రవి బ్రో చాలా అతి చేస్తున్నాడు అనిపిస్తుంది. తను బయట యాంకర్ కావొచ్చు. కానీ, ఇక్కడ కాదు కదా. తను కూడా మనలా కంటెస్టెంట్ మాత్రమే. ప్రతి దానికి ఓవర్‌గా రియాక్ట్ అవడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదో బిగ్ బాస్ షోకు తనే హోస్ట్ అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు. తను ఏంటో ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం' అంటూ అతడిపై కాజల్ ముందు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  Maha Samudram Movie Team On 'Cheppake Cheppake' Song
   రవిని తను వేసేస్తది అంటూ వార్నింగ్

  రవిని తను వేసేస్తది అంటూ వార్నింగ్

  ప్రియాంక సింగ్ విషయం గురించి కాజల్‌తో మాట్లాడుతోన్న సమయంలోనే మానస్ ‘పింకీ విషయంలో యాంకర్ రవి చేసే పని మా అమ్మకు తెలిస్తే.. ఇంటికి వెళ్లగానే వేసేస్తది' అంటూ వార్నింగ్ కూడా ఇచ్చుకున్నాడు. తద్వారా తన తల్లి తనకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పి బిగ్ బాస్ షోకు పంపించిందో అన్న విషయంపై అతడు క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి పైకి కామ్‌గానే కనిపిస్తోన్న మానస్.. లోపల మాత్రం ప్రతి విషయాన్ని నోట్ చేసుకుని పెట్టుకుంటున్నాడని ఈ సంఘటనతో అర్థం అయింది. మరి ఈ విషయం రవికి చెబుతాడా? లేక తనలో తానే దాచుకుంటాడా? అన్నది చూడాలి.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Maanas Shocking Comments on Anchor Ravi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X