For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5: ఏదైనా చేస్తే..వారు నాశనం అవ్వాలని కోరుకుంటావ్.. పింకీపై మానస్ పవర్ఫుల్ కౌంటర్

  |

  బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పటి నుంచి కూడా కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ బాండింగ్ చాలా డిఫరెంట్ గా కొనసాగుతోంది. గతంలో కంటే ఈసారి గ్లామర్ డోస్ రొమాన్స్ కాస్త తగ్గినప్పటికీ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే బాగానే వైరల్ అవుతున్నాయి. కొన్ని జంటలు అప్పుడప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటూ హైలెట్ గా నిలుస్తాయి. అందులో మానస్ ప్రియాంక మధ్య కాస్త భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. కొన్నిసార్లు వీరిద్దరు కూడా రొమాంటిక్ గా కనిపించినప్పటికీ ఆ తర్వాత ఎందుకో అలకలతో దూరమవుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పింకీ మాత్రం ఎక్కువగా మానస్ వైపు ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంది. కానీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో మానస్ తన మనసులో అనిపించిన ఒక బలమైన పదాన్ని పింకీ పై వాడడం అందరిని షాక్ కు గురి చేసింది.

  ముగ్గురు కూడా మూడు దారుల్లో

  ముగ్గురు కూడా మూడు దారుల్లో

  సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విల్లన్స్ టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. ఈసారి స్నేహాలకు బంధాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా తెలుస్తోంది. త్రిమూర్తులు అయినటువంటి షణ్ముఖ్ జెస్సీ సిరి ముగ్గురు కూడా మూడు దారులను చూసుకుంటూ ఎవరికి తోచినట్లుగా వారు వెళుతున్నారు. అయితే వారు మళ్ళీ ఎప్పుడు రంగులు మారుస్తారో ఊహించడం చాలా కష్టమని చెప్పవచ్చు.

   సిరి, షన్ను గొడవ

  సిరి, షన్ను గొడవ

  నెగిటివ్ టాక్ ఎక్కువగా వస్తోంది అనే కారణం చేత ఈ సారి ఇలా కానిచ్చేస్తున్నట్లు కూడా అర్థం అవుతోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లో ఎన్ని దెబ్బలు తగిలినా కూడా కంటెస్టెంట్స్ పెద్దగా బాధపడరు. కానీ కొన్నిసార్లు బలమైన మాటలకు కన్నీళ్లు వస్తూ ఉంటాయి. షణ్ముఖ్ అయితే ఈసారి సిరి క్యారెక్టర్ పై కూడా గట్టిగానే కౌంటర్ వేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యినంది. చాలా బాధగా ఉంది అంటూ తనలోని ఆవేదనను బయటపెట్టింది.

   మానస్ స్వీట్ కౌంటర్

  మానస్ స్వీట్ కౌంటర్

  అయితే సిరి షన్ను మధ్యలో గొడవలు రావడంతో హౌస్ లో చాలా మందికి ఆనందాన్ని కలిగించింది. కానీ ఎవరూ కూడా అంత ఈజీగా బయట పడలేదు. కానీ పింకీ మాత్రం సిరి ఏడవడం పై కౌంటర్ వేయడంతో మానస్ కూడా ఆమెకు చాలా ఓపెన్ గా కౌంటర్ ఇచ్చాడు. ఇక సిరి అలా ఏడుస్తుంటే ప్రియాంక కౌంటర్ వేసింది. ఎదురుగా ఒకరు బాధలో ఉంటే అలా జోకులు వేయకూడదు. ఎందుకంటే రేపు నువ్వు కూడా అలానే ఏడిస్తే అందరూ అలానే అనుకుంటారు అని మానస్ స్వీట్ గానే కౌంటర్ ఇచ్చాడు.

  Recommended Video

  Naga Shaurya Making Fun | Varudu Kavalenu Team Interview
  నాశనం అవ్వాలని కోరుకుంటావ్

  నాశనం అవ్వాలని కోరుకుంటావ్

  అంతే కాకుండా పింకి గతాన్ని తవ్వుతూ.. నీకు ఎవరైనా ఏదైనా చేస్తే..వారు నాశనం అవ్వాలని కోరుకుంటావ్ అని మానస్ మరింత బలంగా చెప్పడంతో వెంటనే హార్ట్ అయిన పింకీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనంతరం మళ్ళీ ఎప్పటిలానే మానస్ వద్దకు వచ్చి స్వీట్ గా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇక ఈసారి కెప్టెన్ అవ్వాలని మానస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు ఆనీ మాస్టర్ కూడా లేడీ బాస్ గా తనను తాను నిరూపించుకోవాలని ఆశపడుతోంది. మరి ఈ వారం ఎవరు ఇంట్లో నుంచి వెళ్లిపోతారో చూడాలి.

  English summary
  Bigg boss telugu 5 Manas sweet counter to Priyanka ,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X