Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Telugu 5 విన్నర్ అతడే... చెప్పేసిన రాహుల్.. ఇంతకీ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తుది అంకానికి చేరింది. ఇప్పటికే కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే హౌస్ లో మిగిలారు. అయితే ఈ సారి ఎవరు టైటిల్ గెలుస్తారు అనే విషయం మీద రకరకాల ప్రచారం జరుగుతుండగా ఎవరు గెలుస్తారు అనే విషయం మీద సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

హౌస్ లో ఆరుగురు
మునుపెన్నడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు హౌస్ లోకి ఏకంగా 19 మంది సభ్యులు ఎంటర్ అయ్యారు. గతంలో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చేవారు కానీ ఈసారి మాత్రం నేరుగా 19 మందిని పంపి ఆసక్తి రేకెత్తించారు బిగ్ బాస్ నిర్వాహకులు. అందుకే మొదటి వారం నుంచి క్రమం తప్పకుండా ఒక్కో కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు.

ఐదుగురు నామినేషన్స్ లో
చివరిగా ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా హౌస్ లో సిరి, షణ్ముఖ్, కాజల్, మానస్, సన్నీ, శ్రీ రామచంద్ర ఉన్నారు. తాజాగా జరిగిన నామినేషన్స్ లో శ్రీరామచంద్ర మినహా సన్నీ, షణ్ముఖ్, జస్వంత్, సిరి, కాజల్ అందరూ కూడా నామినేషన్స్ లోకి వెళ్ళిపోయారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు అయితే మిగతా వాళ్ళతో పోలిస్తే కాజల్, సిరి ఇద్దరికీ క్రేజ్ కాస్త తక్కువ ఉండడంతో వీళ్లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సపోర్ట్ చేయమని
అయితే ఆ సంగతి పక్కన పెడితే ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం వీజే సన్నీ అలాగే షణ్ముఖ్ జస్వంత్ మధ్య ఉండబోతోంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరికి సంబంధించి వారి వారి స్నేహితులు ఇప్పటికే తమ వాళ్లకు సపోర్ట్ చేయమని కోరుతున్నారు.

తెలివిగా సమాధానం
సీజన్ త్రీ లో విన్నర్ గా నిలిచి తర్వాత మంచి అవకాశాలు అందుకుంటూ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజన్లో ఎవరు చెప్పారు. ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు అని రాహుల్ సిప్లిగంజ్ ని గతంలో ప్రశ్నించగా ఆయన భలే తెలివిగా సమాధానం చెప్పాడు. ఈ సమయంలో బిగ్ బాస్ ఫైవ్ టైటిల్ ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కష్టం ఎందుకంటే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ దానికి అర్హులో అన్నట్లుగానే నాకు అనిపిస్తోంది అని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

వీజే సన్నీకి సపోర్ట్
కానీ తాజాగా ఇదే ప్రశ్న ఆయనని అడిగితే మాత్రం ఆయన ఈ సరి పేరు చెప్పి ఆశ్చర్యపరిచాడు. హౌస్ మొత్తం మీద మోస్ట్ ఎంటర్టైనింగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న వీజే సన్నీ రాహుల్ సిప్లిగంజ్ ను కూడా ఇంప్రెస్ చేసినట్లు కనిపిస్తోంది.. అందుకే రాహుల్ సిప్లిగంజ్ కూడా తన సపోర్ట్ ని వీజే సన్నీకి అందిస్తున్నాడు.
Recommended Video

చూడాలి మరి
అయితే ప్రధాన పోటీ సన్నీ, షణ్ముఖ్ మధ్య ఉండనుంది అనేది మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే సన్నీ ఫాన్స్ సన్నీని గెలిపించాలని, షన్ను ఫాన్స్ షన్నుని గెలిపించాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మరి రాహుల్ సిప్లిగంజ్ చెప్పినట్లుగా ఈ సారి సన్నీ కప్ గెలుస్తాడా? లేదా అనేది మరికొద్ది రోజులు చూడాలి మరి ఏం జరుగుతోంది అనేది.